UBI Recruitment 2021: రూ.78,000 వేతనంతో యూనియన్ బ్యాంక్‌లో 347 ఉద్యోగాలు

UBI Recruitment 2021: రూ.78,000 వేతనంతో యూనియన్ బ్యాంక్‌లో 347 ఉద్యోగాలు (ప్రతీకాత్మక చిత్రం)

UBI Recruitment 2021 | ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ అయిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union Bank of India) మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అప్లికేషన్ ప్రాసెస్ మరో రెండు రోజుల్లో ముగియనుంది.

  • Share this:
    యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union Bank of India) ఓ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) ద్వారా సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 347 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టుల సంఖ్య పెరగొచ్చు లేదా తగ్గొచ్చని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union Bank of India) నోటిఫికేషన్‌లో వెల్లడించింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి 2021 సెప్టెంబర్ 3 చివరి తేదీ. అంటే మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి. అప్లై చేయడానికి ముందు నోటిఫికేషన్‌లో విద్యార్హతలు తెలుసుకోవాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే పోస్టులు, ఖాళీల వివరాలు, విద్యార్హతలు, ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.















































     మొత్తం ఖాళీలు  347
     సీనియర్ మేనేజర్ (రిస్క్)  60
     మేనేజర్ (రిస్క్)  60
     మేనేజర్ (సివిల్ ఇంజనీర్)  7
     మేనేజర్ (ఆర్కిటెక్ట్)  7
     మేనేజర్ (ఎలక్ట్రికల్ ఇంజనీర్)  2
     మేనేజర్ (ప్రింటింగ్ టెక్నాలజిస్ట్)  1
     మేనేజర్ (ఫారెక్స్) 50
     మేనేజర్ (చార్టెర్డ్ అకౌంటెంట్)  14
     అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్ ఆఫీసర్)  26
     అసిస్టెంట్ మేనేజర్ (ఫారెక్స్)  120

    NIACL Recruitment 2021: రూ.62,000 వేతనంతో ప్రభుత్వ ఇన్స్యూరెన్స్ కంపెనీలో 300 జాబ్స్

    UBI Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2021 ఆగస్ట్ 12

    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 3

    ఆన్‌లైన్ ఎగ్జామ్- 2021 అక్టోబర్ 9

    విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. బీఈ, బీటెక్, సీఏ, ఎంబీఏ లాంటి కోర్సుల్ని పూర్తి చేసినవారు దరఖాస్తు చేయచ్చు. నోటిఫికేషన్‌లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

    వయస్సు- 20 నుంచి 35 ఏళ్లు. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

    దరఖాస్తు ఫీజు- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.850. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులు, దివ్యాంగులకు ఫీజు లేదు

    ఎంపిక విధానం- ఆన్‌లైన్ ఎగ్జామ్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ.

    వేతనం- రూ.63840 నుంచి రూ.78230 వరకు

    APEPDCL Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌లో 398 ఎనర్జీ అసిస్టెంట్ ఉద్యోగాలు... ఇలా అప్లై చేయండి

    UBI Recruitment 2021: దరఖాస్తు విధానం ఇదే


    Step 1- అభ్యర్థులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ https://www.unionbankofindia.co.in/ లో Recruitment సెక్షన్ ఓపెన్ చేయాలి.

    Step 2- UNION BANK RECRUITMENT PROJECT 2021-22 (SPECIALIST OFFICERS) నోటిఫికేషన్ కనిపిస్తుంది.

    Step 3- అందులో Apply Online పైన క్లిక్ చేయాలి.

    Step 4- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో NEW REGISTRATION పైన క్లిక్ చేయాలి.

    Step 5- పేరు, పుట్టిన తేదీ, కాంటాక్ట్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, అడ్రస్ లాంటి వివరాలు ఎంటర్ చేసి save and next బటన్ పైన క్లిక్ చేయాలి.

    Step 6- అభ్యర్థి లేటెస్ట్ ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.

    Step 7- తర్వాత విద్యార్హతలు, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వివరాలు ఎంటర్ చేసి save and next బటన్ పైన క్లిక్ చేయాలి.

    Step 8- అప్లికేషన్ ప్రివ్యూ చూసుకోవాలి. తప్పులు ఏవైనా ఉంటే సరిచేయాలి. save and next పైన క్లిక్ చేయాలి.

    Step 9- దరఖాస్తు ఫీజు చెల్లించిన Final Submit బటన్ పైన క్లిక్ చేయాలి.

    Step 10- దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భవిష్యత్తులో రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published: