UGC NET 2022 ALERT FOR UGC NET 2022 CANDIDATES CHANGES IN EXAMINATION FEES DETAILS EVK
UGC NET 2022: యూజీసీ నెట్ 2022 అభ్యర్థులకు అలర్ట్.. పరీక్ష ఫీజుల్లో మార్పులు.. వివరాలు
ప్రతీకాత్మక చిత్రం
UGC NET 2022 | యూనివర్సిటీలు, గుర్తింపు పొందిన కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, జేఆర్‌ఎఫ్ చేయడానికి అర్హత పరీక్షగా ఉపయోగపడుతుంది. ఈసారి అభ్యర్థులకు పరీక్షకు సంబంధించి చిన్న మార్పు జరిగింది. ఈ సారి అప్లికేషన్ ఫీజులను 10 శాతం మేర పెంచింది.
యూజీసీ నెట్ అర్హత పరీక్ష జూన్ 2022 కు సంబంధించిన నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా విడుదల చేసింది. డిసెంబర్ 2021, జూన్ 2022 రెండింటికిగానూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తాజాగా ఒకే నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ యూజీసీ నెట్ ద్వారా.. యూనివర్సిటీలు, గుర్తింపు పొందిన కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, జేఆర్‌ఎఫ్ చేయడానికి అర్హత పరీక్షగా ఉపయోగపడుతుంది. ఈసారి అభ్యర్థులకు పరీక్షకు సంబంధించి చిన్న మార్పు జరిగింది. ఈ సారి అప్లికేషన్ ఫీజులను 10 శాతం మేర పెంచింది. గతంలో జనరల్ అభ్యర్థులు రూ.1000 చెల్లిస్తే సరిపోయేది. ప్రస్తుతం అది రూ.1100కు పెరిగింది. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారు రూ.500కు బదులు రూ.550 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఇతరులు అప్లికేషన్ ఫీజులో (రూ.275) ఎలాంటి మార్పులేదు.
యూజీసీ నెట్‌కు సంబంధించి ముఖ్యమైన సమాచారం..
- అభ్యర్థులు మే 20 వరకు అప్లై చేసుకోవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు.
- అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
- మొత్తంగా 82 సబ్జెక్టులకు ఈ ఎగ్జామ్ ను నిర్వహించనున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) పద్ధతిలో ఈ ఎగ్జామ్ ఉంటుంది.
- అయితే అడ్మిట్ కార్డుల విడుదల, ఎగ్జామ్ తేదీలకు సంబంధించిన వివరాలు ఇప్పటి వరకు ఖరారు చేయలేదు.
- ఇందుకు సంబంధించిన తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని ఎన్టీఏ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
- ఇందులో స్కోర్ సాధించిన అభ్యర్థులు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీ పడొచ్చు.
- అభ్యర్థులు ఇతర వివరాల కోసం.. https://ugcnet.nta.nic.in/ వెట్‌సైట్‌ను సంప్రదించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది.
యూజీసీ ఏటా రెండు సార్టు నెట్ పరీక్షను నిర్వహిస్తున్నది. అయితే 2021 డిసెంబర్‌లో జరగాల్సిన పరీక్ష కరోనా కారణంగా రద్దయింది. దీంతో ఈ ఏడాది జూన్ ఎడిషన్‌తో కలిపి దానిని నిర్వహిస్తున్నది. మొత్తం 82 సబ్జెక్టుల్లో ఈ అర్హత పరీక్ష ఉండనుంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.