Jobs: యురేనియం కార్పొరేషన్‌లో 136 జాబ్స్... దరఖాస్తు గడువు పెంపు

UCIL Recruitment 2020 | డిగ్రీ పాసయ్యారా? బీటెక్ పూర్తి చేశారా? యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-UCIL నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది.

news18-telugu
Updated: July 27, 2020, 3:27 PM IST
Jobs: యురేనియం కార్పొరేషన్‌లో 136 జాబ్స్... దరఖాస్తు గడువు పెంపు
Jobs: యురేనియం కార్పొరేషన్‌లో 136 జాబ్స్... దరఖాస్తు గడువు పెంపు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-UCIL గతంలో 136 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు గడువు 2020 జూన్ 22న ముగిసింది. కానీ ఆసక్తి గల అభ్యర్థులకు మరో అవకాశం ఇస్తోంది యురేనియం కార్పొరేషన్. దరఖాస్తు గడువును 2020 ఆగస్ట్ 10 వరకు పొడిగించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రాడ్యుయేట్ ట్రైనీ, అప్రెంటీస్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ http://www.ucil.gov.in/ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు.

UCIL Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...



మొత్తం ఖాళీలు- 136
గ్రాడ్యుయేట్ ఆపరేషనల్ ట్రైనీ (కెమికల్)- 4
మైనింగ్ మేట్ సీ- 52
బాయిలర్ కమ్ కంప్రెషర్ అటెండెంట్ ఏ- 3
వైండింగ్ ఇంజిన్ డ్రైవర్ బీ- 14బ్లాస్టర్ బీ- 4
అప్రెంటీస్ (మైనింగ్ మేట్)- 53
అప్రెంటీస్ (ల్యాబరేటరీ అసిస్టెంట్)- 6

UCIL Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం- 2020 మే 18
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఆగస్ట్ 10 ఉదయం 10 గంటలు
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
ఆన్‌లైన్ ఎగ్జామ్- త్వరలో వెల్లడించనున్న యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
వేతనం- రూ.33,994 వరకు.
Published by: Santhosh Kumar S
First published: July 27, 2020, 3:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading