హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

UGC-NET 2021 Admit Cards: యూజీసీ నెట్ అడ్మిట్ కార్డులు విడుద‌ల‌.. డౌన్‌లోడ్ చేసుకోండిలా

UGC-NET 2021 Admit Cards: యూజీసీ నెట్ అడ్మిట్ కార్డులు విడుద‌ల‌.. డౌన్‌లోడ్ చేసుకోండిలా

యూజీసీ నెట్ అడ్మిట్ కార్డులు

యూజీసీ నెట్ అడ్మిట్ కార్డులు

UGC-NET 2021: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (National Eligibility Test) ప‌రీక్ష‌ల‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) డిసెంబర్ 2020, జూన్ 2021 సంబంధించి ప‌రీక్ష హాల్ టికెట్లు విడుద‌ల అయ్యాయి.

ఇంకా చదవండి ...

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (National Eligibility Test) ప‌రీక్ష‌ల‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) డిసెంబర్ 2020, జూన్ 2021 సంబంధించి ప‌రీక్ష హాల్ టికెట్లు విడుద‌ల అయ్యాయి.  యూజీసీ నెట్ డిసెంబర్ 2020 పరీక్షను న‌వంబ‌ర్‌ 20, 21, 22, 24, 25, 26,29, 30 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇంకా యూజీసీ నెట్ జూన్ 2021 పరీక్షలను డిసెంబర్ 1, 3, 4, 5 తేదీల్లో నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ 17 నుంచి 25 తేదీల్లో నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET) నిర్వహిస్తామని గతంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. కానీ ఆ తేదీల్లో ఇతర ప్రవేశ పరీక్షలు (Entrance Exams) ఉండడంతో ఆ సమయంలో పరీక్షలను NTA వాయిదా వేసింది. డిసెంబర్ 2020 నుంచి అభ్యర్థులు నెట్ ఫైనల్ ఎగ్జామ్ తేదీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ  నేపథ్యంలో 2021 జూన్‌లో నిర్వహించాల్సిన యూజీసీ నెట్ (UGC NET) పరీక్షను డిసెంబర్ 2020 పరీక్షలో కలిపేశారు.

డౌన్‌లోడ్ ఎలా చేసుకోవాలి..

Step 1 : అభ్య‌ర్థులు అధికారిక వెబ్‌సైట్ https://ugcnet.nta.nic.in ను సంద‌ర్శించాలి.

Step 2 :  వెబ్‌సైట్ పేజీ కింది భాగంలో Download Admit Card ఆప్ష‌న్ ఉంటుంది. అక్క‌డ క్లిక్ చేయాలి.

Step 3 :  క్లిక్ చేయగానే Login పేజీ ఓపెన్ అవుతుంది. ( అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి)

BSF Constable : ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త‌తో బీఎస్ఎఫ్‌లో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తు విధానం


Step 4 :  అనంత‌రం అప్లికేష‌న్ నంబ‌ర్‌, డేట్ ఆఫ్ బ‌ర్త్‌, వివ‌రాల‌తో డౌన్‌లోడ్ చేసుకోవాలి.

Step 5 :  డౌన్‌లోడ్ చేసుకోగానే పేరు, ప‌రీక్షా కేంద్రం చూసుకోవాలి.

ఎందుకు యూజీసీ నెట్‌..

మరోవైపు, పీహెచ్ డీ ఉంటేనే యూనివ‌ర్సిటీల్లో టీచింగ్ పోస్టుల‌కు అర్హ‌త ఉంటుంది. యూనివ‌ర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ (ఎంట్రీలెవెల్‌) పోస్ట‌లుకు పీహెచ్‌డీ త‌ప్ప‌నిస‌ర‌ని యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ క‌మిష‌న్ (యూజీసీ) స్ప‌ష్టం చేసింది. ఇప్పటి నుంచి నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్‌) అర్హ‌త‌తో యూనివ‌ర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేర‌డం కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పింది. ఇప్ప‌టివ‌ర‌కు యూనివ‌ర్సిటీల్లో, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్లు, అసోసియేట్ ప్రొఫెస‌ర్లను నేరుగా నియ‌మించ‌డానికి మాస్ట‌ర్ డిగ్రీతోపాటు నెట్‌లో అర్హ‌త‌, పీహెచ్‌డీని ప్రామాణికంగా తీసుకుంటున్నారు.

2018 లో, UGC కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌ల నియామకానికి ప్రభుత్వం PhD ని తప్పనిసరి చేసింది. కానీ మహమ్మారి కారణంగా పాలసీ అమలు ఆలస్యం అయింది. చాలా మంది పీహెచ్‌డీ అభ్యర్థులు డిగ్రీలు పూర్తి చేయలేకపోయారు. అందువల్ల ఈ సంవత్సరం చేయాల్సిన అమలు వాయిదా పడింది. విశ్వవిద్యాలయాలు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి విద్యా మంత్రిత్వ శాఖ ప్రస్తుత సంవత్సరానికి ప్రమాణాలను ఎత్తివేసింది. దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ సంవత్సరం అమలు చేసే విధానాన్ని నిలిపివేసినట్లు ప్రకటించారు. అయితే విధానం ర‌ద్దు కాలేదు. ఉన్నత విద్యాసంస్థలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వేగంగా భర్తీ చేయడానికి మాత్ర‌మే ఈ నిర్ణ‌యం అని తెలిపారు.

First published:

Tags: Exams, UGC NET

ఉత్తమ కథలు