హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

UBI Recruitment 2021: యూనియన్ బ్యాంక్‌లో 347 మేనేజర్ జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

UBI Recruitment 2021: యూనియన్ బ్యాంక్‌లో 347 మేనేజర్ జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

UBI Recruitment 2021 | బ్యాంక్ ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-UBI మొత్తం 347 మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

  యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-UBI ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 347 ఉద్యోగాలు ఉన్నాయి. నియామక ప్రక్రియ పూర్తయ్యే నాటికి పోస్టుల సంఖ్య పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 సెప్టెంబర్ 3 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.unionbankofindia.co.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో అప్లై చేయాలి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.

  UBI Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


  మొత్తం ఖాళీలు- 347

  సీనియర్ మేనేజర్ (రిస్క్)- 60

  మేనేజర్ (రిస్క్)- 60

  మేనేజర్ (సివిల్ ఇంజనీర్)- 7

  మేనేజర్ (ఆర్కిటెక్ట్)- 7

  మేనేజర్ (ఎలక్ట్రికల్ ఇంజనీర్)- 2

  మేనేజర్ (ప్రింటింగ్ టెక్నాలజిస్ట్)- 1

  మేనేజర్ (ఫారెక్స్)- 50

  మేనేజర్ (చార్టెర్డ్ అకౌంటెంట్)- 14

  అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్ ఆఫీసర్)- 26

  అసిస్టెంట్ మేనేజర్ (ఫారెక్స్)- 120

  Army Jobs 2021: డిగ్రీ అర్హతతో ఆర్మీలో ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

  UIDAI Recruitment 2021: ఆధార్ సంస్థలో ఉద్యోగాలు... హైదరాబాద్‌లో ఖాళీలు

  UBI Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


  దరఖాస్తు ప్రారంభం- 2021 ఆగస్ట్ 12

  దరఖాస్తుకు చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 3

  ఆన్‌లైన్ ఎగ్జామ్- 2021 అక్టోబర్ 9

  విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. బీఈ, బీటెక్, సీఏ, ఎంబీఏ లాంటి కోర్సుల్ని పూర్తి చేసినవారు దరఖాస్తు చేయచ్చు. నోటిఫికేషన్‌లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

  వయస్సు- 20 నుంచి 35 ఏళ్లు. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

  దరఖాస్తు ఫీజు- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.850. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులు, దివ్యాంగులకు ఫీజు లేదు

  ఎంపిక విధానం- ఆన్‌లైన్ ఎగ్జామ్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ.

  వేతనం- రూ.63840 నుంచి రూ.78230 వరకు

  IDBI Bank Jobs 2021: ఐడీబీఐ బ్యాంకులో 920 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

  Post Office Jobs: టెన్త్, ఇంటర్ అర్హతతో పోస్ట్ ఆఫీస్ జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

  UBI Recruitment 2021: అప్లై చేయండి ఇలా


  అభ్యర్థులు ముందుగా https://www.unionbankofindia.co.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

  Recruitments సెక్షన్‌లో Careers Overview క్లిక్ చేయాలి.

  UNION BANK RECRUITMENT PROJECT 2021-22 (SPECIALIST OFFICERS) నోటిఫికేషన్ కనిపిస్తుంది.

  అందులో Apply Online పైన క్లిక్ చేయాలి.

  కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో NEW REGISTRATION పైన క్లిక్ చేయాలి.

  పేరు, పుట్టిన తేదీ, కాంటాక్ట్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, అడ్రస్ లాంటి వివరాలు ఎంటర్ చేసి save and next బటన్ పైన క్లిక్ చేయాలి.

  ఆ తర్వాత స్టెప్‌లో ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.

  ఫోటో, సంతకం అప్‌లోడ్ చేసిన తర్వాత విద్యార్హతలు, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వివరాలు ఎంటర్ చేసి save and next బటన్ పైన క్లిక్ చేయాలి.

  ఆ తర్వాత అప్లికేషన్ ప్రివ్యూ చూసుకోవాలి. తప్పులు ఏవైనా ఉంటే సరిచేయాలి.

  ఆ తర్వాత save and next పైన క్లిక్ చేయాలి.

  దరఖాస్తు ఫీజు చెల్లించిన Final Submit బటన్ పైన క్లిక్ చేయాలి.

  మీ అప్లికేషన్ ఫామ్ విజయవంతంగా సబ్మిట్ అవుతుంది.

  అప్లికేషన్ వివరాలు ఎస్ఎంఎస్, ఇమెయిల్‌లో వస్తాయి.

  దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భవిష్యత్తులో రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Bank, Bank Jobs 2021, Banking, CAREER, Exams, Government jobs, Govt Jobs 2021, Job notification, JOBS, NOTIFICATION, Union bank of india, Upcoming jobs

  ఉత్తమ కథలు