హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

UGC New Regulations: నాలుగేళ్ల డిగ్రీ చదివిన వారు కూడా పీహెచ్‌డీకి అర్హులే.. UGC కొత్త గైడ్‌లైన్స్

UGC New Regulations: నాలుగేళ్ల డిగ్రీ చదివిన వారు కూడా పీహెచ్‌డీకి అర్హులే.. UGC కొత్త గైడ్‌లైన్స్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

UGC New Regulations: నాలుగేళ్ల డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు పీజీ చేయాల్సిన అవసరం లేకుండానే డైరెక్ట్‌గా పీహెచ్‌డీలో చేరే అవకాశాన్ని కల్పించాలని ఇప్పుడు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) యోచిస్తోంది. దీనికి సంబంధించి యూజీసీ ప్రస్తుతం నిబంధనలు రూపొందిస్తోంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

సాధారణంగా ఇండియాలో అండర్‌ గ్రాడ్యుయేట్ (Undergraduate) విద్యార్థులు పీజీ (PG) లేదా మాస్టర్స్ డిగ్రీ చదివిన తర్వాతే పీహెచ్‌డీ(PhD)లో చేరడం కుదురుతుంది. అయితే నాలుగేళ్ల డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు పీజీ చేయాల్సిన అవసరం లేకుండానే డైరెక్ట్‌గా పీహెచ్‌డీలో చేరే అవకాశాన్ని కల్పించాలని ఇప్పుడు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) యోచిస్తోంది. దీనికి సంబంధించి యూజీసీ ప్రస్తుతం నిబంధనలు రూపొందిస్తోంది. ఈ నిబంధనలను వచ్చేవారం ప్రకటించే అవకాశం ఉంది. యూజీసీ పీహెచ్‌డీ అవార్డుకు ముందు రీసెర్చ్ పేపర్ (Research Paper) తప్పనిసరిగా ప్రచురించాల్సిన అవసరాన్ని కూడా తొలగించింది.

మాస్టర్స్ లేదా పీజీ చేయకుండా పీహెచ్‌డీలో నేరుగా చేరే అవకాశం వస్తే చాలా మంది విద్యార్థులు డబ్బుతో పాటు టైమ్ కూడా సేవ్ చేసుకోగలుగుతారు. తాజా సమాచారం ప్రకారం, నాలుగు ఏళ్ల బ్యాచిలర్ డిగ్రీ కోర్సులో కనీసం 75 శాతం మార్కులు లేదా దానికి సమానమైన గ్రేడ్‌ పొందిన యూజీ విద్యార్థులకు డాక్టరల్ ప్రోగ్రామ్‌లో చేరేందుకు అనుమతి ఇవ్వాలని యూజీసీ ప్లాన్ చేస్తోంది.

అలానే నాలుగేళ్ల బ్యాచిలర్ కోర్సు పూర్తి చేసి, ఒక సంవత్సరం మాస్టర్స్ డిగ్రీ ఉన్నవారు కూడా ఈ హైయ్యెస్ట్ డిగ్రీలో చేరేలా నిబంధనలను సవరించనుంది. నిజానికి కొన్ని దేశాల్లో పీజీ స్కిప్ చేసే వెసులుబాటు విద్యార్థులకు ఉంటుంది. సాధారణంగా స్టూడెంట్స్ తాము పీహెచ్‌డీ చేయదలుచుకున్న రీసెర్చ్‌పై బాగా పట్టు ఉంటేనే పీజీ డిగ్రీలు స్కిప్ చేస్తారు.

కొత్త నిబంధనల ప్రకారం, ఉన్నత విద్యా సంస్థలు (HEIs) సైతం 4-ఇయర్ యూజీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు పీహెచ్‌డీ కోర్సులు ఆఫర్ చేస్తాయి. దానికంటే ముందు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. ఈ విద్యా సంస్థలు UGC- NET, UGC-CSIR NET, GATE లేదా CEED, ఇతర సిమిలర్ నేషనల్-లెవెల్ పరీక్షలలో స్కాలర్‌షిప్‌లకు అర్హత సాధించిన విద్యార్థులను మాత్రమే తమ పీహెచ్‌డీ కోర్సులలో చేర్చుకుంటాయి.

ఇది కూడా చదవండి : ఐఐఐటీ ఢిల్లీ నుంచి సరికొత్త ECE కోర్సు.. స్పెషలైజేషన్‌తో బీటెక్ EVE ప్రోగ్రామ్‌..

నిబంధనలు ప్రవేశ పరీక్షల పరిధిని కూడా విస్తరిస్తాయి. వీటి ద్వారా విద్యార్థులు పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందవచ్చు. అయితే ఆన్‌లైన్ మోడ్ లేదా డిస్టెన్స్ ద్వారా పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు అందించమని మరోసారి కమిషన్ స్పష్టం చేసింది. కొత్త నిబంధనల వల్ల పీహెచ్‌డీ చేసే వారి సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉంది.

యూజీసీ 2017 నుంచి 2019 వరకు సెంట్రల్ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITs) నుంచి 2,573 మంది పరిశోధకులతో సహా ఒక అధ్యయనాన్ని కండక్ట్ చేసింది. ఈ స్టడీలో తప్పనిసరి పబ్లికేషన్ వల్ల సెంట్రల్ వర్సిటీలో 75 శాతంలో స్కోపస్-ఇండెక్స్డ్ (Scopus-indexed) జర్నల్స్ క్వాలిటీ తగ్గిపోయిందని తేల్చింది. అందుకే యూజీసీ తాజాగా థీసిస్ సబ్మిషన్ (Thesis submission)కి ముందు రీసెర్చ్ పేపర్ మాండేటరీ పబ్లికేషన్‌ను తొలగించింది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, EDUCATION, JOBS, UGC

ఉత్తమ కథలు