UGC : మౌలిక సదుపాయాలున్న ఉన్నత విద్యాసంస్థలు తమ వనరులను ఇతర ఇన్‌స్టిట్యూట్స్‌తో పంచుకోవాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) సలహా ఇస్తోంది. అందుకు నామమాత్రపు ఛార్జీని వసూలు చేసుకోవచ్చని పేర్కొంది. ఈమేరకు ఉన్నత విద్యా సంస్థలకు ఓ లేఖ రాసింది. అందుబాటులో ఉన్న వనరుల వినియోగానికి హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్ పరస్పరం సహకరించుకోవాలని కోరింది. ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలను కూడా షేర్ చేసింది.
ఇతర విద్యాసంస్థలకు అవసరమైన రిసోర్సెస్‌కు యాక్సెస్ అందించడం ద్వారా వచ్చిన ఆదాయంతో హోస్ట్ సంస్థలు తమ వనరులను సమర్థవంతంగా మేనేజ్, అప్‌గ్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని యూజీసీ తెలిపింది. ఈ నిర్ణయంతో హోస్ట్ హయర్ ఎడ్యుకేషన్స్... లైబ్రరీలు, ప్రయోగశాలలు, ఇతర డివైజ్‌లు వంటి వనరులు అందుబాటులో ఉన్నప్పుడల్లా, ఇతర సంస్థలకు వాటి యాక్సెస్‌ను అందిస్తాయి. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ ప్రక్రియ కొనసాగడానికి అవసరమైన మార్గదర్శకాలను కూడా జారీ చేసింది.
అందరికీ అందుబాటులోకి వనరులు
యూజీసీ మార్గదర్శకాల ప్రకారం... ప్రస్తుతం ఉన్న వనరులను సరైన రీతిలో వినియోగించుకోవడం వల్ల అదనపు పెట్టుబడి లేకుండా ఉత్పత్తి పెరుగుతుందని యూజీసీ పేర్కొంది. ఉన్నత విద్యాసంస్థల మధ్య ఈ సహకారం కారణంగా ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ అందరికీ సమానంగా అందుబాటులోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుందని తెలిపింది. షేరింగ్ చేయాల్సిన వనరుల ప్రక్రియ, విధానాన్ని విద్యా సంస్థలు పరస్పరం పంచుకోవాలని యూజీసీ సూచించింది.
CSE -2022: సివిల్స్ ఎగ్జామ్ పర్సనాలిటీ టెస్ట్ ఇ-సమ్మన్ లెటర్స్ రిలీజ్..ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..!
సెంట్రల్ యూనివర్సిటీల సహకారం
ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు, వనరుల ఏర్పాటుకు సెంట్రల్ యూనివర్సిటీలు సపోర్ట్ ఇవ్వనున్నట్లు యూజీసీ పేర్కొంది. దీంతో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ యాక్టివిటీస్‌లో ఇకపై గుణాత్మక మార్పు రానుందని తెలిపింది. ఇటువంటి వనరుల నిర్వహణ కోసం నిరంతర నిధులు అవసరమవుతాయి. కాబట్టి వాటిని మెరుగ్గా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని హయర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్‌లను యూజీసీ కోరింది.
ఇతర ఇన్‌స్టిట్యూట్స్‌కు సంబంధించి స్కిల్స్ అండ్ రిక్వైర్మెంట్స్, వనరుల వినియోగంపై నిబంధనలు- షరతులు, డిస్టెంట్ మోడల్ కోసం మార్గదర్శకాలు, కాస్ట్ అనాలసిస్, సహకార నిధుల పరిశోధన, ఆపరేషన్స్ వంటి వాటికోసం వనరులను వర్గీకరించడానికి కూడా మార్గదర్శకాలు ఉంటాయని యూజీసీ పేర్కొంది.
డ్యుయల్ డిగ్రీ సులభతరానికి..
డ్యుయల్ డిగ్రీలను అభ్యసించే ప్రక్రియను సులభతరం చేయడానికి చట్టబద్ధమైన సంస్థలను ఏర్పాటు చేయాలని యూనివర్సిటీలను ఆదేశించింది యూజీసీ. డ్యుయల్ డిగ్రీ ద్వారా ఏకకాలంలో రెండు ఎడ్యుకేషన్ కోర్సులను చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆర్డర్ కూడా గతేడాది ఏప్రిల్‌లోనే వచ్చింది. అయితే దీని అమల్లో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని యూజీసీ మరోసారి ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, JOBS, UGC