Home /News /jobs /

UBER RECRUTIMENT UBER FOCUSES ON BUSINESS EXPANSION ANOTHER 500 HIRES BY DECEMBER 2023 GH VB

Uber Recruitment: వ్యాపార విస్తరణపై దృష్టి పెట్టిన ఉబెర్.. 2023 డిసెంబర్ నాటికి మరో 500 నియామకాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మొబైల్ యాప్ ఆధారిత క్యాబ్ అగ్రిగేటర్, డెలివరీ సేవలను అందించే ఉబెర్ సంస్థ.. దేశంలోని తమ కేంద్రాల్లో నిపుణుల సంఖ్యను మరింత పెంచుకోవాలని యోచిస్తోంది.

మొబైల్ యాప్(Mobile App) ఆధారిత క్యాబ్ అగ్రిగేటర్, డెలివరీ(Delivery) సేవలను అందించే ఉబెర్(Uber) సంస్థ.. దేశంలోని తమ కేంద్రాల్లో నిపుణుల సంఖ్యను మరింత పెంచుకోవాలని యోచిస్తోంది. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి హైదరాబాద్(Hyderabad), బెంగళూరు(Bangalore) కేంద్రాల్లో మరో 500 మంది నిపుణులను నియమించుకోనున్నట్లు ఉబెర్ ఇండియా(Uber India) ప్రకటించింది. ఇప్పటికే ఈ రెండు కేంద్రాల్లో కలిపి 1,000 మందితో కూడిన సాంకేతిక బృందం ఉంది. కొత్త నియామక ప్రక్రియ ద్వారా ఉబెర్ ఇండియా అదనంగా 500 మందిని ఆన్‌బోర్డ్‌లోకి తీసుకోవాలని భావిస్తుంది. డేటా సైంటిస్ట్, ప్రోగ్రామ్ మేనేజర్.. తదితర విభాగాల్లో నియామకాలు చేపట్టనుంది. స్థానిక నైపుణ్యంతో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను నిర్మించడమే తమ లక్ష్యమని, అలాగే స్థానికంగా తయారు చేసిన దాన్ని ప్రపంచ వ్వాప్తంగా స్కేలింగ్ చేయడం కూడా తమ కర్తవ్యమని ఉబెర్ డైరెక్టర్‌లలో ఒకరు మణికందన్ తంగరత్నం వెల్లడించారు.

గత వారం సంస్థ బెంగళూరులో ఉన్న కేంద్రాన్ని విస్తరించింది. భారత్‌లో విస్తరించాలన్న తమ లక్ష్యానికి అనుగుణంగా కొత్తగా నియామక ప్రక్రియ ఉండనుందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించేందుకు ఇది దోహదపడుతుందని ఉబెర్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ నెప్పల్లి నాగ తెలిపారు. భారత్‌లోని రెండు కేంద్రాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నామని తెలిపారు.

ఉబెర్ సీనియర్ డైరెక్టర్ జైరామ్ వల్లియూర్ మాట్లాడుతూ.. ప్రస్తుతానికి ఏదైనా సమస్య ఉత్పన్నమైతే పరిష్కరించే తమ బృందంలోని వ్యక్తులతో కలిసి పని చేయడం ఎంతో ఆసక్తి ఉందన్నారు. భవిష్యత్తులో తమ టెక్ బృందాన్ని నడిపించే సామర్థ్యం ఉన్న వ్యక్తులను నియమించుకోవాలని చూస్తున్నట్లు ఆయన తెలిపారు.

Offers on Headphones: అమెజాన్‌లో హెడ్‌ఫోన్స్‌పై 50 శాతానికి పైగా డిస్కౌంట్.. వాటిపై ఓ లుక్కేయండి..


దేశంలో ఉబెర్ టెక్నికల్ డిపార్ట్‌మెంట్ 2014లో హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో పనిచేయడం ప్రారంభించింది. ఆ తర్వాత కంపెనీ మరింత విస్తరించింది. ప్రస్తుతం భారతదేశంలోని ఉబెర్ టెక్నాలజీ సెంటర్ యునైటెడ్ స్టేట్స్ తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్దది. హైదరాబాద్, బెంగళూరు సెంటర్లు కంపెనీకి సంబంధించిన రైడర్ ఇంజనీరింగ్, ఈట్స్ ఇంజనీరింగ్, ఎట్రా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రా టెక్, డేటా, మ్యాప్స్, Uber ఫర్ బిజినెస్, ఫైనాన్షియల్ టెక్నాలజీ, కస్టమర్ అబ్సెషన్ వంటి సాంకేతిక, ఇంజనీరింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి.

మరోవైపు, ఉబెర్‌తో పాటు ఓలాను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించే విషయంలో మరింత మెరుగ్గా స్పందించాలని లేకపోతే కఠిన చర్యలు తీసుకంటామని స్పష్టం చేసింది. రైడ్ క్యాన్సిల్ విధానంతో పాటు అనేక విషయాల్లో క్యాబ్ అగ్రిగేటర్లు అవలంభిస్తున్న బిజినెస్ పాలసీ అన్యాయంగా ఉందని ఇటీవల ఫిర్యాదులు భారీగా వచ్చాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆయా సంస్థల ప్రతినిధులతో ఇటీవల సమావేశమైంది. బుకింగ్‌లను అంగీకరించిన తరువాత డ్రైవర్ల ఒత్తిడి మేరకు వినియోగదారులు రైడ్‌ను రద్దు చేసుకుంటారని, తద్వారా అదనపు ఫైన్‌ను వినియోగదారులు కట్టాల్సి వస్తోందన్న విషయం తమ దృష్టికి వచ్చిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దీంతో ఆయా కంపెనీలు తమ వ్యవస్థలను మరింత మెరుగుపర్చుకోవాలని ఆదేశించామని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు.
Published by:Veera Babu
First published:

Tags: Appointment, Career and Courses, JOBS, Uber

తదుపరి వార్తలు