హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

UGC: ఉన్నత విద్యపై యూజీసీ కీలక నిర్ణయం.. విద్యార్థుల‌కు మ‌రింత సౌల‌భ్యం

UGC: ఉన్నత విద్యపై యూజీసీ కీలక నిర్ణయం.. విద్యార్థుల‌కు మ‌రింత సౌల‌భ్యం

యూనివర్సిటీ గ్రాంట్స్​ కమిషన్ లోగో

యూనివర్సిటీ గ్రాంట్స్​ కమిషన్ లోగో

UGC Guidelines | ఉన్న‌త విద్య‌కు సంబంధించి యూజీసీ కీల‌క నిర్ణ‌యం తీసుకొంది. ఇప్పటివరకూ ఒక విద్యార్థి ఏదైనా కోర్సును పూర్తిగా స్వదేశంలో, లేదంటే విదేశాల్లో చ‌దువుకొని పూర్తి చేసుకొనే అవ‌కాశం ఇస్తుంది. యూజీసీ 557 కమిషన్‌ సమావేశంలో ఈ డిగ్రీలను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.

ఇంకా చదవండి ...

ఉన్న‌త విద్య‌కు సంబంధించి యూజీసీ (UGC) కీల‌క నిర్ణ‌యం తీసుకొంది. ఇప్పటివరకూ ఒక విద్యార్థి ఏదైనా కోర్సును పూర్తిగా స్వదేశంలో, లేదంటే విదేశాల్లో చ‌దువుకొని పూర్తి చేసుకొనే అవ‌కాశం ఇస్తుంది. యూజీసీ 557 కమిషన్‌ సమావేశంలో ఈ డిగ్రీలను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఉన్నత విద్యలో ట్విన్నింగ్‌ డిగ్రీ, జాయింట్‌ డిగ్రీ, డ్యూయల్‌ డిగ్రీల కోర్సులకు అవకాశం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇతర దేశాల్లో సైతం పూర్తిచేసే అవకాశం ఉండగా, ఇలా చదివిన వారు తమ క్రెడిట్స్‌ను ఒక దేశం నుంచి మరో దేశానికి బదిలీ చేసుకోవచ్చు. దేశంలోని విద్యాసంస్థలు, వర్సిటీలు న్యాక్‌ గ్రేడింగ్‌లో 3.01 స్కోర్‌ సాధించాలి. లేదా ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాకింగ్స్‌లో 100లోపు ఉండాలి. ఈ సంస్థలు మాత్రమే అంతర్జాతీయంగా గల విద్యాసంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవచ్చు.

Job in TCS: ఎమ్మెస్సీ, ఎంఏ చేసిన వారికి గుడ్ చాన్స్‌.. టీసీఎస్‌లో ఉద్యోగ అవ‌కాశాలు

యూజీసీ అనుమ‌తి అవ‌స‌రం లేదు..

అంతర్జాతీయంగా గల విద్యాసంస్థలతో భాగస్వామ్య ఒప్పందాల‌కు యూజీసీ అనుమతి అవసరం లేద‌ని అధికార వ‌ర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా ఉండే విద్యాసంస్థలు, వర్సిటీలు క్యూఎస్‌ లేదా టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ర్యాంకింగ్స్‌లో 500 లోపు ఉండాలి. మన దేశంలోని విద్యాసంస్థలతో ఒప్పందాలు చేసుకోవాలి. ఆన్‌లైన్‌, ఓపెన్‌, డిస్టెన్స్‌ లెర్నింగ్‌ పద్ధతిలో చదవడాన్ని అనుమతించరు. మన విద్యార్థులు (Students) విదేశాలకు వెళ్లడం, విదేశీయులు మన దేశానికి రావాల్సి ఉంటుంది.

30 శాతం క్రెడిట్స్ ఫారెన్‌లో..

డ్యూయల్‌ డిగ్రీ ప్రొగ్రాం (Dual Degree Program) కోసం రెండు విద్యాసంస్థలు పరస్పరం ఎంఓయూ చేసుకోవాల్సి ఉంటుంది. 30 శాతం క్రెడిట్స్ ట్విన్నింగ్‌ ప్రోగ్రాంలో భాగంగా ఒక విద్యార్థి ఫిజికల్‌గా ఒకటి లేదా.. రెండు సెమిస్టర్‌లను విదేశాల్లో పూర్తిచేసుకోవచ్చు. ఇలా 30 శాతానికి పైగా క్రెడిట్స్‌ను ఫారిన్‌లో పూర్తిచేసుకోవచ్చు. విదేశీ విద్యార్థులు సైతం మన దేశానికి వచ్చి 30 శాతం క్రెడిట్స్‌ను పూర్తి చేసుకోవచ్చు. డిగ్రీని మన దేశంలోని యూనివర్సిటీయే అందజేయనుండగా, విదేశాల్లో పూర్తిచేసిన క్రెడిట్స్‌కు సంబంధించిన సర్టిఫికెట్‌ను విదేశాల్లోని యూనివర్సిటీ అందజేస్తుంది.

Career and Course: ఇంట‌ర్ అర్హ‌త‌తో ఐటీ కోర్సు.. ఉద్యోగ అవ‌కాశాలు ట్రై చేయండి


రాష్ట్ర ప్ర‌భుత్వాల నుంచి అనుమ‌తి అవ‌స‌రం..

యూజీసీ నుంచి ఎలాంటి అనుమతి పొందకుండానే విద్యాసంస్థలు భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవచ్చు. కానీ సంబంధిత రాష్ట్రాల‌ ఉన్నత విద్యామండలి లేదా, ప్రభుత్వం నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఫీజులపై భాగస్వామ్య విద్యాసంస్థలు నిర్ణయం తీసుకుని, అడ్మిషన్ల సమయంలో ప్రకటించాలి. ఎంత మంది విద్యార్థులను అనుమతించాలనే అంశంపైనా సంబంధిత విద్యాసంస్థలే అంగీకారానికి రావాల్సి ఉంటుంది. యూనివర్సిటీల అటెండెన్స్‌ పాలసీ ప్రకారం విద్యార్థులు తరగతులకు హాజరవ్వాలి.

First published:

Tags: UGC, University Grants Commission

ఉత్తమ కథలు