హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

UGC Forms Panel: యూజీసీ కీలక నిర్ణయం.. వాటిని ఆకర్షించేందుకు కమిటీ ఏర్పాటు..

UGC Forms Panel: యూజీసీ కీలక నిర్ణయం.. వాటిని ఆకర్షించేందుకు కమిటీ ఏర్పాటు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశంలో క్యాంపస్‌లను ఏర్పాటు చేయడం కోసం టాప్ విదేశీ ఉన్నత విద్యా సంస్థలను ఆకర్షించే పనిలో పడింది యూజీసీ. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.

దేశంలో క్యాంపస్‌లను(Campus) ఏర్పాటు చేయడం కోసం టాప్ విదేశీ ఉన్నత విద్యా సంస్థలను ఆకర్షించే పనిలో పడింది యూజీసీ(UGC). ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. విదేశీ సంస్థలకు సంబంధించి ఈ కమిటీ(Committee) నియమ నిబంధనలను రూపొందించనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ కమిటీ ఏప్రిల్(April) 11న ఏర్పాటు అయింది. ఈ నెలాఖరులోగా నివేదికను యూజీసీకి సమర్పించనుంది. ముందు సైన్స్ అండ్ టెక్నాలజీ(Science And Technology) రంగాల్లో ఇన్‌స్టిట్యూట్‌లు(Institutes) ఏర్పాటు కానున్నాయి. అయితే యూజీసీ కమిటీ(UGC Committee) సూచించే నిబంధనలను బట్టి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. జాతీయ విద్యా విధానం ప్రకారం విదేశాల్లో భారతీయ కళాశాలలు, భారతదేశంలో విదేశీ కళాశాలలను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా యూజీసీ ఈ చర్యలకు ఉపక్రమించింది.

Physical Measurements: ఎస్సై. కానిస్టేబుల్ ద‌రాఖాస్తు చేస్తున్నారా. పోస్టుల వారీగా ఫిజిక‌ల్ మెజ‌ర‌మెంట్స్ వివరాలు

దేశంలో విదేశీ యూనివర్సిటీలు తమ క్యాంపస్‌ల ఏర్పాటును సులభతరం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం చట్టం ద్వారా రక్షణ కల్పిస్తుంది. స్వయంప్రతిపత్తి సంస్థలతో సమానంగా నియంత్రణ, పాలన కంటెంట్ నిబంధనలకు సంబంధించిన ప్రత్యేక అధికారాలు ఈ యూనివర్సిటీలకు కల్పించనున్నట్లు జాతీయ విద్యా విధానం-2022లో పేర్కొన్నారు.

ఇందుకు అనుగుణంగా యూజీసీ తన పాలసీ నిబంధనలను త్వరలో ప్రకటించబోతుంది. దీంతో భారతదేశంలో క్యాంపస్‌లను ఏర్పాటు చేసుకునేందుకు విదేశీ కళాశాలలకు అనుమతి ఇవ్వనున్నారు. తద్వారా భారతీయ విద్యార్థులు ఇక్కడ చదువుకోవడమే కాకుండా విదేశాల్లో భారత్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్‌లలో కూడా చదువుకునేందుకు వీలు కలుగుతుందని యూజీసీ భావిస్తుంది. అలాగే ఉమ్మడి కోర్సులు, విద్యార్థుల మార్పిడి, పరిశోధన తదితర అంశాల్లో పరస్పర సహకారం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

TS Police Jobs: పోలీస్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారా.. ఈసారి నోటిఫికేష‌న్‌లో ఈ మార్పులు గ‌మ‌నించండి

గతేడాది నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (NIEPA) నిర్వహించిన ఓ సర్వేలో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఎనిమిది విదేశీ యూనివర్సిటీలు భారతదేశంలో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయని సర్వేలో తేలింది. అయితే వాటి పేర్లను సర్వేలో పేర్కొనలేదు. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ టాప్ 50 ర్యాంకింగ్‌లో ఆ ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నాయని మాత్రం చెప్పింది. దేశంలోని కళాశాలలు కూడా తమ సొంత బ్రాండ్‌లను క్రమపద్ధతిలో పెంపొందించుకోని అంతర్జాతీయ డయాస్పోరాకు అనుగుణంగా ఔట్‌రీచ్ ప్రోగ్రామ్‌లను నిర్వహించి విదేశీ విద్యార్థులను ఆకర్షించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని యూజీసీ సూచించింది.

ఈ వ్యూహంలో భాగంగా క్రెడిట్ గుర్తింపును ప్రవేశపెట్టడం కూడా ఉంది. ఈ పథకం కింద భారతదేశంలోని ఉన్నత విద్యా సంస్థలలో (HEIs) నమోదు చేసుకున్న విద్యార్థులు భాగస్వామ్య అంతర్జాతీయ సంస్థతో తమ చదువు పూర్తయ్యేలోపు కొంత కాలం అక్కడ చదవాల్సి ఉంటుంది.

మరోవైపు.. యూజీసీ, ఏఐసీటీఈ ఇటీవల ఓ కీలక ప్రకటన చేశాయి. పాకిస్తాన్‌లోని ఏదైనా కళాశాల లేదా విద్యా సంస్థలో ఏదైనా కోర్సు కోసం నమోదు చేసుకోవద్దని భారతీయ విద్యార్థులను హెచ్చరించింది. ఒకవేళ అలా చేస్తే వారు దేశంలో ఉద్యోగం సంపాదించడానికి లేదా ఉన్నత విద్యను అభ్యసించడానికి అర్హులు కాదని ప్రకటించింది. కాశ్మీరీలు ఉన్నత విద్య కోసం ఇస్లామాబాద్‌కు వెళ్లకుండా నిరోధించే ప్రయత్నంగా కేంద్రం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

First published:

Tags: Career and Courses, EDUCATION, UGC

ఉత్తమ కథలు