Home /News /jobs /

UCIL Recruitment 2021: నిరుద్యోగులకు యురేనియం కార్పొరేషన్ శుభవార్త.. రూ. 46 వేల వేతనంతో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

UCIL Recruitment 2021: నిరుద్యోగులకు యురేనియం కార్పొరేషన్ శుభవార్త.. రూ. 46 వేల వేతనంతో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL) నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    కరోనా ప్రభావం కాస్త తగ్గిన తర్వాత దేశంలో ఉద్యోగ నియామకాలు (Jobs in India) జోరందుకున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు వరుసగా నోటిఫికేషన్లు (Job Notifications) విడుదల చేస్తున్నాయి. తాజాగా.. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మొత్తం 16 ఫోర్‌మెన్‌ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు కాంట్రాక్ట్ విధానంలో పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ. 46, 020 వేతనం చెల్లించనున్నట్లు నోటిఫికేషన్లో స్పస్టం చేశారు. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లై (Job Application) చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
    TCIL Recruitment 2021: బీటెక్ చేసిన వారికి శుభవార్త.. TCILలో అప్రంటీస్ ఖాళీలు.. ఇలా అప్లై చేయండి

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
    ఈ నోటిఫికేషన్ ద్వారా ఫోర్‌మెన్‌ విభాగంలో 16 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మైనింగ్ అండ్ మైన్ సర్వేయింగ్ లో డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఫోర్‌మెన్‌/సెకండ్ క్లాస్/ఫస్ట్ క్లాస్ సర్టిఫికేట్ నుంచి పొంది ఉండాలి. అభ్యర్థుల వయస్సు 35 ఏళ్లలోపు ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
    BECIL Recruitment 2021: 5వ తరగతి, టెన్త్, డిగ్రీ అర్హతతో జాబ్స్.. రూ. 20 వేల వరకు వేతనం.. ఇలా అప్లై చేయండి

    ఎలా అప్లై చేయాలంటే..
    అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది.
    Step 1: ముందుగా అప్లికేషన్ ఫామ్ ను అధికారిక వెబ్ సైట్ http://www.uraniumcorp.in/ నుంచి అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
    Step 2: అప్లికేషన్ ఫామ్ లో సూచించిన వివరాలను నమోదు చేయాలి.
    Step 3: అప్లికేషన్ ఫామ్ కు పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, సెల్ఫ్ అటెస్ట్ చేసిన మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్, ఇతర విద్యార్హతల సర్టిఫికేట్లు, అనుభవం, కుల ధృవీకరణ పత్రం ను జత చేయాలి.
    NHPC Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. NHPCలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి
    అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    అధికారిక వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    అప్లికేషన్ ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    Step 4: ఆ అప్లికేషన్ ఫామ్ ను Gen.Manager (Inst./Pers.&IRs./CP), Uranium Corporation of India Limited, (A Government of India Enterprise)
    P.O. Jaduguda Mines, Distt.- Singhbhum East, JHARKHAND-832102 . చిరునామాకు పంపించాలని నోటిఫికేషన్లో తెలిపారు.
    Step 5: అప్లికేషన్లకు ఈ నెల 15ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని స్పష్టం చేశారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Central Government Jobs, Government jobs, Job notification, JOBS

    తదుపరి వార్తలు