Home /News /jobs /

UGC NET 2022 ALERT FOR UGC NET CANDIDATES EXTENSION OF APPLICATION DEADLINE KEEP THESE THINGS IN MIND EVK

UGC NET 2022: యూజీసీ నెట్ అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడ‌గింపు.. ఈ విష‌యాలు గుర్తుంచుకోండి

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

    యూజీసీ నెట్ (UGC NET) అర్హత పరీక్ష జూన్ 2022 కు సంబంధించి నోటిఫికేష‌న్ విడుద‌లై.. ద‌ర‌ఖాస్తులు ప్రారంభ‌మైంది. ఈ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ మే 20, 2022తో ముగిసింది. అయితే తాజాగా అభ్య‌ర్థుల‌కు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) గుడ్ న్యూస్ తెలిపింది. ద‌ర‌ఖాస్తు తేదీని మే 30,2022 వ‌ర‌కు పొడ‌గించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు. మొత్తంగా 82 సబ్జెక్టులకు ఈ ఎగ్జామ్ ను నిర్వహించనున్నారు. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (CBT) పద్ధతిలో ఈ ఎగ్జామ్‌ ఉంటుంది. అయితే అడ్మిట్ కార్డుల విడుదల, ఎగ్జామ్ తేదీలకు సంబంధించిన వివరాలు ఇప్పటి వరకు ఖరారు చేయలేదు. ఇందుకు సంబంధించిన తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని ఎన్టీఏ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఇందులో స్కోర్‌ సాధించిన అభ్యర్థులు జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీ పడొచ్చు. అభ్యర్థులు ఇతర వివరాల కోసం..  https://ugcnet.nta.nic.in/ వెట్‌సైట్‌ను సంప్రదించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది.

    Railway Jobs: రైల్వేలో 2077 ఉద్యోగాలు.. ప‌దోత‌ర‌గ‌తి పాస్ అయితే చాలు.. ఎటువంటి ప‌రీక్ష లేకుండా ఎంపిక‌

    . ఈసారి 2021 డిసెంబర్, 2022 జూన్ ఎడిషన్స్ రెండిటికీ సంయుక్తంగా నెట్ పరీక్షను నిర్వహించాలని ఎన్‌టీఏ నిర్ణయించింది. రెండు ఎడిషన్లకు ఒకే పరీక్ష కాబట్టి, దరఖాస్తు రుసుమును పెంచింది. 10 శాతం పెంపుతో జనరల్ కేటగిరీ లేదా అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ దరఖాస్తుదారులు రూ.1,100 చెల్లించాల్సి ఉంటుంది. వీరికి గతేడాది రూ.1,000 మాత్రమే రుసుము ఉండేది. ఇక EWS, OBC-NCL కెటగిరీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ. 50 పెంపుతో రూ.550 చెల్లించాల్సి ఉంది. SC, ST, PwD, ట్రాన్స్‌జెండర్ల దరఖాస్తు రుసుమును రూ. 25 పెంచారు. దీంతో ఇది ఇప్పుడు రూ.275కు చేరింది. ఫీజు మాత్రమే కాదు.. ఈసారి సబ్జెక్ట్స్ కూడా పెంచింది యూజీసీ. ఫలితంగా అభ్యర్థులకు మరిన్ని సబ్జెక్ట్స్ ఎంచుకునే అవకాశం లభిస్తోంది.

    యూజీసీ నెట్ పరీక్షను ఇప్పటివరకు 81 సబ్జెక్టుల్లో నిర్వహించారు. అయితే ఈసారి మాత్రం మరో సబ్జెక్టును జోడించింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC). సమాచార బులెటిన్ ప్రకారం.. UGC సబ్జెక్టు జాబితాకు 'హిందూ అధ్యయనాలు' (సబ్జెక్ట్ కోడ్ 102) అనే కొత్త సబ్జెక్ట్‌ని జోడించింది. దీంతో UGC NET దరఖాస్తు ఫారమ్‌ను పూరించేటప్పుడు అభ్యర్థులు ఇప్పుడు 82 విభాగాల జాబితా నుండి ఎంచుకోవచ్చు.

    TS Constable Jobs: కానిస్టేబుల్ ఉద్యోగార్థుల‌కు గుడ్ న్యూస్‌.. రిక్రూట్‌మెంట్‌లో కొత్త అప్‌డేట్‌

    పరీక్ష నిర్వహించే నగరాలను కూడా పెంచడం విశేషం. ఈసారి జరిగే యూజీసీ నెట్ -2022 పరీక్షను అదనంగా మరికొన్ని నగరాల్లో నిర్వహించనున్నారు. ఈ ఏడాది దాదాపు 541 నగరాల్లో పరీక్ష జరగనుంది. గతేడాది కేవలం 239 నగరాల్లో మాత్రమే నిర్వహించారు. పరీక్ష నగరాల పూర్తి జాబితాను ఎన్‌టీ‌ఏ ప్రకటించిన సంగతి తెలిసిందే.  పరీక్షకు సంబంధించిన అభ్యంతరాలను నివేధించడానికి దరఖాస్తుదారులకు ఏన్‌టీఏ అనుమతించింది. ఇందు కోసం పరీక్ష ముగిసిన వెంటనే ప్రశ్నాపత్రానికి సంబందించిన ప్రాథమిక ఆన్సర్ కీ‌ను ఎన్‌టీఏ విడుదల చేయనుంది. అభ్యర్థులు గతంలో ప్రతి ఛాలెంజ్‌కు రూ. 1,000 చొప్పున తాత్కాలిక సమాధాన కీని సవాలు చేసేవారు. ఇప్పుడు ఒక్కో ఛాలెంజ్‌కు కేవలం రూ.200 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.

    యూజీసీ నెట్ -2022 పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే20గా ఎన్‌టీఏ నిర్ణయించింది. పరీక్ష కంప్యూటర్ మోడ్‌లో జరగనుంది. రెండు షిఫ్టుల్లో 180 నిమిషాలు లేదా మూడు గంటల పాటు జరగనుంది. మొదటి షిప్ట్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం వరకు, రెండోది మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. యూజీసీ నెట్ పేపర్ I 100 మార్కులకు, పేపర్ IIను ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ ఫార్మాట్‌లో 200 మార్కులకు నిర్వహించనున్నారు. అన్ని ప్రశ్నలను ప్రయత్నించడం తప్పనిసరి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు ఉంటాయి. పరీక్ష ఇంగ్లీష్ , హిందీ మీడియంలో మాత్రమే జరగుతుంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Career and Courses, UGC NET

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు