Home /News /jobs /

UDISE REPORT SAID THAT ONLY 39 PERCENT SCHOOLS IN INDIA HAD COMPUTERS 22 PERCENT HAD NET CONNECTION IN 2019 20 NS GH

UDISE Report: దేశంలో కేవలం 39 శాతం స్కూళ్లలోనే ఆ సదుపాయం.. షాకింగ్ లెక్కలు బయటపెట్టిన రిపోర్ట్.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశంలో కేవలం 39 శాతం పాఠశాలల్లోనే కంప్యూటర్లు ఉన్నాయని యూనిఫైడ్ ఇన్ఫర్మేషన్​ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్​ ప్లస్​ (యూడీఐఎస్​ఈ ప్లస్) నివేదిక తెలిపింది. కేవలం 22 శాతానికి పైగా స్కూళ్లకు మాత్రమే ఇంటర్నెట్​ కనెక్షన్ ఉందని వెల్లడించింది.

ప్రస్తుత తరంలో పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు కంప్యూటర్ పాఠాలు బోధించడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో కంప్యూటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా.. ఉండాల్సిన స్థాయిలో పురోగతి లేదు. దీంతో అనుకున్న స్థాయిలో విద్యార్థులకు కంప్యూటర్ బోధన జరగడం లేదు. తాజాగా వెల్లడైన ఓ నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. దేశంలో 39 శాతం పాఠశాలల్లోనే కంప్యూటర్లు ఉన్నాయని యూనిఫైడ్ ఇన్ఫర్మేషన్​ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్​ ప్లస్​ (యూడీఐఎస్​ఈ ప్లస్) నివేదిక వెల్లడించింది. అలాగే 22 శాతానికి పైగా స్కూళ్లకు మాత్రమే ఇంటర్నెట్​ కనెక్షన్ ఉందని పేర్కొంది. అయితే 2019-20లో 90 శాతం పాఠశాలల్లో విద్యార్థులకు హ్యాండ్​వాష్ సదుపాయం ఉందని వెల్లడించింది. 2012-13తో పోలిస్తే ఇది 36.3 శాతం పెరిగినట్టు పేర్కొంది. “2019-20 సంవత్సరంలో దాదాపు 39 శాతం పాఠశాలల్లో కంప్యూటర్లు ఉన్నాయి.
Andhra Pradesh: ఏపీలో నేటి నుంచి స్కూళ్లు.. విద్యార్థులు హాజరయ్యేది ఎప్పటి నుంచి అంటే..
Telangana Schools: విద్యార్థులకు అలర్ట్.. నేటి నుంచి బడులు.. ఆ తరగతి వాళ్లకు మాత్రమే..

గతేడాది కంటే ఇది ఆరు శాతం పెరిగింది. అలాగే 22 శాతం స్కూళ్లలో ఇంటర్నెట్ కనెక్షన్ ఉండగా.. గత సంవత్సరం కంటే 3.5 శాతం మెరుగైంది. 2012-13లో 54.6 శాతం పాఠశాలలకే విద్యుత్ సదుపాయం ఉండగా.. ప్రస్తుతం 83 శాతం స్కూల్స్​కు విద్యుత్ ఉంది. 2018-19 కంటే ఇది 7 శాతం ఎక్కువ. ప్రస్తుతం 84 శాతం పాఠశాలల్లో లైబ్రరీ/రీడింగ్ రూమ్​/ రీడింగ్ రూమ్​/ రీడింగ్ కార్నర్స్​ ఉన్నాయి” అని నివేదిక వెల్లడించింది.

2012-13లో కేంద్ర విద్యాశాఖ.. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్​ ఇన్ఫర్మేషన్ ఆన్ స్కూల్ ఎడ్యుకేషన్​ (యూడీఐఎస్​ఈ)ని ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న 15 లక్షల పాఠశాలలు, 85 లక్షల మంది ఉపాధ్యాయులు, 25 కోట్ల మంది విద్యార్థుల సమాచారాన్ని యూడీఐఎస్​ఈ పర్యవేక్షిస్తోంది. దీనికి అప్‌డేటెడ్ వర్షనే యూడీఐఎస్​ఈ ప్లస్.

2019-21లో మొత్తం 26.45 కోట్ల మంది విద్యార్థులు ప్రీప్రైమరీ నుంచి హైయర్ సెకండరీ క్లాసుల వరకు పాఠశాలల్లో చదువుతున్నారని నివేదిక వెల్లడించింది. 2018-19తో పోలిస్తే 42.3 లక్షల మంది విద్యార్థులు పెరిగారు. అలాగే ప్రీప్రైమరీ స్థాయిలో పాఠశాలల్లో బాలికలు చేరడం కూడా పెరిగిందని వెల్లడించింది.

“2019-20లో ప్రీప్రైమరీ నుంచి హైయర్ సెకండరీ స్కూల్స్​ విద్యార్థుల సంఖ్య 25 కోట్ల కంటే ఎక్కువగా ఉంది. 2018-19 కంటే ఇది దాదాపు పది శాతం కంటే ఎక్కువగా ఉంది. అలాగే 2018-19 కంటే 2019-20లో టీచర్ల సంఖ్య 2.72శాతం పెరిగింది. 2019-20లో 98.87 లక్షల మంది పాఠశాల టీచర్లు ఉండగా.. అంతకు ముందు ఏడాది కంటే 2.57 లక్షల మంది పెరిగారు. అలాగే గ్రాస్ ఎన్రోల్​మెంట్ రేషియో (జీఈఆర్​) కూడా 2019-20లో బాగా పెరిగింది. ఆప్పర్ ప్రైమరీ స్థాయిలో 89.7 శాతానికి, ఎలిమెంటరీ స్థాయిలో 97.8 శాతానికి, సెకండరీ లెవల్​లో 77.9 శాతానికి, హైయర్ లెవెల్​లో 51.4 శాతానికి పెరిగింది” అని యూడీఐఎస్​ఈ ప్లస్ నివేదిక వెల్లడించింది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: School admissions, Telangana schools, Ts government

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు