Home /News /jobs /

UGC NET 2022 FROM JULY 8 NTA ANNOUNCES SCHEDULE UMG GH

UGC NET: యూజీసీ నెట్ 2022 ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలు ఎప్పటి నుంచి ప్రారంభం అంటే..?

యూజీసీ నెట్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్రకటన.

యూజీసీ నెట్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్రకటన.

యూజీసీ (UGC) నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET) డిసెంబర్ 2021, జూన్ 2022 టర్మ్‌లకు సంబంధించిన జాయింట్ ఎగ్జామ్ (Exam) షెడ్యూల్ విడుదలైంది. నెట్ పరీక్షలు 2022 జూలై 8న ప్రారంభమై జూలై 9, 11, 12 వరకు జరగనున్నాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది.

ఇంకా చదవండి ...
యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET) డిసెంబర్ 2021, జూన్ 2022 టర్మ్‌లకు సంబంధించిన జాయింట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదలైంది. నెట్ పరీక్షలు 2022 జూలై 8న ప్రారంభమై జూలై 9, 11, 12 వరకు జరగనున్నాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. మళ్లీ ఆగస్టు 12న ప్రారంభమై అదేనెల 13, 14 తేదీల వరకు జరగనున్నాయని తెలిపింది. తాజాగా ప్రకటించిన షెడ్యూల్ (Schedule) అధికారిక వెబ్‌సైట్‌www.nta.ac.inలో అందుబాటులో ఉందని ఎన్‌టీఏ (NTA) తెలిపింది. కాగా అప్లికేషన్‌లో మార్పులు చేర్పులు చేయడం కోసం 2022 మే 31 నుంచి జూన్ 1 రాత్రి 9 గంటల వరకు కరెక్షన్ విండోను ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే.

త్వరలోనే UGC NET కోసం వివరణాత్మక షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు ఏన్‌టీఏ తెలిపింది. పరీక్షకు సంబంధించిన తాజా అప్‌డేట్స్ కోసం అభ్యర్థులు క్రమం తప్పకుండా NTA వెబ్‌సైట్లు www.nta.ac.in, https://ugcnet.nta.nic లను సందర్శించాలని సూచించింది. షెడ్యూల్‌కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే, హెల్ప్ డెస్క్‌ 011 40759000కి కాల్ చేయవచ్చు లేదా ugcnet@nta.ac.inకి మెయిల్ చేయవచ్చు.

ఇదీ చదవండి: మానవత్వం పరిమళించింది.. కుక్క కోసం ఏకమైన ఓ గ్రామం.. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ..!


సాధారణంగా జాతీయ స్థాయి అర్హత పరీక్ష అయిన యూజీసీ నెట్ ఎగ్జామ్‌ను ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా UGC NET డిసెంబర్ 2021, జూన్ 2022 టర్మ్‌ల పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలను క్రమబద్ధీకరించడానికి NTA తాజాగా డిసెంబర్ 2021, జూన్ 2022 దఫాలను విలీనం చేస్తూ ఒకేసారి పరీక్షలను నిర్వహించనుంది. నెట్ పరీక్షలు జూలై 8 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో, త్వరలోనే హాల్ టిక్కెట్లు విడుదల కానున్నాయి.

సబ్జెక్ట్‌ల పెంపు
యూజీసీ నెట్ పరీక్షపే ఇప్పటివరకు 81 సబ్జెక్టుల్లో నిర్వహించారు. అయితే ఈసారి మాత్రం మరో సబ్జెక్టును జోడించింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC). UGC సబ్జెక్టు జాబితాకు 'హిందూ అధ్యయనాలు' (సబ్జెక్ట్ కోడ్ 102) అనే కొత్త సబ్జెక్ట్ ను జోడించింది.



మరోవైపు, దేశంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులందరూ తప్పనిసరిగా ఎనిమిది నుంచి పది వారాల పాటు రీసెర్చ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లో పాల్గొనాల్సి ఉంటుందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఇటీవల ప్రకటించింది. ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. రీసెర్చ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లు ప్రధానంగా విద్యార్థుల ఉపాధి లక్ష్యంగా, పరిశోధన సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడతాయని యూజీసీ పేర్కొంది.

జాతీయ విద్యా విధానం-2020 ప్రకారం.. ఇంటర్న్‌షిప్‌లను ప్రమోట్ చేయడానికి మర్గదర్శకాలను జారీ చేసినట్లు యూజీసీ ప్రకటించింది. ఇంటర్న్ షిప్‌ రీసెర్చ్ సమయంలో విద్యార్థుల కోసం ఇతర ఉన్నత విద్యా సంస్థలకు చెందిన రీసెర్చ్ సూపర్‌వైజర్‌ను నియమిస్తారు. ఈ రీసెర్చ్ ఇంటర్న్‌షిప్ ప్రాజెక్ట్, టైమ్ లిమిట్‌తో అదే సంస్థలో జరగనుంది. రీసెర్చ్ ఇంటర్న్‌షిప్‌ను అభ్యసించే విద్యార్థులకు రీసెర్చ్ టూల్స్, టెక్నిక్స్, మెథడాలజీస్, పరికరాలపై శిక్షణ ఇవ్వనున్నారు.
Published by:Mahesh
First published:

Tags: Career and Courses, Exams, JOBS, UGC NET

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు