హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

UGC Guidelines: డిస్టెన్స్, ఆన్‌లైన్ మోడ్ కోర్సుల రిజిస్ట్రేషన్‌కు కొత్త మార్గదర్శకాలు.. యూజీసీ రూల్స్ ఇవే..

UGC Guidelines: డిస్టెన్స్, ఆన్‌లైన్ మోడ్ కోర్సుల రిజిస్ట్రేషన్‌కు కొత్త మార్గదర్శకాలు.. యూజీసీ రూల్స్ ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

UGC Guidelines: ఓపెన్, డిస్టెన్స్ (ODL- Open And Distance Learning), ఆన్‌లైన్ లెర్నింగ్ ప్రోగ్రామ్‌ రిజిస్ట్రేషన్స్‌కు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC).

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఓపెన్, డిస్టెన్స్ (ODL- Open And Distance Learning), ఆన్‌లైన్ లెర్నింగ్ ప్రోగ్రామ్‌ (Online Learning Programme) రిజిస్ట్రేషన్స్‌కు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC). దూరవిద్య, ఆన్‌లైన్ లెర్నింగ్ మోడ్‌లో అడ్మిషన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న విద్యార్థుల కోసం కమిషన్ 9 పాయింట్లను షేర్ చేసింది. ఈ ప్రోగ్రామ్‌ల కోసం విద్యార్థులు(Students) నమోదు చేసుకునేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని ముందుజాగ్రత్త మార్గదర్శకాలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పేర్కొంది. అండర్ గ్రాడ్యుయేట్(UG), పోస్ట్ గ్రాడ్యుయేట్(PG) ప్రోగ్రామ్‌లకు ఇవి వర్తిస్తాయి. దూరవిద్య, ఆన్‌లైన్ మోడ్‌లో అందించడానికి నిషేధించిన ప్రోగ్రామ్‌ల జాబితాను కూడా కమిషన్ నోటిఫై చేసింది.


* కొత్త గైడ్‌లైన్స్ ఇవే..


* మొదటి గైడ్‌లైన్‌లో విద్యార్థులు ఉన్నత విద్యా సంస్థల(HEIs) స్థితిని నిర్ధారించాలని పేర్కొంది. ఇందులో రికగ్నిషన్ స్టేటస్, ఎన్‌టైటిల్‌మెంట్ స్టేటస్ ఉంటుంది. దూరవిద్య, లేదా ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లను అందించడానికి ఏ ఉన్నత విద్యా సంస్థలకు అర్హత లేదో, నో అడ్మిషన్ కేటగిరీ కింద ఏవి ఉన్నాయో విద్యార్థులు తప్పనిసరిగా తనిఖీ చేయాలి.* విద్యార్థులు కమిషన్ వెబ్‌సైట్‌లో ఉన్నత విద్యా సంస్థలు, దాని డాక్యుమెంట్స్, అప్లికేషన్, అఫిడవిట్ వివరాలను చెక్ చేయాలి. ఉన్నత విద్యా సంస్థల అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న వివరాలలో ఏవైనా అవకతవకలను విద్యార్థులు గుర్తిస్తే.. వాటిని యూజీసీకి తెలియజేయాలి.


* అకడమిక్ సెషన్ డ్యూరేషన్‌కు కట్టుబడి ఉండాలి. 2022 జులై- ఆగస్టు అకడమిక్ సెషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి 2022 అక్టోబర్ 31 చివరి తేదీ.


* విద్యార్థులు నమోదు చేసుకుంటున్న దూరవిద్య, ఆన్‌లైన్ కోర్సులకు సంబంధించిన కనీస వ్యవధి, ప్రవేశ స్థాయి అర్హతలు కచ్చితంగా యూనివర్సిటీ గ్రాంట్‌ కమిషన్‌ నోటిఫికేషన్ ప్రకారం ఉండేలా చూసుకోవాలి.


* దూరవిద్య, ఆన్‌లైన్ మోడ్‌లో అందించకుండా నిషేధించిన కోర్సుల వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో యూనివర్సిటీ గ్రాంట్‌ కమిషన్‌ పేర్కొంది. ఎంఫిల్, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ల సహా దాదాపు 17 దూరవిద్య ప్రోగ్రామ్‌లను యూనివర్సిటీ గ్రాంట్‌ కమిషన్‌ నిషేధించింది.


* దూరవిద్య ప్రోగ్రామ్‌ల ప్రాదేశిక అధికార పరిధిలో ప్రవేశం, కౌన్సెలింగ్, పరీక్షల సహా ఉన్నత విద్యా సంస్థలు తమ అన్ని కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని విద్యార్థులు నిర్ధారించుకోవాలి.


ఇది కూడా చదవండి : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగార్థులకు శుభవార్త.. ఫ్రీగా గ్రూప్స్, టీచర్ జాబ్స్ కోచింగ్.. దరఖాస్తుకు ఈ ఒక్కరోజే ఛాన్స్


* సెంట్రల్, స్టేట్, ప్రైవేట్ లేదా డీమ్డ్ యూనివర్సిటీలు అభ్యాసకులను అడ్మిట్ చేసుకోవడానికి, దూరవిద్య, ఆన్‌లైన్ మోడ్ ద్వారా కోర్సులను నిర్వహించడానికి ఫ్రాంఛైజింగ్ ఏర్పాట్ల ద్వారా తమ ప్రోగ్రామ్‌లను అందించడాన్ని యూనివర్సిటీ గ్రాంట్‌ కమిషన్‌ కచ్చితంగా నిషేధించింది.


* దూరవిద్య, ఆన్‌లైన్ మోడ్‌ల కింద అందిస్తున్న UG, PG డిగ్రీలను అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలలో డిగ్రీల సంబంధిత అవార్డులకు సమానంగా పరిగణిస్తారు.


* ఉన్నత విద్యా సంస్థలు లెర్నర్స్‌ మొబిలిటీ, గుర్తింపు వ్యవధిలో తీసుకున్న అడ్మిషన్, దూరవిద్య, ఆన్‌లైన్ మోడ్ ప్రోగ్రామ్‌ల కోసం అభ్యాసకుల నమోదు వంటి ముఖ్యమైన లెర్నర్ సెంటర్ నిబంధనలను కలిగి ఉండాలి

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, EDUCATION, JOBS, Online Education, UGC

ఉత్తమ కథలు