హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

UGC Guidelines: యూజీసీ కొత్త గైడ్ లైన్స్.. డ్యుయల్ డిగ్రీ కోర్సులపై క్లారిటీ..

UGC Guidelines: యూజీసీ కొత్త గైడ్ లైన్స్.. డ్యుయల్ డిగ్రీ కోర్సులపై క్లారిటీ..

UGC Guidelines: యూజీసీ కొత్త గైడ్ లైన్స్.. డ్యుయల్ డిగ్రీ కోర్సులపై క్లారిటీ..

UGC Guidelines: యూజీసీ కొత్త గైడ్ లైన్స్.. డ్యుయల్ డిగ్రీ కోర్సులపై క్లారిటీ..

ఎడ్యుకేషన్ విధానంలో సమూల మార్పుల కోసం కేంద్ర ప్రభుత్వం 2020లో నేషనషల్ ఎడ్యుకేషన్ పాలసీని ప్రకటించింది. ఇందులో భాగంగా.. తాజాగా ఒకే సారి రెండు అకడమిక్ డిగ్రీలను అభ్యసించేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) యూనివర్సిటీలను కోరింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

ఎడ్యుకేషన్(Education) విధానంలో సమూల మార్పుల కోసం కేంద్ర ప్రభుత్వం(Central Government) 2020లో నేషనషల్ ఎడ్యుకేషన్ పాలసీని(Education Policy) ప్రకటించింది. ఇందులో భాగంగా కోర్సుల్లో క్రెడిట్ పాయింట్స్, మల్టిపుల్ ఎగ్జిట్స్ వంటి సరికొత్త విధానాలను అమలు చేయాలనుకుంటున్నారు. తాజాగా ఒకే సారి రెండు అకడమిక్ డిగ్రీలను అభ్యసించేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) యూనివర్సిటీలను కోరింది.

IIT Recruitment 2022: ఐఐటీలో ఉద్యోగాలు .. జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు ఖాళీ..

* పీహెచ్‌డీల్లో డ్యుయల్ డిగ్రీకి నో ఛాన్స్..

ఒకేసారి రెండు పుల్ టైమ్ డిగ్రీలను అభ్యసించడానికి అనుమతించే ప్రతిపాదనను యూజీసీ గత ఏప్రిల్‌లో ఆమోదించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం... పీహెచ్‌డీ కాకుండా ఇతర కోర్సుల్లో మాత్రమే డ్యుయల్ డిగ్రీ చేయడానికి అవకాశం ఉంటుంది. కాగా, విద్యార్థులు ఒక రెగ్యులర్ కోర్సు , మరో డిస్టెన్స్ కోర్సు కలిపి చదువుకునేందుకు యూజీసీ గతంలో అనుమతించిన సంగతి తెలిసిందే. ‘విద్యార్థులు ఏకకాలంలో రెండు డిగ్రీలను చదివేందుకు వీలుగా అన్ని ఉన్నత విద్యా సంస్థలు (HEIs) తమ యంత్రాంగంలో మార్పులు చేసుకోవాలి.

విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా ఈ డ్యుయల్ డిగ్రీ ప్రోగ్రామ్ ను అమలు చేయనున్నాం. ఇప్పటి వరకు ఎలాంటి ఏర్పాట్లు చేయకుంటే చర్యలు వేగవంతం చేయాలి’ అని యూనివర్సిటీలకు సూచించింది యూజీసీ.

TSPSC Notification: టీఎస్పీఎస్సీ(TSPSC) నుంచి CDPO పోస్టులు.. దరఖాస్తులకు మరి కొన్ని రోజులే గడువు..

* పూర్తిగా ఆప్షనల్..

ఈ డ్యుయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ విషయంలో టైమింగ్ క్లాష్ కాకుండా అవసరమైన మార్పులు చేయాలని యూజీసీ సూచించింది. దీంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థులు డ్యుయల్ డిగ్రీని అభ్యసించవచ్చు. అయితే ఇది పూర్తిగా ఆప్షనల్. విద్యార్థులకు ఆసక్తి ఉంటే రెండు పుల్-టైమ్ కోర్సులను కొనసాగించవచ్చు.

* గుర్తింపు ఉన్న ఇన్‌స్టిట్యూట్స్‌లో మాత్రమే..

యూజీసీ, చట్టబద్ధమైన కౌన్సిల్, భారత ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉన్నత విద్యా సంస్థల్లో మాత్రమే విద్యార్థులు ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ (ODL) కింద డిగ్రీ లేదా డిప్లొమా ప్రోగ్రామ్‌లను ఆన్‌లైన్ మోడ్‌లో అభ్యసించాల్సి ఉంటుంది.

Postal Jobs 2022: గుడ్ న్యూస్.. పోస్టల్ డిపార్ట్ మెంట్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..

* ఎడ్యుకేషన్‌ మరింత సులభతరం కోసం..

ఇటీవల కాలంలో ఉన్నత విద్యకు డిమాండ్ బాగా పెరిగింది. అయితే రెగ్యులర్ స్ట్రీమ్‌లో సీట్లు పరిమితంగా ఉండడంతో చాలా ఇన్‌స్టిట్యూట్స్ ఓపెన్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విధానంలో అనేక కోర్సులను ప్రారంభించాయి. దీంతో విద్యార్ధులు ఏకకాలంలో రెండు అకడమిక్ ప్రోగ్రామ్‌లను చదవడానికి అనుమతించే అంశాన్ని యూజీసీ పరిశీలించింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020 ప్రకారం... మల్టిపుల్ మార్గాల ద్వారా ఎడ్యుకేషన్‌ను మరింత సులభతరం చేయాల్సిన అవసరాన్ని యూజీసీ నొక్కి చెబుతుంది. అందులో భాగంగానే డ్యుయల్ డిగ్రీ‌ను అమలు చేయనుంది.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, UGC, UGC NET

ఉత్తమ కథలు