ఆన్లైన్లో డిగ్రీ చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఇకపై ఆన్లైన్లో డిగ్రీ పూర్తి చేయొచ్చు. భారతదేశంలోని 38 యూనివర్సిటీలు ఆన్లైన్లో పూర్తి స్థాయి డిగ్రీ కోర్సుల్ని అందించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-UGC అనుమతి ఇచ్చింది. ఈ జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. వీటితో పాటు దేశంలోని ప్రముఖ యూనివర్సిటీలు కూడా ఆన్లైన్లో డిగ్రీ కోర్సుల్ని అందించబోతున్నాయి. మొత్తం 38 యూనివర్సిటీల్లో 3 సెంట్రల్ యూనివర్సిటీలు, 13 స్టేట్ యూనివర్సిటీలు, 15 డీమ్డ్ టు బి యూనివర్సిటీలు, 3 ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయి. మరి తెలుగు రాష్ట్రాల్లో ఏఏ యూనివర్సిటీలు ఆన్లైన్లో డిగ్రీ కోర్సులు అందిస్తున్నాయో, ఏఏ కోర్సులు చేయొచ్చో తెలుసుకోండి.
IBPS RRB Jobs 2021: తెలుగు రాష్ట్రాల్లో భారీగా బ్యాంకు ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే
IBPS RRB 2021: రీజనల్ రూరల్ బ్యాంకుల్లో 10,676 ఉద్యోగాలు... పరీక్ష సిలబస్ ఇదే
ఆంధ్రప్రదేశ్లో మూడు యూనివర్సిటీలు ఆన్లైన్లో డిగ్రీ కోర్సుల్ని అందించేందుకు యూజీసీ పర్మిషన్ ఇచ్చింది. ఆంధ్ర యూనివర్సిటీ బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (అకౌంటెన్సీ), మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (సోషియాలజీ) కోర్సుల్ని అందించనుంది. ఇక కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, మాస్టర్ ఆఫ్ సైన్స్ (మ్యాథమెటిక్స్), మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఇంగ్లీష్) కోర్సుల్ని అందించనుంది. ఇక గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్-GITAM యూనివర్సిటీ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఇంగ్లీష్), మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్), మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఎకనమిక్స్), మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (పొలిటికల్ సైన్స్), మాస్టర్ ఆఫ్ కామర్స్ కోర్సుల్ని అందించనుంది.
Railway Jobs 2021: రైల్వేలో 3378 ఉద్యోగాలు... ఆంధ్రప్రదేశ్లోని ఆ రెండు జిల్లా అభ్యర్థులకు అవకాశం
MDL Recruitment 2021: మజగాన్ డాక్ లిమిటెడ్లో 1388 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే
తెలంగాణలో ఒకే విద్యా సంస్థకు ఆన్లైన్లో డిగ్రీ కోర్సుల్ని అందించేందుకు అనుమతి ఇచ్చింది యూజీసీ. ICFAI ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఫైనాన్స్), మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (హెచ్ఆర్ఎం), మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (మార్కెటింగ్), మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఆపరేషన్స్ అండ్ ఐటీ) కోర్సుల్ని అందించనున్నాయి.
ఇక సెంట్రల్ యూనివర్సిటీలు కూడా ఆన్లైన్ కోర్సుల్ని అందిస్తున్నాయి. జామియా మిల్లియా ఇస్లామియా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఎడ్యుకేషన్), మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) కోర్సుల్ని అందించనుంది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (సంస్కృతం) కోర్సును అందించనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, EDUCATION, Online classes, Online Education, UGC