యూరేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Uranium Corporation of India Limited)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ సూపరింటెండెంట్ సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేస్తారు. కాంట్రాక్టు (Contract) ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపిక విధానం ఆఫ్‌లైన్ (Offline) పద్ధతిలో నిర్వహిస్తారు. పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ (Inteview) ద్వారానే అభ్యర్థిని ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ సంబంధిత వివరాలు తెలుసుకోవడానికి http://uraniumcorp.in/job.html వెబ్‌సైట్‌ను సందర్శించాలి. పూర్తిగా నోటిఫికేషన్ చదివిన తరువాతే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనేందుకు అక్టోబర్ 25, 2021 వరకు అవకాశం ఉంది.
అర్హతలు.. ఖాళీల వివరాలు
పోస్టు పేరు | అర్హతలు | ఖాళీలు |
అసిస్టెంట్ సూపరింటెండెంట్ (సివిల్) | గుర్తింపు పొందిన యూనివర్సిటీలో సివిల్ రంగంలో ఇంజనీరింగ్ చేయాలి. భవన నిర్మాణ రంగంలో, రోడ్డు కన్ స్ట్రక్షన్లో అనుభవం ఉండాలి. పోస్టు పని అర్హత రెండేళ్లు ఉండాలి. గరిష్ట వయసు 30 ఏళ్లు మించి ఉండకూడదు. | 02 |
సూపర్వైజర్ (సివిల్) | సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లమా చేసి ఉండాలి. పోస్టు అనుభవం ఐదు ఏళ్లు ఉండాలి. గరిష్ట వయసు 35 ఏళ్లు మించి ఉండకూడదు. | 04 |
ఎంపిక విధానం..
- కేవలం ఇంటర్వ్యూ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- ఎంపికైన పూర్తిగా అభ్యర్థి అకాడమిక్ (Academic) వృత్తి అనుభవం ఆధారంగా ఉంటుంది.
- అభ్యర్థి విద్యార్హత, పని అనుభవానికి ఇలా ప్రతీ దానికి ప్రత్యేక వెయిటేజీ (Weightage) ఉంటుంది.
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూ (Interview) కి పిలుస్తారు.
Cochin port Trust Jobs: కొచ్చిన్ పోర్టులో కాంట్రాక్టు ఉద్యోగాలు..
దరఖాస్తు విధానం..
- ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలి.
- ముందుగా అధికారిక వెబ్సైట్ http://uraniumcorp.in/job.html ను సందర్శించాలి.
- నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవాలి.
- నోటిఫికేషన్ చివరిలో అప్లికేషన్ ఫాం ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని నింపాలి.
- ఫార్మెట్ ఆధారంగా నింపిన ఫాంను
Gen.Manager (Inst./Pers.&IRs./CP)
Uranium Corporation of India Limited,
(A Government of India Enterprise)
P.O. Jaduguda Mines, Distt.- Singhbhum East,
JHARKHAND-832102
అడ్రస్‌కు పంపాలి.
ఇంటర్వ్యూకి అవసరమైన డాక్యుమెంట్స్
- పదో తరగతి సర్టిఫికెట్ (Certificate) ఉండాలి.
- ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థిలు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ ఉండాలి.
- విద్యార్హతకు సంబంధించిన పూర్తి ధ్రువపత్రాలు అవసరం.
- వృత్తి అనుభవానికి సంబంధించిన సర్టిఫికెట్లు అవసరం
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Government jobs, Govt Jobs 2021, Job notification, JOBS