Fake University: 24 ఫేక్ యూనివర్సిటీల గుట్టు రట్టు.. వివరాలు ఇవే..

Fake University: దేశంలో 24 ఫేక్ యూనివర్సిటీలు ఉన్నట్లు యూజీసీ గుర్తించింది. వాటి వివరాలను వెల్లడించింది. ఆ యూనివర్సిటీలకు ఎలాంటి డిగ్రీ ఇచ్చే అధికారం లేదని స్పష్టం చేసింది.

news18-telugu
Updated: October 8, 2020, 11:13 AM IST
Fake University: 24 ఫేక్ యూనివర్సిటీల గుట్టు రట్టు.. వివరాలు ఇవే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఎలాంటి అనుమతులు లేకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న 24 ఫేక్ యూనివర్సిటీల గుట్టును యూజీసీ రట్టు చేసింది. అవన్నీ ఫేక్ అని తేల్చేసింది. వాటిలో అత్యధికంగా 8 ఉత్తర ప్రదేశలో ఉన్నాయని ప్రకటించింది. ఆ తర్వాత స్థానంలో ఏడు ఫేక్ యూనివర్సిటీలు దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నాయని యూజీసీ తెలిపింది. ఈ సందర్భంగా యూజీసీ సెక్రటరీ రజనీశ్ జైన్ మాట్లాడుతూ.. దేశంలో 24 గుర్తింపు లేని, స్వయం ప్రకటిత యూనివర్సటీలను గుర్తించామన్నారు. అవన్నీ యూజీసీ చట్టాన్ని ఉల్లంఘిస్తూ పనిచేస్తున్నాయన్నారు. వాటిని ఫేక్ యూనివర్సిటీలుగా ప్రకటిస్తున్నామన్నారు. వాటికి విద్యార్థులకు డిగ్రీలు ఇచ్చే అధికారం లేదని స్పష్టం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

ఫేక్ యూనివర్సిటీలుగా గుర్తించిన 24 యూనివర్సిటీల్లో అత్యధికంగా 8 ఉత్తర ప్రదేశ్ లో ఉన్నాయి. అవి వరనసేయ సాంస్క్రిట్ విశ్వవిద్యాలయ, వారణాసి: మహిళా గ్రామ్ విద్యాపీఠ్, అలహాబాద్: గాంధీ హిందీ విద్యాపీఠ్, అలహాబాద్: నేషినల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలెకట్రో కాంప్లెక్స్ హోమియోపతి, కాన్ పూర్: నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఓపెన్ యూనివర్సిటీ, అలిగ్రా: ఉత్తర్ ప్రదేశ్ విశ్వవిద్యాలయ, ముత్తుర: మహారాణ ప్రతాప్ శిక్ష నికేతన్ విశ్వవిద్యాలయ, నోయిడా: ప్రతాప్ ఘర్ మరియూ ఇంద్రప్రస్త శిక్ష పరిషత్ యూనివర్సిటీలని అధికారులు తెలిపారు. లక్నోలోని భారతీయ శిక్ష పరిషత్ విషయం జిల్లా కోర్టు పరిధిలో ఉందని జైన్ స్పష్టం చేశారు.

దేశ రాజధాని ఢిల్లీలోనూ ఏడు ఫేక్ యూనివర్సిటీలను గుర్తించారు. అవి కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ, ఒకేషినల్ యూనివర్సిటీ, ఏడీఆర్ సెంట్రిక్ జ్యుడీషియల్ యూనివర్సిటీ, ఇండియన్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్, ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయగా ప్రకటించారు. ఒడిశా, వెస్ట్ బెంగాల్ లో రెండు చొప్పున ఇలాంటి యూనివర్సిటీలు ఉన్నాయన్నారు. కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరీలో ఒక్కో ఫేక్ యూనివర్సిటీని గుర్తించామన్నారు. ఇలాంటి ఫేక్ విద్యాలయాల విషయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని యూజీసీ అధికారులు సూచించారు. అలాంటి యూనివర్సిటీలు ఇచ్చే డిగ్రీ సర్టిఫికేట్లు చెల్లవని, ఆ విషయాన్ని గర్తించుకోవాలని స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్ కోసం నకిలీ యూనివర్సిటీల జాబితాను ప్రకటిస్తున్నామన్నారు. ఈ విషయంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
Published by: Nikhil Kumar S
First published: October 8, 2020, 11:00 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading