దేశంలో విద్యా వ్యవస్థకు సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) చాలా సంస్కరణలు చేపడుతోంది. కొన్ని సంవత్సరాల్లో అనేక జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌లను తీసుకొచ్చింది. తాజాగా కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్(CAS) కింద పదోన్నతుల అర్హత ప్రమాణాలపై స్పష్టత ఇచ్చింది. పీహెచ్‌డీ స్కాలర్స్‌కు గైడ్‌గా వ్యవహరించడానికి అర్హత ప్రమాణాల విషయంపై అభిప్రాయాలు సేకరించిన సంస్థ.. దీనిపై తాజాగా తుది నిర్ణయం తీసుకుంది.
అర్హులైన శాశ్వత అధ్యాపకులు (permanent faculty) పీహెచ్‌డీ స్కాలర్‌లకు ప్రొబేషన్ పీరియడ్‌లో కూడా గైడ్‌గా వ్యవహరించవచ్చని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పేర్కొంది. జనవరి 20న జరిగిన 565వ సమావేశంలో UGC ఈ విషయం గురించి చర్చించింది. పదోన్నతులకు సంబంధించి CAS నిబంధనలు తప్పక అనుసరించాలని, నిర్ణయానికి కట్టుబడి ఉండాలని అన్ని విశ్వవిద్యాలయాలను అభ్యర్థించింది.
* వాటిపై క్లారిటీ
అకడమిక్ లెవల్ 12 నుంచి అకడమిక్ లెవల్ 13A, లెవల్ 13A నుంచి అకడమిక్ లెవల్ 14 వరకు యూనివర్సిటీ టీచర్ల CAS పదోన్నతులకు అర్హత ప్రమాణాలపై జనవరిలో UGC ఒక వివరణ విడుదల చేసింది. ‘ఎవిడెన్స్ ఆఫ్ హావింగ్ గైడెడ్ ఎట్ లీస్ట్ వన్ పీహెచ్‌డీ క్యాండిడేట్’, ‘ఎవిడెన్స్ ఆఫ్ సక్సెస్‌ఫుల్లీ గైడెడ్ డాక్టోరల్ క్యాండిడేట్’ వంటి టర్మ్స్‌కి కమిషన్ స్పష్టత ఇచ్చింది. గతేడాది నవంబర్‌లో జరిగిన సమావేశంలో యూనివర్సిటీ అధ్యాపకుల పదోన్నతుల అర్హతకు సంబంధించిన సందేహాలను కూడా కమిషన్ పరిష్కరించింది.
* కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్(CAS) అంటే ఏంటి?
UGC నిబంధనల ప్రకారం యూనివర్సిటీలు అనుసరించే కెరీర్ అడ్వాన్స్‌మెంట్ ప్రొసీజర్‌ని కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ అంటారు. యూనివర్సిటీలో టీచర్ కెరీర్‌ల పురోగతికి ఈ పథకం వర్తిస్తుంది. ఒక ఫ్యాకల్టీ పదోన్నతి పొందడానికి, అధిక వేతనం అందుకోవడానికి ఈ నిబంధనలు చాలా కీలకం.
CAS కోసం అప్లై చేయడానికి, అభ్యర్థికి తప్పనిసరిగా సంబంధిత/అనుబంధ/సంబంధిత విభాగంలో PhD డిగ్రీ ఉండాలి. UGC-లిస్టెడ్ జర్నల్స్‌లో కనీసం పది రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేసి ఉండాలి, అందులో మూడు కచ్చితంగా ప్రొబేషన్ పీరియడ్‌లో పబ్లిష్ అయి ఉండాలి. డాక్టోరల్ అభ్యర్థులకు విజయవంతంగా గైడెన్స్ అందించినట్లు కూడా ప్రూఫ్స్ ఉండాలి.
ఇది కూడా చదవండి : ఏపీ పోలీస్ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షలు వాయిదా.. బోర్డు కీలక ప్రకటన
మరోవైపు, ఇటీవల కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సాథీ(SATHEE) అనే ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంను లాంచ్ చేశారు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసేవారికి ఈ పోర్టల్ సహాయపడనుంది. దీన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) కాన్పూర్, విద్యా మంత్రిత్వ శాఖ (MoE) కలిసి రూపొందించాయి. దేశంలో జరిగే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET), జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE), ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు విద్యార్థులు సిద్ధం కావడానికి SATHEE ప్లాట్‌ఫామ్ ఉపయోగపడుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, JOBS, Professors, UGC