యూజీసీ నెట్ 2021 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది. అభ్యర్థులు అధికార వెబ్ సైట్లు ugcnet.nta.nic.in, nta.ac.in లో తమ రిజల్ట్స్ చెక్ చేసుకోవాలని NTA సూచించింది. డిసెంబర్ 2020, జూన్ 2021 సెషన్ పరీక్షల్ని గత ఏడాది నవంబర్ 20 నుంచి డిసెంబర్ 5 తేదీల మధ్య నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) నిర్వహించింది. అయితే అప్పటి నుంచి నెట్ ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఫలితాలను విడుదల చేశారు అధికారులు.
రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి Step 1:అభ్యర్థులు మొదటగా యూజీసీ నెట్ అధికారిక వెబ్ సైట్ ugcnet.nta.nic.in (or) nta.ac.inను ఓపెన్ చేయాలి. Step 2:హోం పేజీలో UGC NET Results link కనిపిస్తుంది. అభ్యర్థులు ఆ లింక్ పై క్లిక్ చేయాలి. Step 3:అనంతరం అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, సెక్యూరిటీ పిన్ నమోదు చేయాల్సి ఉంటుంది. Step 4:ఆ వివరాలను నమోదు చేసిన అనంతరం సబ్మిట్ (Submit) ఆప్షన్ పై క్లిక్ చేయాలి. Step 5:అనంతరం ఫలితాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి. Step 6:అభ్యర్థులు భవిష్యత్ అవసరాల కోసం ఆ రిజల్ట్ కాపీని డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.