అందరికీ సమానంగా విద్యా అవకాశాలు అందించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం స్వయం(SWAYAM) ఆన్‌లైన్ ప్లాట్‌ఫారం లాంచ్ చేసింది. ఇప్పుడు స్వయం ద్వారా విద్యార్థులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) నాలుగు మాసీవ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సులను (MOOC)లను ఆఫర్ చేస్తోంది. ఇందులో మూడు కోర్సులు బౌద్ధ సంస్కృతికి భారతదేశాన్ని ప్రపంచ కేంద్రంగా మార్చేందుకు దోహదపడతాయని యూజీసీ పేర్కొంది. వీటితోపాటు కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్, సామాజిక బాధ్యత కోర్సులను అందిస్తున్నట్లు తెలిపింది. 2023 జనవరి సెమిస్టర్ నుంచి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారంలో అందుబాటులోకి వచ్చే ఈ కోర్సుల పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
విద్యార్థులను ప్రోత్సహించాలి
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 2021 రెగ్యులేషన్స్ ప్రకారం.. పోస్ట్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత కళాశాలలు, విద్యాసంస్థల్లో ఈ కోర్సులు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సదరు యాజమాన్యాలను యూజీసీ కోరింది. ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఈ కోర్సులను చేసేలే ప్రోత్సహించాలని కాలేజీలను, యూనివర్సిటీలను సూచించింది. ఈ కోర్సులకు సంబంధించిన వివరాలను యూజీసీ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది.
నాలుగు కోర్సులు
బౌద్ధ సంస్కృతి , పర్యాటకంలో భారత్‌ను కేంద్రంగా చేసేందుకు ఇందులో మూడు కోర్సులను ప్రవేశపెట్టినట్లు తన అధికారిక నోటీసులో యూజీసీ పేర్కొంది. అవి భారత్ బౌద్ధ చరిత్ర, అభిదమ్మ (పాలి), బౌద్ధుల ఫిలాసఫి. నాలుగోది ఎంవోవోసీ కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్, సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించినది. ఉన్నత భారత్ అభియాన్‌లో భాగంగా జాతీయ విద్యా విధానం- 2020 సూచనల మేరకు ఈ కోర్సును తీసుకొచ్చారు.
భారత్ బౌద్ధ చరిత్ర
ఈ కోర్సు చేయాలని అనుకునే వారు మార్చి 15లోగా ఎన్‌రోల్‌మెంట్ చేసుకోవాలి. 2023 ఫిబ్రవరి 6న ప్రారంభమై మే 22తో కోర్సు ముగుస్తుంది. వారణాసిలోని సమథ్‌లో ఉన్న సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ టిబెటన్ స్టడీస్ (CIHTS) హోస్ట్ యూనివర్సిటీగా వ్యవహరిస్తుంది. యూజీ, పీజీ విద్యార్థులు చేయవచ్చు.
అభిదమ్మ (పాలి)
ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 15లోగా దరఖాస్తు చేసుకోవాలి. 2023 ఫిబ్రవరి 6తో మొదలై మే 22తో కోర్సు ముగుస్తుంది. వారణాసిలోని సమథ్‌లో ఉన్న సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ టిబెటన్ స్టడీస్ (CIHTS) హోస్ట్ యూనివర్సిటీగా వ్యవహరిస్తుంది. యూజీ, పీజీ విద్యార్థులు ఈ కోర్సు చేయవచ్చు.
బౌద్ధమతం ఫిలాసఫీ
బుద్ధుని తత్వం మీద ఆసక్తి ఉన్న యూజీ, పీజీ విద్యార్థులు ఈ కోర్సు చేయచ్చు. అందుకోసం మార్చి 15లోగా దరఖాస్తు చేసుకోవాలి. 2023 ఫిబ్రవరి 6తో మొదలై మే 22తో కోర్సు ముగుస్తుంది. వారణాసిలోని సమథ్‌లో ఉన్న సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ టిబెటన్ స్టడీస్ (CIHTS) హోస్ట్ యూనివర్సిటీగా వ్యవహరిస్తుంది.
కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ
ఈ కోర్సు చేసేందుకు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ మార్చి 15. ఫిబ్రవరి 6తో ప్రారంభమై ఏప్రిల్ 17తో కోర్సు ముగుస్తుంది. ఆగ్రాలోని దయల్బాగ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ (డీమ్డ్ యూనివర్సిటీ) హోస్ట్ యూనివర్సిటీగా వ్యవహరిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, UGC, UGC NET