సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో సైబర్ సెక్యూరిటీ (Cyber Security) ఎక్స్‌పర్ట్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. భవిష్యత్తులో సైబర్ సెక్యూరిటీ అనేది బెస్ట్ కెరీర్ ఆప్షన్‌గా మారనుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఈ అంశంపై అవగాహన కల్పించడానికి యూజీసీ (UGC) చర్యలు ప్రారంభించింది. సైబర్ మోసాలపై (Cyber Crime) అవగాహన కోసం సైబర్ జాగృక్త దివాస్-2022 వేడుకలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవల్లో సైబర్ సెక్యూరిటీ అండ్ డేటా ప్రొటెక్షన్ పేరుతో కోర్సులను (New Courses) ప్రారంభించింది.
అన్ని స్ట్రీమ్‌ల విద్యార్థుల కోసం..
టెక్నికల్, నాన్-టెక్నికల్ స్ట్రీమ్‌లకు చెందిన విద్యార్థులకు సైబర్ సెక్యూరిటీ సమస్యలపై అవగాహన పెంపొందించుకోవడంలో ఈ కోర్సులు సహాయపడతాయి. యూనివర్సిటీలు, కాలేజీల్లోని అన్ని స్ట్రీమ్‌ల విద్యార్థులు ఈ కోర్సుల్లో జాయిన్ కావచ్చు. అయితే ఈ కోర్సులు ఆప్షనల్ మాత్రమే.
Career Wise: పబ్లిక్ రిలేషన్స్ విభాగానికి మంచి డిమాండ్.. ఈ రంగంలో కెరీర్ ఇలా ప్రారంభించండి!
సిలబస్ ఇలా..
యూజీసీ జారీ చేసిన సిలబస్ ప్రకారం.. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు సైబర్ సెక్యూరిటీపై బేసిక్, మిడ్ లెవల్ కాన్సెప్ట్స్‌ను స్టడీ చేయనున్నారు. ఇక, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు మిడ్, అడ్వాన్స్డ్-లెవల్ కాన్సెప్ట్‌లను కవర్ చేస్తారు. అండర్ గ్రాడ్యుయేట్ సిలబస్‌లో సైబర్ సెక్యూరిటీ, సైబర్ క్రైమ్ అండ్ చట్టాలు, సోషల్ మీడియా ఓవర్వ్యూ, ఇ-కామర్స్, డిజిటల్ పేమెంట్, డిజిటల్ డివైజ్ సెక్యూరిటీ వంటి టాపిక్స్ ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవల్లో సైబర్ నేరాలు, సైబర్ చట్టాలు, డేటా ప్రైవసీ అండ్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ మేనేజ్మెంట్, కంప్లైయిన్స్ అండ్ గవర్నెన్స్ వంటి అంశాలను కవర్ చేయనున్నారు.
ఈ మాడ్యూల్ పూర్తయిన తర్వాత విద్యార్థులకు కంప్యూటర్లు, మొబైల్‌కు సంబంధించిన బేసిక్ సెక్యూరిటీ అంశాలపై అవగాహన కల్పించనున్నారు. ఈ తరువాత వారు తమ డివైజ్‌లను ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవసరమైన బేసిక్ టూల్స్, టెక్నాలజీలను ఉపయోగించే సామర్థ్యం పొందుతారని యూజీసీ పేర్కొంది.
ఎక్స్‌పర్ట్స్‌తో క్లాసుల నిర్వహణ
యూజీ, పీజీ లెవల్స్‌లో విద్యార్థులకు సైబర్ సెక్యూరిటీపై లెక్చర్స్, ప్రాక్టికల్, ట్యుటోరియల్స్ సెషన్స్ నిర్వహించడానికి ఉన్నత విద్యాసంస్థలు సైబర్ సెక్యూరిటీ/కంప్యూటర్/IT క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ లేదా ఇండస్ట్రీ/సబ్జెక్ట్ మేటర్ ఎక్స్‌పర్ట్స్‌ను ఆహ్వానించే అవకాశం ఉందని యూజీసీ పేర్కొంది.
సైబర్ సెక్యూరిటీ చట్టాలపై అవగాహన
ఈ కోర్సులను పూర్తి చేసిన తరువాత విద్యార్థులకు పర్సనల్ డేటా ప్రైవసీ అండ్ సెక్యూరిటీకి సంబంధించిన అంశాలతో సహా సైబర్ నేరాలకు సంబంధించి దేశంలో చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌పై స్పష్టమైన అవగాహన ఉంటుంది. అంతేకాకుండా డేటా ప్రొటెక్షన్ బిల్లు- 2019, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించిన డేటా ప్రైవసీ అండ్ సెక్యూరిటీ సమస్యలపై కూడా పట్టు సాధిస్తారని యూజీసీ పేర్కొంది. యూజీసీ చైర్మన్ ఎం. జగదీష్ కుమార్ మాట్లాడుతూ.. సైబర్ సెక్యూరిటీపై మరింత అవేర్నెస్తో ప్రతిస్పందించే, బాధ్యతాయుతమైన డిజిటల్ పౌరులను సృష్టించడమే ఈ కోర్సు లక్ష్యమన్నారు. తద్వారా సైబర్ సెక్యూరిటీ ఎకో సిస్టమ్‌కు సమర్థమంతమైన కాంట్రిబ్యూషన్ అందిస్తామని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, CYBER CRIME, Cyber security, JOBS, UGC