హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CUET 2022: యూజీ కోర్సుల అడ్మిషన్స్ ఎలా చేపడుతున్నారు..? అడ్మిషన్ ఏర్పాట్లపై యూజీసీ ఆరా..!

CUET 2022: యూజీ కోర్సుల అడ్మిషన్స్ ఎలా చేపడుతున్నారు..? అడ్మిషన్ ఏర్పాట్లపై యూజీసీ ఆరా..!

CUET 2022: యూజీ కోర్సుల అడ్మిషన్స్ ఎలా చేపడుతున్నారు..? అడ్మిషన్ ఏర్పాట్లపై యూజీసీ ఆరా..!

CUET 2022: యూజీ కోర్సుల అడ్మిషన్స్ ఎలా చేపడుతున్నారు..? అడ్మిషన్ ఏర్పాట్లపై యూజీసీ ఆరా..!

CUET 2022: అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్లు  చేపట్టడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) దేశవ్యాప్తంగా ఉన్న 45 సెంట్రల్ యూనివర్సిటీల నుంచి ‌తాత్కాలిక టైమ్‌లైన్, ఇతర వివరాలను కోరింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ (Central Universities)ల్లో ప్రవేశాల కోసం అర్హత పరీక్షగా కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్(CUET)ను ఈ ఏడాది నుంచి నిర్వహించారు. సీయూఈటీ-2022 ఫలితాలు కూడా ఇటీవల వెల్లడయ్యాయి. దీంతో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్లు చేపట్టడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) దేశవ్యాప్తంగా ఉన్న 45 సెంట్రల్ యూనివర్సిటీల నుంచి ‌తాత్కాలిక టైమ్‌లైన్, ఇతర వివరాలను కోరింది. అడ్మిషన్‌కు సంబంధించిన సమాచారం గురించి విద్యార్థులకు అప్‌డేట్ చేయడానికి వీలుగా ఈ వివరాలను అడిగినట్లు యూజీసీ ప్రకటించింది.

* అడిగిన వివరాలు ఇలా

మెరిట్ జాబితా, అడ్మిషన్ పోర్టల్ స్టేటస్, విద్యార్థులు అడ్మిషన్ కోసం ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి, అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వంటి వివరాలను సెంట్రల్ యూనివర్సిటీల నుంచి యూజీసీ కోరింది.

* నార్మలైజ్డ్ పర్సంటేజ్ ఆధారంగా అడ్మిషన్స్

కాగా, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో పర్సంటైల్ కాకుండా సాధారణ పర్సంటేజ్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తామని యూజీసీ స్పష్టం చేసింది. అడ్మిషన్ ప్రక్రియ అనేది అర్హత, ఖాళీగా ఉన్న సీట్ల సంఖ్య, దరఖాస్తు చేసుకున్న యూనివర్సిటీ అడ్మిషన్ విధానంతో పాటు నార్మలైజ్డ్ మార్కులపై ఆధారపడి ఉంటుంది. ఢిల్లీ యూనివర్సిటీతో పాటు మరికొన్ని వర్సిటీలు టై-బ్రేకింగ్ విధానంలో భాగంగా 12వ తరగతి మార్కులను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఇంకొన్ని యూనివర్సిటీలు 12వ తరగతి మార్కులను లెక్కించేటప్పుడు కొంత వెయిటేజీని కూడా ఇచ్చే అవకాశం ఉంది.

* కామన్ సీట్ అలొకేషన్ సిస్టమ్

ఢిల్లీ యూనివర్సిటీ (DU) అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ‘కామన్ సీట్ అలొకేషన్ సిస్టమ్’ (CSAS)ను ఏర్పాటు చేసింది. ఈ సిస్టమ్ ద్వారా మొదటి దశ కింద రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభించింది. ఇక, రెండో దశ సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభమై అక్టోబర్ 10న ముగుస్తుంది.

ఢిల్లీ యూనివర్సిటీ అడ్మిషన్ విధానం, అన్ని ప్రోగ్రామ్‌ల అర్హత ప్రమాణాలకు సంబంధించిన పూర్తి వివరాలను యూజీసీ బులెటిన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ -2022, కామన్ సీట్ అలొకేషన్ సిస్టమ్-2022లో పొందుపర్చారు. అలాగే ఢిల్లీ యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో సైతం ఈ వివరాలను ఉంచారు.

ఇది కూడా చదవండి : టెక్కీలకు శుభవార్త.. HCLలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..

CUET-UG స్కోర్ కార్డ్ ఆధారంగా అడ్మిషన్స్ చేపట్టనున్న సెంట్రల్ యూనివర్సిటీలు వివిధ సబ్జెక్టుల మెరిట్ జాబితాను తయారు చేయనున్నాయి. కాగా, ఢిల్లీ యూనివర్సిటీ తన మొదటి మెరిట్ జాబితాను సెప్టెంబర్ 26న ప్రకటించే అవకాశం ఉంది. ఇక చివరి మెరిట్ జాబితా అక్టోబర్ 10 నాటికి విడుదల కానుంది.

* అడ్మిషన్ ఏర్పాట్లపై ఆరా

యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.జగదీష్ కుమార్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న 45 సెంట్రల్ యూనివర్సిటీల్లో సీయూఈటీ-2022 ఆధారంగా యూజీ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్ల కోసం యూజీసీ వివరాలను కోరినట్లు తెలిపారు. CUET స్కోర్ కార్డుల ఆధారంగా కోర్సుల్లో ప్రవేశానికి వారు చేస్తున్న సన్నాహాల గురించి వర్సిటీలను అడిగినట్లు చెప్పారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, Central university, CUET 2022, JOBS, UGC

ఉత్తమ కథలు