UGC NET: దేశంలోని వర్సిటీలు, కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ వంటి పోస్టుల భర్తీ కోసం ఏటా యూజీసీ నెట్(UGC NET) పరీక్షను నిర్వహిస్తారు. సంవత్సరంలో రెండుసార్లు ఈ ఎగ్జామ్ జరుగుతుంది. యూజీసీ నెట్ డిసెంబర్- 2022 పరీక్షలు ఫిబ్రవరి 21 నుంచి మార్చి 16 వరకు మొత్తం ఐదు దశల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఫలితాలు ఈ నెల చివరి నాటికి వెల్లడయ్యే అవకాశం ఉంది. రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nic.in లో తమ స్కోర్ కార్డ్‌ను చెక్ చేసుకోవచ్చు.
* ఫలితాలతో పాటు ఫైనల్ ఆన్సర్ కీ
యూజీసీ నెట్ ఫలితాలతో పాటు ఫైనల్ ఆన్సర్ కీని కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేయనుంది. ఇప్పటికే మార్చి 23న తాత్కాలిక ఆన్సర్ కీని విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాలు తెలపడానికి అభ్యర్థులకు మార్చి 25వరకు అవకాశం కల్పించారు.
* రిజల్ట్స్ చెకింగ్ ప్రాసెస్
- ముందు యూజీసీ నెట్ అధికారిక పోర్టల్ ugcnet.nta.nic.in విజిట్ చేయాలి. హోమ్ పేజీలోకి వెళ్లి ఎన్‌టీఏ యూజీసీ నెట్ రిజల్ట్స్-2022 లింక్‌పై క్లిక్ చేయాలి.
- దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ లాగిన్ వివరాలను ఎంటర్ చేసి సబ్‌మిట్ చేయాలి.
- ఇప్పుడు మీ రిజల్ట్స్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతాయి. ఫలితాలను చెక్ చేసుకున్న తరువాత మీ స్కోర్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
* ఐదు దశల్లో పరీక్ష
యూజీసీ నెట్ 2022 డిసెంబర్ కోసం 8,34,537 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. మొత్తం 83 సబ్జెక్ట్స్‌పై ఐదు దశల్లో పరీక్ష నిర్వహించారు. పరీక్ష 32 షిఫ్ట్‌ల్లో 16 రోజులపై పైగా జరిగింది. ఇందుకోసం దేశంలోని 186 సిటీల్లో 663 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఫేజ్ -I ఫిబ్రవరి 21 నుంచి 24 మధ్య జరగ్గా, ఫేజ్- II ఫిబ్రవరి 28 నుంచి మార్చి 3 వరకు, ఫేజ్- III మార్చి 3 నుంచి 6 వరకు, ఫేజ్- IV మార్చి 11 & 12 తేదీల్లో, ఫేజ్ -V మార్చి 13 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించారు.
Ikodoo Buds: కొత్త టెక్ కంపెనీ ఇకోడూ నుంచి ఇయర్‌బడ్స్ లాంచ్.. ధర, ఫీచర్లు చెక్ చేయండి..
* కనీస ఉత్తీర్ణత వివరాలు
యూజీసీ నెట్ పరీక్షలో పాస్ కావాలంటే అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు సాధించాల్సి ఉండగా, రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 35 శాతం మార్కులు పొందాలి. ఓవరాల్‌గా మాత్రమే కాకుండా, అభ్యర్థులు ప్రతి పేపర్‌లోనూ విడిగా పాస్ కావాల్సి ఉంటుంది.
* వయోపరిమితి చివరి తేదీ మార్పు
యూజీసీ నెట్ అభ్యర్థుల కోసం ఎన్‌టీఏ ఇటీవల నోటీస్ జారీ చేసింది. యూజీసీ నెట్-2022 డిసెంబర్ సెషన్ కు సంబంధించి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) పోస్ట్ కోసం గరిష్ట వయోపరిమితిని పరిగణలోకి తీసుకునే చివరి తేదీని వెల్లడించింది. యూజీసీ నెట్ పరీక్ష కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గతంలో గరిష్ట వయోపరిమితిని పరిగణించాల్సిన చివరి తేదీని ఫిబ్రవరి 1, 2023 గా నిర్ణయించింది. అయితే ప్రస్తుతం దీన్ని సవరించింది. JRF కోసం గరిష్ట వయోపరిమితిని పరిగణనలోకి తీసుకోవాల్సిన చివరి తేదీగా 2022 డిసెంబర్ 1ని NTA పేర్కొంది. అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ పరీక్షకు వయోపరిమితి లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, JOBS, UGC NET