ప్రముఖ ఆన్లైన్ ట్యాక్సీ బుకింగ్(Taxi Booking) సేవల సంస్థ ఉబెర్ (Uber) తన సేవలను విస్తరించే చేసే దిశగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగా ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన టెక్ సెంటర్ల (Tech Centers)లో ఎక్కువ మంది సిబ్బందిని నియమించుకుంటోంది. ముఖ్యంగా ఇండియా (India)లోని టెక్ సెంటర్లలో ఉద్యోగుల సంఖ్యను భారీగా పెంచుతోంది. ఈ నేపథ్యంలోనే భారత్‌లో డిసెంబర్ 2022 నాటికి 500 మంది టెక్ ఉద్యోగులను నియమించుకునే ప్రణాళికలను ఉబెర్ ప్రకటించింది. ఇంజనీర్లు (Engineers), డేటా సైంటిస్ట్స్ (Data Scientists), ప్రోగ్రామ్ మేనేజర్ల (Program Managers)ను ఉబెర్ నియమించుకోనుంది. కంపెనీ ఇప్పటికే తన హైదరాబాద్, బెంగళూరులోని టెక్ సెంటర్లలో 1,000 మంది సభ్యుల బృందాన్ని కలిగి ఉంది.
ఉబెర్ 2021లో తన ఇండియన్ టీమ్స్‌లో 250 మంది ఇంజనీర్లను నియమించుకుంది. కంపెనీ యూఎస్, కెనడా(Canada), ఆమ్స్టర్డామ్(Amsterdam), భారత్‌లోని దాని జంట కేంద్రాలతో సహా దాని అన్ని టెక్ సెంటర్లలో ప్రపంచవ్యాప్తంగా టీమ్స్‌ను(Teams) విస్తరిస్తోంది. ఈ వారం ప్రారంభంలో, కంపెనీ తన బెంగళూరు టెక్‌లో కొత్త అంతస్తును కూడా ప్రారంభించింది. ఉబెర్ వైస్ ప్రెసిడెంట్, మొబిలిటీ ఇంజినీరింగ్ హెడ్ ప్రవీణ్ నెప్పల్లి నాగ మాట్లాడుతూ "ఉబెర్‌కు ఇండియా చాలా కీలకమైన మార్కెట్. మేం ఇక్కడ ఉన్న ట్విన్ టెక్ సెంటర్లలో పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా వరల్డ్-క్లాస్ ఇన్నోవేషన్‌తో ప్రొడక్ట్స్, సర్వీసెస్ లాంచ్ చేయడంలో ఇండియన్ టీమ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రతి ఒక్కరికి మా సర్వీసెస్ అందుబాటులోకి తెచ్చే విషయంలో మేం చాలా కమిటెడ్ గా ఉన్నాం. మా టెక్నాలజీ స్ట్రెంత్ ఇతర కంపెనీల నుంచి మమ్మల్ని వేరు చేస్తుంది." అని పేర్కొన్నారు.
Vivo Discount Offer: మూడు పాపులర్ స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్ ప్రకటించిన వివో
ఉబెర్ ఇంజనీరింగ్ సీనియర్ డైరెక్టర్ జయరామ్ వల్లీయూర్ మాట్లాడుతూ “ఉబెర్‌లోని టెక్ టీమ్‌లు మొబిలిటీ, డెలివరీ రంగంలో బెస్ట్ ఇన్నోవేషన్లను తీసుకొస్తున్నాయి. ఈ ఇన్నోవేషన్లు ఉబెర్ లాంటి కంపెనీలకు మార్గదర్శకం అవుతున్నాయి. టెక్ టీమ్‌లు డెలివరీ సేవలను మరింత మందికి చేరువ చేసేందుకు సమిష్టిగా కృషి చేస్తున్నాయి." అని అన్నారు.
"ఉబెర్ స్థానికంగా ఉద్యోగులను నియమించుకొని, గ్లోబల్‌గా రాణించాలనే లక్ష్యంతో తన గ్లోబల్ ఇంజనీరింగ్, ప్రొడక్ట్ టీమ్స్‌లో టాప్ క్లాస్ ఇంజనీర్లు, డేటా సైంటిస్ట్స్, ప్రోగ్రామ్ మేనేజర్లను నియమించుకోవడానికి సిద్ధమయ్యింది.” అని ఉబెర్ ఇంజనీరింగ్ సీనియర్ డైరెక్టర్ మణికందన్ తంగరత్నం తెలిపారు. ఉబెర్ భారతదేశంలో తన మొదటి టెక్ సెంటర్‌ను 2014లో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. ఈ సెంటర్ యూఎస్ తర్వాత ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద కేంద్రంగా మారింది. హైదరాబాద్, బెంగళూరులోని కేంద్రాలు ఉబెర్ కోసం రైడర్ ఇంజనీరింగ్, ఈట్స్ ఇంజనీరింగ్, ఇన్ఫ్రా టెక్, డేటా, మ్యాప్స్, ఉబెర్ ఫర్ బిజినెస్, ఫిన్‌టెక్, క్రిటికల్ అబ్సెషన్, గ్రోత్ & మార్కెటింగ్ వంటివి కీలకమైన విధులను నిర్వహిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, IT jobs, Tech employees, Tech jobs, Uber