హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Sickle cell Disorder: యూనివర్సిటీలు, కాలేజీలకు అలర్ట్.. యూజీసీ కీలక నిర్ణయం!

Sickle cell Disorder: యూనివర్సిటీలు, కాలేజీలకు అలర్ట్.. యూజీసీ కీలక నిర్ణయం!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Sickle cell Disorder: అన్ని ఉన్నత విద్యాసంస్థలు తమ సిలబస్‌లో సికిల్‌ సెల్‌ డిజార్డర్‌ గురించి చేర్చాలని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) కోరింది. ఇంతలా ఆందోళనకు గురిచేస్తున్న సికిల్‌ సెల్‌ డిజార్డర్‌ అంటే ఏమిటి, ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది, కార్యాచరణ, కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఇండియా (India)లో చాప కింద నీరులా వ్యాపిస్తున్న వ్యాధుల్లో సికిల్‌ సెల్‌ డిజార్డర్‌ (Sickle cell Disorder) ముందు స్థానంలో ఉంది. దీన్ని వ్యాప్తి ఎంతలా ఉందంటే 2023లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కొన్ని భవిష్యత్తు లక్ష్యాలు నిర్దేశించారు. అందులో ఇది కూడా ఉంది. 2047 నాటికి సికిల్‌ సెల్‌ డిజార్డర్‌ను పూర్తిగా నియంత్రించేలా ప్రణాళిక వేశారు. దీని తీవ్రత దృష్ట్యా అన్ని ఉన్నత విద్యాసంస్థలు తమ సిలబస్‌లో సికిల్‌ సెల్‌ డిజార్డర్‌ గురించి చేర్చాలని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) సైతం కోరింది. ఇంతలా ఆందోళనకు గురిచేస్తున్న సికిల్‌ సెల్‌ డిజార్డర్‌ అంటే ఏమిటి, ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది, కార్యాచరణ, కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

సికిల్ సెల్ డిజార్డర్ (ఎస్‌డీసీ) అనేది జీవితకాల వ్యాధి. గిరిజనులు ఎక్కువగా దీని బారిన పడుతుంటారు. దీనికి ఏకైక నివారణ బోన్‌ నేరో ట్రన్స్‌ప్లేంటేషన్‌ (ఎంపిక ఎముక మజ్జ మార్పిడి). ఈ నేపథ్యంలో దీనిపై ప్రతిఒక్కరికీ అవగాహన అవసరం. వైద్యుల కౌన్సెలింగ్, చికిత్సతో సమర్థంగా ఎదుర్కోవచ్చు. ఇంతకు ముందు, పాఠశాల, ఉన్నత విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు కల్పించడం ద్వారా మెరుగైన ఫలితాలు కనిపించాయి. ఈ క్రమంలోనే సిలబస్‌గా చేర్చేందుకు నిర్ణయించారు.

* విద్యాసంస్థలకు లేఖ

సికిల్‌ సెల్‌ డిజార్డర్‌ గురించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) దృష్టికి తీసుకురావడంతో యూజీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అఫీషియల్‌ నోటీసు ఇవ్వడంతో పాటు అన్ని యూనివర్సిటీల వైస్‌ ఛాన్సలర్లకు, విద్యాసంస్థల ప్రిన్సిపల్స్‌కు లెటర్‌ రాసింది. రావడానికి కారణాలు, గుర్తించడం, ట్రీట్మెంట్‌, నివారణ తదితర అంశాలను కరికులంలో చేర్చాలని యూజీసీ సెక్రటరీ ప్రొఫెసర్‌ మనీష్‌ జోషీ తెలిపారు.

* అవగాహనతో ప్రయోజనాలు

తలసేమియా వ్యాధిలో ప్రపంచంలోనే భారత్‌ రెండోస్థానంలో ఉందని, ప్రతి సంవత్సరం సుమారు 30,000 నుంచి 40,000 మంది పిల్లలు ఈ వ్యాధితో పుడుతున్నట్లు తన నోటీసులో పేర్కొంది. అవగాహన ద్వారా మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ , కేరళ , అస్సాం, తమిళనాడు , కర్ణాటక రాష్ట్రాల్లో సికిల్‌ సెల్‌ డిజార్డర్‌ తగ్గుముఖం పట్టినట్లు గుర్తించినట్లు తన నోటీసులో పేర్కొంది.

ఇది కూడా చదవండి : ఆ నైపుణ్యాలున్న వారికే ఇండియాలో డిమాండ్‌.. ఉద్యోగం తొందరగా వస్తుంది!

* పదో తరగతి విద్యార్థులకు కూడా

మహారాష్ట్రలోని కుర్ఖెడా జిల్లాకు చెందిన ఆరోగ్యధర్మ్ బహుదేశీయ అనే ఎన్‌జీవో 10వ తరగతి విద్యార్థుల బయాలజీ సిలబస్‌లో సికిల్‌ సెల్‌ గురించి పాఠం చేర్చడానికి యూజీసీ అనుమతి కోరింది. దీని గురించి విస్తృతమైన అవగాహన అవసరమని వైద్య ఉన్నతాధికారులు, ఎన్‌జీవోలు భావిస్తున్నారు. ఈ వ్యాధి గురించి యువతకు, సంఘాలు, మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌కు తెలియజేయడంలో విద్యా శాఖ నిమగ్నమై ఉండాలని ఎన్‌జీవో అధ్యక్షుడు సూచించారు.

First published:

Tags: Career and Courses, EDUCATION, JOBS, Syllabus, UGC

ఉత్తమ కథలు