UGC-NET 2021: విడుదలైన యూజీసీ నెట్ పరీక్షల తేదీలు.. వివరాలివే..

ప్రతీకత్మక చిత్రం

యూజీసీ నెట్ (UGC NET) పరీక్షల తేదీలను (Exam Dates) ఎట్టకేలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA తాజాగా విడుదల చేసింది. దీంతో అభ్యర్థుల నిరీక్షణకు తెరపడింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  ఎట్టకేలకు యూజీసీ నెట్  (UGC - NET) పరీక్ష తేదీలను (UGC - NET Exam Dates) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా ప్రకటించింది. యూజీసీ నెట్ డిసెంబర్ 2020 పరీక్షను నంబర్ 20, 21, 22, 24, 25, 26, 29, 30 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇంకా యూజీసీ నెట్ జూన్ 2021 పరీక్షలను డిసెంబర్ 1, 3, 4, 5 తేదీల్లో నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ 17 నుంచి 25 తేదీల్లో నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET) నిర్వహిస్తామని గతంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. కానీ ఆ తేదీల్లో ఇతర ప్రవేశ పరీక్షలు (Entrance Exams) ఉండడంతో ఆ సమయంలో పరీక్షలను NTA వాయిదా వేసింది. డిసెంబర్ 2020 నుంచి అభ్యర్థులు నెట్ ఫైనల్ ఎగ్జామ్ తేదీ కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్‌టీఏ మొత్తం గత పది నెలల్లో ఏకంగా నాలుగుసార్లు పరీక్షలను (Exams) వాయిదా వేసి అభ్యర్థులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో 2021 జూన్‌లో నిర్వహించాల్సిన యూజీసీ నెట్ (UGC NET) పరీక్షను డిసెంబర్ 2020 పరీక్షలో కలిపేశారు.

  అకస్మాత్తుగా నిర్వహించొద్దు..
  అయితే పరీక్షలను అనేక సార్లు వాయిదా పడడంతో అభ్యర్థులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అభ్యర్థులు తమ ఆందోళనలను వ్యక్తం చేశారు. పరీక్షల తుది తేదీలను వీలైనంత త్వరగా విడుదల చేయాలని విద్యాశాఖ మంత్రిని కోరారు. పరీక్షలకు 10-15 రోజుల ముందు అడ్మిట్ కార్డులను విడుదల చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్(University Grants Commission)ను కోరారు. పరీక్షల నిర్వహణకు 30 రోజుల ముందే నోటీసు ఇవ్వాలని.. తద్వారా తమకు సన్నద్ధం కావడానికి సమయం దొరుకుతుందని విజ్ఞప్తి చేశారు. వాయిదాల మీద వాయిదాలు వేస్తూ అకస్మాత్తుగా పరీక్షను నిర్వహించవద్దని వారు డిమాండ్ చేశారు.
  NEET-PG Counselling 2021: నీట్ పీజీ కౌన్సెలింగ్ కు బ్రేక్.. కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

  ట్విట్టర్ వేదికగా ఆందోళన..
  ప్రస్తుతం ట్విట్టర్‌లో #ReleaseNETEXAMDATE అనే హ్యాష్‌ట్యాగ్‌తో అభ్యర్థులు పరీక్ష తేదీలను ప్రకటించాలని పెద్ద ఎత్తున ఆందోళన సైతం చేస్తున్నారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని మరికొందరు అభ్యర్థులు అసహనం వ్యక్తం చేశారు. మిగతా అన్ని పరీక్షలను నిర్వహిస్తున్నప్పుడు.. యూజీసీ నెట్ ఒకటే ఎందుకు నిర్వహించడం లేదన్న ప్రశ్నలను కూడా లేవనెత్తారు అభ్యర్థులు. యూజీసీ నెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు యూజీసీకి అనుబంధంగా ఉన్న కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత సాధిస్తారు. అయితే.. ఎట్టకేలకు విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో పరీక్ష తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) తాజాగా ప్రకటించింది.
  Published by:Nikhil Kumar S
  First published: