హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CUET UG 2023: సీయూఈటీ అభ్యర్థుల కోసం ఎగ్జామినేషన్‌ హెల్ఫ్‌ సెంటర్స్‌.. ఉచితంగానే సేవలు..

CUET UG 2023: సీయూఈటీ అభ్యర్థుల కోసం ఎగ్జామినేషన్‌ హెల్ఫ్‌ సెంటర్స్‌.. ఉచితంగానే సేవలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

CUET UG 2023: ఈ ఏడాది అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రవేశాల కోసం యూజీసీ ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌ cuet.samarth.ac.in ద్వారా అప్లై చేసుకోవాలి. దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 9న ప్రారంభించగా మార్చి 12 వరకు స్వీకరిస్తారు. మే 21 నుంచి 31 వరకు సీయూఈటీ (CUET-2023) పరీక్ష జరుగుతుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

యూనివర్సిటీల్లో ప్రవేశాల కోసం ఏటా కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (CUET) నిర్వహిస్తుంది. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (UGC) ఆధ్వర్యంలో అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ చేసే వాళ్ల కోసం వేర్వేరుగా ఎంట్రన్స్‌ పరీక్షలు జరుగుతాయి. అనంతరం మెరిట్‌ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఈ ఏడాది అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రవేశాల కోసం యూజీసీ ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌ cuet.samarth.ac.in ద్వారా అప్లై చేసుకోవాలి. దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 9న ప్రారంభించగా మార్చి 12 వరకు స్వీకరిస్తారు. మే 21 నుంచి 31 వరకు సీయూఈటీ (CUET-2023) పరీక్ష జరుగుతుంది.

అయితే గ్రామీణ ప్రాంత అభ్యర్థులు, రిమోట్‌ ఏరియాల్లో ఉండేవారు, కంప్యూటర్‌పై అవగాహన లేనివాళ్లు ఆన్‌లైన్‌లో అప్లై చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి అభ్యర్థుల్లో అవగాహన పెంచేందుకు, సొంతంగా అప్లై చేసుకునేలా వివరించేందుకు ఎగ్జామినేషన్‌ హెల్ప్‌ సెంటర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. 22 హెల్ప్‌ లైన్‌ సెంటర్లు తెరిచేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) సిద్ధమైంది.

* అభ్యర్థుల సంఖ్య పెరిగే అవకాశం

రూరల్‌, రిమోట్‌ ప్రాంతాల్లో చాలామంది సీయూఈటీ పరీక్ష రాయాలనుకున్నా ఆన్‌లైన్‌పై అవగాహన లేక దూరమవుతున్నారు. మరికొందరు ఇంటర్నెట్‌ సెంటర్లకు వెళ్లి ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందిని అధిగమించి, అందరూ సొంతంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేకునేందుకు హెల్స్‌ లైన్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు యూజీసీ ఛైర్మన్‌ ఎం.జగదీష్‌కుమార్‌ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : ఈపీఎఫ్ఓలో 577 జాబ్స్... అప్లై చేయండి ఇలా

ఆ సెంటర్లలో టెక్నికల్‌ ఎక్స్‌పర్ట్‌ ఒకరు ఉంటారు. అతను అప్లికేషన్‌ ఎలా నింపాలో పూర్తిగా వివరిస్తాడు. దాని ప్రకారం సులభంగా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్నెట్‌ సెంటర్లలో అవస్థలు పడక్కర్లేదు. సీయూఈటీ యూజీ పరీక్ష రాయాలనుకునే అభ్యర్థులు సంబంధిత డాక్యుమెంట్లతో సహాయ కేంద్రానికి వెళ్తే సరిపోతుందని ఆయన మరో ట్వీట్‌లో తెలిపారు. ఈ కేంద్రాల వల్ల దేశవ్యాప్తంగా పరీక్ష రాసే వాళ్ల సంఖ్య పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

* ఉచితంగానే సేవలు

22 హెల్ప్‌లైన్‌ సెంటర్లు ఏర్పాటు చేయగా ఇక్కడ సేవలు ఉచితం. ఈ సెంటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకునేందుకు NTA వెబ్‌సైట్‌ http://nta.ac.in లేదా http://cuet.samarth.ac.in వెబ్‌సైట్లలో చూడచ్చు. అనంతరం ఆయా కేంద్రాలకు వెళ్లి అక్కడ సేవలను ఉపయోగించుకోవచ్చు. టెక్నికల్‌ ఇబ్బందులతో గతంలో కొంతమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారనే వాదన ఉంది. వాటిని అధిగమించేందుకే ఈ విధానం తీసుకొచ్చారు.

ఇదే మాదిరిగా భారతీయ యూనివర్సిటీల్లో చదువుకోవాలను వారి కోసం కూడా యూజీసీ ఈ పరీక్ష నిర్వహిస్తుంది. సీఈయూటీ- యూజీ పరీక్ష రాయాలనుకునే ఫారిన్‌/ ఎన్‌ఆర్‌ఐ (NRI)/ ఓసీఐ (OCI) అభ్యర్థులు పైన సూచించిన వెబ్‌సైట్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అలా అప్లై చేసేవాళ్లు ఓసారి రూల్స్‌ చెక్‌చేసుకోవాలని యూజీసీ సూచిస్తోంది. వీరి కోసం దేశం వెలుపల 24 నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని యూజీసీ తెలిపింది.

First published:

Tags: Career and Courses, CUET 2023, EDUCATION, JOBS, UGC

ఉత్తమ కథలు