UGC INTERNSHIP GUIDELINES UNIVERSITY GRANTS COMMISSION RELEASED GUIDELINES FOR COMPULSORY INTERNSHIP SS GH
Internship Guidelines: రీసెర్చ్ ఇంటర్న్‌షిప్ కోసం UGC తాజా మార్గదర్శకాలు... మార్పులు ఇవే
Internship Guidelines: రీసెర్చ్ ఇంటర్న్‌షిప్ కోసం UGC తాజా మార్గదర్శకాలు... మార్పులు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)
Internship Guidelines | అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఇంటర్న్‌షిప్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇంటర్న్‌షిప్ గైడ్‌లైన్స్ విడుదల చేసింది.
దేశంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులందరూ తప్పనిసరిగా ఎనిమిది నుంచి పది వారాల పాటు రీసెర్చ్ ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఇటీవల ప్రకటించింది. ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. రీసెర్చ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లు ప్రధానంగా విద్యార్థుల ఉపాధి లక్ష్యంగా, పరిశోధన సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడతాయని యూజీసీ పేర్కొంది. జాతీయ విద్యా విధానం-2020 ప్రకారం.. ఇంటర్న్ షిప్‌లను ప్రమోట్ చేయడానికి మర్గదర్శకాలను జారీ చేసినట్లు యూజీసీ ప్రకటించింది. అందులోని ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి.
రీసెర్చ్ ఇంటర్న్‌షిప్
ఇంటర్న్ షిప్‌లోని రీసెర్చ్ సమయంలో విద్యార్థుల కోసం ఇతర ఉన్నత విద్యా సంస్థలకు చెందిన రీసెర్చ్ సూపర్వైజర్ను నియమిస్తారు. ఈ రీసెర్చ్ ఇంటర్న్‌షిప్ ప్రాజెక్ట్, టైమ్ లిమిట్‌తో అదే సంస్థలో జరగనుంది. రీసెర్చ్ ఇంటర్న్‌షిప్‌ను అభ్యసించే విద్యార్థులకు రీసెర్చ్ టూల్స్, టెక్నిక్స్, మెథడాలజీస్, పరికరాలపై శిక్షణ ఇవ్వనున్నారు.
జాతీయ విద్యావిధానం 2020 ప్రకారం.. విద్యార్థులకు మల్టిపుల్ ఎంట్రీ-ఎగ్జిట్‌కు అవకాశం ఉంటుంది. విద్యార్థులు రెండు సెమిస్టర్లు (మొదటి సంవత్సరం) లేదా నాలుగు సెమిస్టర్లు (రెండవ సంవత్సరం) తర్వాత కూడా ఒక కోర్సు నుండి నిష్క్రమించవచ్చు. ఏడాది తర్వాత ఎగ్జిట్ అయితే సర్టిఫికేట్, రెండేళ్ల తర్వాత ఎగ్జిట్ అయితే డిప్లొమా వస్తుంది. 2వ సెమిస్టర్ లేదా 4వ సెమిస్టర్ తర్వాత నిష్క్రమించాలనుకునే విద్యార్థులు 10 క్రెడిట్ పాయింట్ల లభించే 8 నుంచి 10 వారాల ఇంటర్న్‌షిప్ (450 గంటలు) ప్రోగ్రామ్ చేయడం తప్పనిసరి అని యూజీసీ మార్గదర్శకాల్లో పేర్కొంది.
రీసెర్చ్ ఇంటర్న్‌షిప్‌లో ఒక క్రెడిట్ పాయింట్ సాధించాలంటే వారంలో ఇంటర్న్‌షిప్ కార్యకలాపాలలో కనీసం 45 గంటల పాటు నిమగ్నమై ఉండాలి. మొత్తం క్రెడిట్లను పొందడానికి 450 గంటల పాటు రీసెర్చ్ ఇంటర్న్ షిప్లో పాల్గొనాలి. పరిశోధనతో పాటు నాలుగేళ్ల ప్రోగ్రామ్‌ను కొనసాగించాలనుకునే విద్యార్థులు 10 వారాల ఇంటర్న్‌షిప్‌తో పాటు ఒక సంవత్సరం వాస్తవ పరిశోధన వర్క్ చేయవలసి ఉంటుంది. పరిశోధన లేకుండా కేవలం నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ చేయాలనుకునేవారు కనీసం 8-10 వారాల ఇంటర్న్‌షిప్‌ను కొనసాగించాల్సి ఉంటుంది.
అదనంగా10 క్రెడిట్ల విలువైన రీసెర్చ్ ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్ కోర్సులను (REAC) అందించాలని ఉన్నత విద్యాసంస్థలకు ప్రతిపాదించింది యూజీసీ. 4 సంవత్సరాల డిగ్రీ (పరిశోధన) విద్యార్థులకు ప్రీ-రిక్వెస్ట్ కోర్సులుగా టూల్స్ అండ్ టెక్నిక్స్‌లో రీసెర్చ్ అండ్ అనలైటికల్ కోసం కొన్ని రీసెర్చ్ ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్ కోర్సులను (RAEC) ప్రవేశపెడుతున్నట్లు యూజీసీ ముసాయిదాలో పేర్కొంది. ఈ కోర్సులు 10 క్రెడిట్ పాయింట్లకు సమానం.
మూల్యాంకనం
విద్యార్థుల ఇంటర్న్‌షిప్ పురోగతిని హోస్ట్ ఇన్స్టిట్యూట్ నుండి కేటాయించిన రీసెర్చ్ ఇంటర్న్‌షిప్ సూపర్వైజర్ పర్యవేక్షిస్తారు. ఉన్నత విద్యా సంస్థలో సెమినార్ ప్రెజెంటేషన్/వైవా ద్వారా, సూపర్వైజర్తో సహా నిపుణుల బృందం విద్యార్థులకు మార్కులను కేటాయిస్తుంది.
ఇంటర్న్‌షిప్ పోర్టల్
విద్యార్థులు స్వతహాగా లేదా వారి మాతృ విద్యా సంస్థ ఫ్యాకల్టీ మెంటర్ ద్వారా రీసెర్చ్ ఇంటర్న్‌షిప్‌ల కోసం పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక ప్రమాణాల ఆధారంగా హోస్ట్ సంస్థలు విద్యార్థులను ఎంపిక చేసుకుంటాయి. సెలక్ట్ అయిన వారికి పోర్టల్ లేదా మెయిల్ ద్వారా హోస్ట్ సంస్థలు సమాచారం తెలియజేస్తాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.