UGC NET ADVANCED CITY INTIMATION SLIPS RELEASED ONE EXAM INSTEAD OF TWO EXAMS HERE ARE THE DETAILS UMG GH
UGC NET: యూజీసీ నెట్ అడ్వాన్స్డ్ సిటీ ఇన్టిమేషన్ స్లిప్స్ విడుదల.. ! రెండు పరీక్షలకు బదులుగా ఒకటే..! వివరాలు ఇవిగో ?
యూజీసీ నెట్ హాల్ టికెట్స్
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) యూజీసీ నెట్ (UGC NET) పరీక్షను ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తుంది. తాజాగా డిసెంబర్ 2021, జూన్ 2022 పరీక్షల కోసం అడ్వాన్స్డ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ (Advanced City Intimation Slip)ను ఎన్టీఏ విడుదల చేసింది.
టీచింగ్‌పై ఆసక్తి ఉండి కాలేజీలు లేదా యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలనుకునే వారికోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) యూజీసీ నెట్ (UGC NET) పరీక్షను ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తుంది. ఈ జాతీయ ప్రవేశ అర్హత పరీక్ష ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కూడా సాధించి ప్రతిష్టాత్మక సంస్థల్లో పరిశోధనలు చేయవచ్చు. కాగా తాజాగా డిసెంబర్ 2021, జూన్ 2022 పరీక్షల కోసం అడ్వాన్స్డ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ (Advanced City Intimation Slip)ను ఎన్టీఏ విడుదల చేసింది. గతేడాది డిసెంబర్లో యూజీసీ నెట్ నిర్వహించలేదన్న విషయం తెలిసిందే. అయితే దీనిని జూన్ సెషన్‌తో కలిపి నిర్వహిస్తుంది. రెండు పరీక్షలకు బదులుగా ఒకే పరీక్ష నిర్వహిస్తామని ఎన్టీఏ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ పరీక్ష కోసం రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్, ugcnet.nta.nic.in లేదా nta.ac.in నుంచి తమ సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా దీనిని https://examinationservices.nic.in/examsys22/downloadadmitcard/frmAuthforCity.aspx?appFormId=101052211 లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అడ్వాన్స్డ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాల్సిన ప్రాంతం లేదా సిటీ సెంటర్ గురించి తెలియజేస్తుంది. ఇది అడ్మిట్ కార్డ్ కాదని అభ్యర్థులు గమనించాలి. పరీక్ష హాల్లోకి ప్రవేశించేందుకు అవసరమైన అడ్మిట్ కార్డ్(Admit Card ) లేదా హాల్ టిక్కెట్‌ను అధికారిక వెబ్సైట్ల నుంచి అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాలి. యూజీసీ నెట్ అడ్మిట్ కార్డ్ త్వరలో రిలీజ్ కానుంది.
యూజీసీ నెట్ అడ్వాన్స్డ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ డౌన్లోడ్ చేయడం ఎలా
స్టెప్ 1: అధికారిక వెబ్సైట్, ugcnet.nta.nic.in విజిట్ చేయాలి.
స్టెప్ 2: రైట్ కార్నర్లో కింద ఉన్న సిటీ ఇన్టిమేషన్ సిప్ లింక్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్ 3: ఇప్పుడు ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
స్టెప్ 4: తరువాత అభ్యర్థులు తమ క్రెడెన్షియల్స్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
స్టెప్ 5: అప్పుడు యూజీసీ నెట్ 2022 ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ (UGC NET 2022 Exam City Intimation Slip) కార్డ్ అందుబాటులో ఉంటుంది. దానిని డౌన్లోడ్ చేసుకోవాలి.
ఈ ఏడాది, యూజీసీ నెట్లో కొత్త సబ్జెక్ట్ 'హిందూ స్టడీస్' యాడ్ చేయడంతో మొత్తం సబ్జెక్టుల సంఖ్య 82కి చేరుకుంది. దరఖాస్తు ఫీజు కూడా సుమారు 10 శాతం పెంచారు. జనరల్ కేటగిరీ లేదా అన్రిజర్వ్డ్ కేటగిరీకి దరఖాస్తు ఫీజు రూ.100 పెరిగి రూ.1,100కి చేరుకుంది. EWS, OBC-NCL ఫీజు రూ. 50 పెరిగింది. దాంతో వీరికి దరఖాస్తు ఫీజు రూ. 550కి చేరుకుంది. ఎస్సీ, ఎస్టీ, PwD, ట్రాన్స్జెండర్ల అప్లికేషన్ ఫీజు రూ. 25 పెంచడంతో రూ.275కి చేరుకుంది.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.