హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CUET-PG: సెంట్రల్ యూనివర్సిటీలు CUET-PG అనుసరించాల్సిందే..  UGC ఛైర్మన్‌ ఆదేశాలు..

CUET-PG: సెంట్రల్ యూనివర్సిటీలు CUET-PG అనుసరించాల్సిందే..  UGC ఛైర్మన్‌ ఆదేశాలు..

అందరి విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించేందుకు యూజీసీ చర్యలు తీసుకుంటోంది.  ప్రస్తుతం సెంట్రల్ యూనివర్సిటీలలో ప్రవేశాలు కల్పించేందుకు CUET నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.  CUET-PG ద్వారా వచ్చే విద్యా సంవత్సరం(2023-24) నుంచి ప్రవేశాలు కల్పించాలని సెంట్రల్‌ వర్సిటీలను యూజీసీ ఛైర్మన్ ఎం.జగదీష్ కుమార్ ఆదేశించారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

అందరి విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించేందుకు యూజీసీ చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం సెంట్రల్ యూనివర్సిటీలలో ప్రవేశాలు కల్పించేందుకు కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్(CUET) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(NTA) నిర్వహించే ఈ ఎగ్జామ్‌ ద్వారా.. వివిధ యూజీ, ఇంటిగ్రేటెడ్, పీజీ, డిప్లొమా, సర్టిఫికేషన్ కోర్సులు, రీసెర్చ్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు పొందవచ్చు. అయితే ఇప్పటి వరకు యూజీ ప్రోగ్రామ్‌లలోనే విద్యార్థులు ప్రవేశాలు పొందుతున్నారు. అయితే ప్రస్తుతం పీజీ విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న CUET-PG ద్వారా వచ్చే విద్యా సంవత్సరం(2023-24) నుంచి ప్రవేశాలు కల్పించాలని సెంట్రల్‌ వర్సిటీలను యూజీసీ ఛైర్మన్ ఎం.జగదీష్ కుమార్ ఆదేశించారు. ఆయన ప్రకటనలోని కీలక అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.

CUET-PG ద్వారా ప్రవేశాలు

సీయూఈటీ పీజీ పరీక్ష ఫలితాల ఆధారంగా యూనివర్సిటీల్లో విద్యార్థులకు సీట్లు కేటాయించాలని జగదీష్‌ కుమార్‌ తెలిపారు. ఇలా చేయడం వల్ల విద్యార్థులకు మేలు కలుగుతుందని అభిప్రాయపడ్డారు. దేశంలోని గ్రామీణ, మారుమూల ప్రాంతాల విద్యార్థులకు ముఖ్యంగా ఈశాన్య ప్రాంతాల వారికి CUET-PG సమాన అవకాశాలను కల్పిస్తోందన్నారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా సెంట్రల్ వర్సిటీల్లో సులభంగా ప్రవేశం పొందే అవకాశం గ్రామీణ విద్యార్థులకు దక్కుతుందని చెప్పారు. ఒక్క పరీక్షతో దేశంలోని నలుమూలలా ఉన్న సెంట్రల్, ఇతర వర్సిటీల్లో అడ్మిషన్ పొందే సౌలభ్యం కలుగుతుందని జగదీష్ కుమార్ వెల్లడించారు.

విద్యార్థులకు అవకాశాలు కల్పించాలి

సెంట్రల్‌ వర్సిటీలు ఇప్పటి వరకు కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేషన్(CUET-UG) ద్వారా డిగ్రీ విద్యార్థులకు ప్రవేశాలను కల్పిస్తున్నాయి. ఈ పరీక్ష ద్వారా వివిధ యూనివర్సిటీలు అందించే కోర్సులను విద్యార్థులు అభ్యసించగలుగుతున్నారు. కానీ పీజీ విద్యార్థులకు ఆ వెసులుబాటు లేదు. ఒక్కో యూనివర్సిటీ స్వతంత్రంగా ప్రవేశ పరీక్షను నిర్వహించుకుంటున్నాయి. దీనివల్ల విద్యార్థులకు కొంత మేర నష్టం కలిగే అవకాశం ఉంది. ప్రవేశ పరీక్ష ఫీజులు భారమవడం, సమయం చాలకపోవడం వల్ల విద్యార్థులు కొన్ని యూనివర్సిటీలకు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది.

యూజీసీ ఛైర్మన్ జగదీష్ కుమార్ ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు. సీయూఈటీ యూజీ ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నట్లుగానే.. పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు కూడా అవకాశం ఇవ్వాలని ఆయన సూచించారు. సీయూఈటీ పీజీ ప్రవేశ పరీక్ష ద్వారా పీజీ కోర్సులను అభ్యసించడానికి విద్యార్థులను ఆహ్వానించాలన్నారు. దేశంలోని అత్యుత్తమమైన యూనివర్సిటీల్లో ప్రవేశం పొందేందుకు విద్యార్థులకు విస్తృత అవకాశాలను కల్పించాలని సూచించారు. 2023-24 అకాడమిక్ ఇయర్‌ నుంచి పీజీ కోర్సుల్లో అడ్మిషన్ కల్పించేందుకు సీయూఈటీ పీజీ స్కోరును పరిగణనలోకి తీసుకోవాలని అన్ని సెంట్రల్ యూనివర్సిటీలకు సూచిస్తున్నామని స్పష్టం చేశారు.

జూన్‌లో సీయూఈటీ- పీజీ

సీయూఈటీ పీజీ ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులకు అడ్మిషన్ కల్పించేందుకు డిల్లీ సెంట్రల్ యూనివర్సిటీ ముందుకొచ్చింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీనిని అమలు చేస్తామని ప్రకటించింది. ఈ ఏడాది జూన్ 1 నుంచి 10 వరకు సీయూఈటీ- పీజీ పరీక్షను ఎన్టీఏ నిర్వహించనుంది. జులైలో ఫలితాలను విడుదల చేయనుంది. ఇందుకోసం మార్చిలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. 13 భాషల్లో ఈ పరీక్షను రాసేందుకు విద్యార్థులకు అవకాశం ఉంది. ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళం, ఉర్దూ, కన్నడ, మలయాళం, ఒడియా, మరాఠీ, పంజాబీ, గుజరాతీ, అస్సామీ, బెంగాళీ మాద్యమాల్లో ప్రవేశ పరీక్ష ఉంటుంది.

First published:

Tags: Career and Courses, Cuet, Exams, JOBS, National Testing Agency

ఉత్తమ కథలు