UGC NET 2021 SECOND PHASE EXAM SCHEDULE RELEASED KNOW EXAM DATES GH EVK
UGC NET 2021: యూజీసీ నెట్ సెకండ్ ఫేజ్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్ష తేదీలు ఇవే
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ లోగో
UGC NET 2021: కొత్త షెడ్యూల్ ప్రకారం, యూజీసీ నెట్ డిసెంబర్-2021 ఫేజ్-2 పరీక్షలు డిసెంబర్ 24 నుంచి డిసెంబర్ 30 వరకు జరగనున్నాయి. ఫేజ్-1లో రీషెడ్యూల్ (Schedule) చేసిన పేపర్లను డిసెంబర్ 30న నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పరీక్ష తేదీల (Exam Dates) ను విడుదల చేసింది.
యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల అర్హత, పీహెచ్డీ ప్రవేశాల కొరకు ఏటా నిర్వహించే యూజీసీ నెట్ (UGC NET) పరీక్ష ఫేజ్-1 పరీక్షలు ఇటీవలే పూర్తయ్యాయి. ఇంకా ఫేజ్-2 పరీక్షలు జరగాల్సి ఉంది. మరోవైపు, జవాద్ తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కొన్ని ప్రాంతాల్లో వాయిదా పడ్డ ఫేజ్-1 పరీక్షలను కూడా నిర్వహించాల్సి ఉంది. దీంతో, ఫేజ్-1 (Phase -1 ) లో మిగిలిపోయిన ఏరియాలతో పాటు ఫేజ్-2 పరీక్షల కోసం కొత్త టైమ్ టేబుల్ (Time Table)ని విడుదల చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్సైట్ www.nta.ac.inలో కొత్త షెడ్యూల్ చెక్ చేసుకోవచ్చు. కొత్త షెడ్యూల్ (Schedule) ప్రకారం, యూజీసీ నెట్ డిసెంబర్-2021 ఫేజ్-2 పరీక్షలు డిసెంబర్ 24 నుంచి డిసెంబర్ 30 వరకు జరగనున్నాయి. లేబర్ వెల్ఫేర్ (Labor welfare), సోషల్ వర్క్, ఒడియా, తెలుగు (Telugu) సహా ఫేజ్- 1లో రీషెడ్యూల్ చేసిన పేపర్లను 2021 డిసెంబర్ 30న నిర్వహించనున్నట్లు అధికారిక నోటీస్ పేర్కొంది.
యూజీసీ నెట్ (UGC NET) పరీక్షలు రెండు షిఫ్ట్‌లో జరగనున్నాయి. మొదటి షిఫ్ట్ (First Shift) ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుంది. రెండో షిప్ట్‌ను మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు.
- యూజీసీ నెట్ పరీక్షను సాధారణంగా ప్రతి ఏడాది రెండు సార్లు నిర్వహిస్తారు. అయితే, కరోనా కారణంగా డిసెంబర్ 2020 పరీక్షలు (Exams) వాయిదా పడటం వల్ల, జూన్-2021 షెడ్యూల్ ఆలస్యమైంది.
కరోనా నిబంధనలతో పరీక్షలు
ప్రస్తుతం దేశంలో కరోనా (Corona) విపత్కర పరిస్థితుల దృష్ట్యా అన్ని పరీక్షలను కరోనా నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు మాస్క్ (Mask) ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. అభ్యర్థులకు ఏవైనా సందేహాలుంటే ఎన్టీఏ హెల్ప్‌డెస్క్ 011-40759000 నెంబర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి వెళ్లే ముందు జారీ చేసిన మార్గదర్శకాలను క్షుణ్నంగా చదవాలని యూజీసీ సూచించింది. పరీక్షకు వారం రోజుల ముందే అధికారిక వెబ్సైట్లో అడ్మిట్ కార్డులు అందుబాటులోకి వస్తాయి.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.