Home /News /jobs /

UGC NET 2021 : యూజీసీ నెట్ మ‌ళ్లీ వాయిదా.. త్వ‌ర‌లో కొత్త తేదీలు ప్ర‌క‌టించే అవ‌కాశం

UGC NET 2021 : యూజీసీ నెట్ మ‌ళ్లీ వాయిదా.. త్వ‌ర‌లో కొత్త తేదీలు ప్ర‌క‌టించే అవ‌కాశం

యూజీసీ నెట్

యూజీసీ నెట్

UGC-NET exam: దేశంలో కోవిడ్​ పరిస్థితులు.. ఇత‌ర ప‌రీక్ష తేదీలో స‌మ‌స్య కార‌ణంగా యూజీసీ నెట్ (UGC NET) ప‌రీక్ష మ‌ళ్లీ వాయిదా వేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అక్టోబ‌ర్ 17 నుంచి జ‌ర‌గాల్సిన ఈ ప‌రీక్ష‌లు వాయిదా వేస్తున్న‌ట్టు అధికారిక వ‌ర్గాలు తెలిపాయి. త్వ‌ర‌లోనే కొత్త తేదీలు ప్ర‌క‌టిస్తామ‌ని వారు పేర్కొన్నారు.

ఇంకా చదవండి ...
    యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (National Eligibility Test) ప‌రీక్ష‌ల‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) డిసెంబర్ 2020, జూన్ 2021 సంబంధించిన ప‌రీక్ష‌ల‌కు వాయిదా వేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఈ పరీక్ష‌లు షెడ్యుల్ (Schedule) ప్ర‌కారం అక్టోబ‌ర్ 17 నుంచి అక్టోబ‌ర్ 25 వ‌ర‌కు జ‌ర‌గాలి. కానీ ప‌రీక్ష‌లు వాయిదా వేస్తున్న‌ట్టు సంస్థ పేర్కొంది. కోవిడ్ (Covid 19) కార‌ణంగా ప‌రీక్ష‌లు వాయిదా వేస్తున్న‌ట్టు అధికారిక వ‌ర్గాలు పేర్కొన్నాయి. త‌దుప‌రి తేదీల‌ను త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తామ‌ని వారు తెలిపారు. యూజీసీ నెట్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు UGC కి అనుబంధంగా ఉన్న కాలేజీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు అర్హులు, అయితే, ఇది ఖాళీ మరియు కళాశాల నియామక ప్రక్రియ ఆధారంగా ఉంటుంది.

    వాయిదా ఎందుకు..?
    NTA అధికారిక నోటీసు ప్రకార వివ‌రాలు ఇలా ఉన్న‌యి. “కొన్ని ఇతర ప్రధాన పరీక్షలతో నెట్ ప‌రీక్ష తేదీలు ఇబ్బందిగా మారాయ‌ని దీనికి సంబంధించి అభ్యర్థుల నుంచి అనేక అభ్యర్థనలు వ‌చ్చిన‌ట్టు తెలిపారు. అందువల్ల NTA UGCNET డిసెంబర్ 2020 మరియు జూన్ 2021 సైకిళ్లను తదుపరి తేదీలకు వాయిదా వేయాలని నిర్ణయించిన‌ట్టు అధికారులు తెలిపారు.

    Telangana Jobs 2021 : రంగారెడ్డి జిల్లాలో 93 మెడిక‌ల్ ఆఫీస‌ర్ ఉద్యోగాలు.. ప‌రీక్ష లేకుండానే ఎంపిక‌.. .ద‌ర‌ఖాస్తుకు రెండు రోజులే అవ‌కాశం


    త్వరలో ప్రకటించబడుతుంది. పరీక్షకు సంబంధించిన తాజా అప్‌డేట్‌ల కోసం అభ్యర్థులు క్రమం తప్పకుండా NTA వెబ్‌సైట్  www.nta.ac.in, https://ugcnet.nta.nic.in ని సందర్శించాలని సూచించారు.

    ఎందుకు యూజీసీ నెట్‌..
    మరోవైపు, పీహెచ్ డీ ఉంటేనే యూనివ‌ర్సిటీల్లో టీచింగ్ పోస్టుల‌కు అర్హ‌త ఉంటుంది. యూనివ‌ర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ (ఎంట్రీలెవెల్‌) పోస్ట‌లుకు పీహెచ్‌డీ త‌ప్ప‌నిస‌ర‌ని యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ క‌మిష‌న్ (యూజీసీ) స్ప‌ష్టం చేసింది. ఇప్పటి నుంచి నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్‌) అర్హ‌త‌తో యూనివ‌ర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేర‌డం కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పింది. ఇప్ప‌టివ‌ర‌కు యూనివ‌ర్సిటీల్లో, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్లు, అసోసియేట్ ప్రొఫెస‌ర్లను నేరుగా నియ‌మించ‌డానికి మాస్ట‌ర్ డిగ్రీతోపాటు నెట్‌లో అర్హ‌త‌, పీహెచ్‌డీని ప్రామాణికంగా తీసుకుంటున్నారు.

    2018 లో, UGC కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌ల నియామకానికి ప్రభుత్వం PhD ని తప్పనిసరి చేసింది. కానీ మహమ్మారి కారణంగా పాలసీ అమలు ఆలస్యం అయింది. చాలా మంది పీహెచ్‌డీ అభ్యర్థులు డిగ్రీలు పూర్తి చేయలేకపోయారు. అందువల్ల ఈ సంవత్సరం చేయాల్సిన అమలు వాయిదా పడింది. విశ్వవిద్యాలయాలు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి విద్యా మంత్రిత్వ శాఖ ప్రస్తుత సంవత్సరానికి ప్రమాణాలను ఎత్తివేసింది.
    దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ సంవత్సరం అమలు చేసే విధానాన్ని నిలిపివేసినట్లు ప్రకటించారు. అయితే విధానం ర‌ద్దు కాలేదు. ఉన్నత విద్యాసంస్థలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వేగంగా భర్తీ చేయడానికి మాత్ర‌మే ఈ నిర్ణ‌యం అని తెలిపారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: CAREER, EDUCATION, Exams postponed, National Testing Agency, NOTIFICATION, UGC NET

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు