హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

UGC NET: యూజీసీ నెట్-2022 డిసెంబర్ సెషన్ అప్‌డేట్.. JRF పోస్ట్‌ గరిష్ట వయోపరిమితి చివరి తేదీ ఇదే..

UGC NET: యూజీసీ నెట్-2022 డిసెంబర్ సెషన్ అప్‌డేట్.. JRF పోస్ట్‌ గరిష్ట వయోపరిమితి చివరి తేదీ ఇదే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశంలోని యూనివర్సిటీలు, కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టుల భర్తీకి అర్హత పరీక్షగా యూజీసీ నెట్‌ పరీక్షను ఎన్‌టీఏ నిర్వహిస్తుంది. యూజీసీ నెట్-2022 డిసెంబర్ సెషన్‌కు సంబంధించి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) పోస్ట్ కోసం గరిష్ట వయోపరిమితిని పరిగణలోకి తీసుకునే చివరి తేదీని వెల్లడించింది. 

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

దేశంలోని యూనివర్సిటీలు, కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టుల భర్తీకి అర్హత పరీక్షగా యూజీసీ నెట్‌ పరీక్షను ఎన్‌టీఏ నిర్వహిస్తుంది. తాజాగా యూజీసీ నెట్ (UGC NET) అభ్యర్థుల కోసం ఎన్‌టీఏ ఓ నోటీస్ జారీ చేసింది. యూజీసీ నెట్-2022 డిసెంబర్ సెషన్‌కు సంబంధించి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) పోస్ట్ కోసం గరిష్ట వయోపరిమితిని పరిగణలోకి తీసుకునే చివరి తేదీని వెల్లడించింది.

గతంలో చివరి తేదీ ఇలా

నెట్ పరీక్ష కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గతంలో గరిష్ట వయోపరిమితిని పరిగణించాల్సిన చివరి తేదీని 2023 ఫిబ్రవరి 1గా నిర్ణయించింది. అయితే ప్రస్తుతం దీన్ని సవరించారు. JRF కోసం గరిష్ట వయోపరిమితిని పరిగణలోకి తీసుకోవాల్సిన చివరి తేదీగా 2022 డిసెంబర్ 1ని NTA పేర్కొంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పరీక్షకు వయోపరిమితి లేదు.

UGC NET బ్యూరో విజ్ఞప్తి

UGC NET బ్యూరో JRF కోసం దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయోపరిమితిని 01.02.2023కి బదులుగా 01.12.2022గా నిర్ణయించాలని NTAని అభ్యర్థించింది. దీంతో UGC-NET-2022 డిసెంబర్ సెషన్ కోసం JRF దరఖాస్తు కోసం గరిష్ట వయోపరిమితి లాస్ట్ డేట్‌గా 01.12.2022ను నిర్ణయించామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక నోటీసులో పేర్కొంది.

యూజీసీ నెట్ 2022 డిసెంబర్ సెషన్ పరీక్షలు 2023 ఫిబ్రవరి 21 నుంచి మార్చి 10 వరకు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన అడ్మిట్ కార్డులు ఫిబ్రవరి రెండో వారంలో విడుదల కానున్నాయి. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇది జవనరి 17న ముగియనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు ugcnet.nta.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

రెండు షిఫ్ట్‌ల్లో పరీక్ష

అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ జనవరి 19, 20 తేదీల్లో ఓపెన్ అవుతుంది. ఎగ్జామ్ సెంటర్ సిటీ వివరాలు ఫిబ్రవరి మొదటి వారంలో వెల్లడి కానున్నాయి. ఆడ్మిట్ కార్డ్‌లు ఫిబ్రవరి రెండో వారంలో అందుబాటులోకి రానున్నాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలుగా నిర్ణయించారు. యూజీసీ నెట్ పరీక్ష రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. మొదటి షిప్టు ఉదయం 9 - 12 గంటల వరకు, రెండో షిప్టు మధ్యాహ్నం 3-6 గంటల వరకు ఉంటుంది. UGC NET పరీక్ష 83 సబ్జెక్టులకు CBT విధానంలో నిర్వహించనున్నారు.

కనీస ఉత్తీర్ణత మార్కులు

యూజీసీ నెట్ పరీక్షలో పాస్ కావాలంటే అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు సాధించాల్సి ఉండగా, రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 35 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఓవరాల్‌గా మాత్రమే కాకుండా, అభ్యర్థులు ప్రతి పేపర్‌‌లోనూ విడిగా పాస్ కావాల్సి ఉంటుంది.

యూజీసీ నెట్-2023 జూన్ సెషన్ వివరాలు

జనవరి 5వ తేదీన ఎన్‌టీఏ మరో నోటీస్ జారీ చేసింది. UGC NET 2023 జూన్ సెషన్ కోసం పరీక్ష తేదీలను వెల్లడించింది. UGC NET 2023 జూన్ సెషన్ పరీక్షలు జూన్ 13 నుంచి 22 వరకు జరగనున్నాయి. ఈ పరీక్ష తేదీలను డిసెంబర్ 30న UGC ఛైర్మన్ ప్రకటించారు. తాజాగా NTA ధృవీకరించింది.

First published:

Tags: Career and Courses, Exams, JOBS, UGC NET

ఉత్తమ కథలు