హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

UCO Bank Jobs: యూకో బ్యాంకులో 91 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

UCO Bank Jobs: యూకో బ్యాంకులో 91 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

UCO Bank Recruitment 2020 | బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు కోరుకునేవారికి గుడ్ న్యూస్. యూకో బ్యాంక్ పలు ఖాళీలను భర్తీ చేస్తోంది.

  యూకో బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పెషలిస్ట్ ఆఫీసర్ కేడర్ స్కేల్ 1, స్కేల్ 2 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. సెక్యూరిటీ ఆఫీసర్, ఇంజనీర్, ఎకనమిస్ట్, ఐటీ ఆఫీసర్, సీఏ లాంటి పోస్టులున్నాయి. మొత్తం 91 ఖాళీలు ఉన్నాయి. దేశంలోని పలు బ్రాంచ్‌లల్లో ఈ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు 2020 అక్టోబర్ 27న దరఖాస్తు ప్రక్రియ మొదలుకానుంది. అప్లై చేయడానికి 2020 నవంబర్ 17 చివరి తేదీ. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.ucobank.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

  UPSC Jobs: యూపీఎస్‌సీ జాబ్ నోటిఫికేషన్... రెండు రోజుల్లో అప్లై చేయండి

  SSC Recruitment 2020: గుడ్ న్యూస్... ఇంటర్ పాసైనవారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

  UCO Bank Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


  మొత్తం ఖాళీలు- 91

  సెక్యూరిటీ ఆఫీసర్- 9

  ఇంజనీర్ (సివిల్, ఎలక్ట్రికల్, ఆర్కిటెక్ట్)- 8

  ఎకనమిస్ట్- 2

  స్టాటిస్టీషియన్- 2

  ఐటీ ఆఫీసర్- 20

  ఛార్టర్డ్ అకౌంటెంట్- 50

  UCO Bank Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


  దరఖాస్తు ప్రారంభం- 2020 అక్టోబర్ 27

  దరఖాస్తుకు చివరి తేదీ- 2020 నవంబర్ 17

  అడ్మిట్ కార్డ్ రిలీజ్- త్వరలో వెల్లడించనున్న యూకో బ్యాంక్

  ఆన్‌లైన్ ఎగ్జామ్- 2020 డిసెంబర్ లేదా 2021 జనవరి

  పరీక్షా కేంద్రాలు- తెలంగాణలో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం

  విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.

  దరఖాస్తు ఫీజు- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.118. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1180.

  Railway Jobs: మొత్తం 1,03,769 ఖాళీల భర్తీ విషయంలో రైల్వే కీలక నిర్ణయం

  BEL Recruitment 2020: డిప్లొమా పాసయ్యారా? భారత్ ఎలక్ట్రానిక్స్‌లో ఉద్యోగాలకు అప్లై చేయండిలా

  UCO Bank Recruitment 2020: అప్లై చేయండి ఇలా


  అభ్యర్థులు ముందుగా https://www.ucobank.com/ ఓపెన్ చేయాలి.

  రిక్రూట్‌మెంట్ సెక్షన్‌లో careers సెక్షన్‌లో recruitment opportunities పైన క్లిక్ చేయాలి.

  వేర్వేరు పోస్టులకు వేర్వేరు లింక్స్ ఉంటాయి. మీరు దరఖాస్తు చేయాలనుకునే లింక్ పైన క్లిక్ చేయాలి.

  మీ పేరు, ఇతర వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.

  ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.

  ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.

  అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భవిష్యత్తు రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Bank, Banking, CAREER, Exams, Job notification, JOBS, NOTIFICATION, UCO Bank

  ఉత్తమ కథలు