వ‌రుస‌గా రెండు సార్లు టాప్‌: జేఈఈలో స‌త్తా చాటిన విద్యార్థులు

జేఈఈలో 100 ప‌ర్సంటైల్ సాధించిన విద్యార్థులు జే. వెంక‌ట ఆదిత్య, ఎం. ఆద‌ర్శ్‌రెడ్డి

జాయింట్ ఇంజ‌నీరింగ్ ఎంట్రెన్స్ ప‌రీక్ష‌(JEE) మెయిన్స్ సాధించ‌డం ఎంతో మంది విద్యార్థుల క‌ల‌. ఇప్ప‌టికే చాలా మంది టాప్‌లో నిలిచారు కూడా.. ఈ సారి తెలంగాణ‌కు చెందిన విద్యార్థులు వ‌రుస‌గా మార్చ్‌, జూలై రెండు సెష‌న్‌ల‌లో 100 ప‌ర్సంటైల్ సాధించి స‌త్తా చాటారు.

 • Share this:
  జాయింట్ ఇంజ‌నీరింగ్ ఎంట్రెన్స్ ప‌రీక్ష‌(JEE) మెయిన్స్ సాధించ‌డం ఎంతో మంది విద్యార్థుల క‌ల‌. ఇప్ప‌టికే చాలా మంది టాప్‌లో నిలిచారు కూడా కానీ తెలంగాణ‌కు చెందిన జె.వెంక‌ట ఆదిత్య‌, ఎం. ఆద‌ర్శ్‌రెడ్డి రెండు సార్లు టాప్‌లో నిలిచారు. 100 ప‌ర్స‌టైల్ సాధించ‌డ‌మే కాకుండా JEE మెయిన్స్‌లో కూడా 300/300 సాధించి స‌త్తా చాటారు. ప్ర‌స్తుతం ఐఐటీ బాంబే కోసం ప్రిపేర‌వుతున్నారు.
  నారాయ‌ణ విద్యా సంస్థ‌ల్లో చ‌దువుతున్న జె.వెంక‌ట ఆదిత్య‌, ఎం. ఆద‌ర్శ్‌రెడ్డి ఈ ఏడాది మార్చ్‌లో జ‌రిగిన ఇంజ‌నీరింగ్ ఎంట్రెన్స్ ప‌రీక్ష‌లో 100 ప‌ర్సంటైల్ సాధించారు. మ‌ళ్లీ జూలైలో జేఈఈ మెయిన్స్‌లో 300/300 స్కోర్ చేశారు. "నేను నా ప్రిప‌రేష‌న్‌ను ప‌రీక్షించుకొనే వాడిని" అని ఎం. ఆద‌ర్శ్‌రెడ్డి చెప్పాడు. ఆద‌ర్శ్ మూడు జేఈఈ మెయిన్ రాశాడు. అత‌ను ఫిబ్ర‌వ‌రిలో 99.99 ప‌ర్సంటైల్ స్కోర్ చేశారు. మార్చ్‌, జూలైలో 100 ప‌ర్సంటైల్ సాధించాడు. ఆదర్శ్ రెడ్డి త‌ల్లిదండ్రులు వైద్యుల తండ్రి స‌ర్జ‌న్‌, త‌ల్లి గైన‌కాల‌జిస్ట్ వారి కుటుంబంలో ఆద‌ర్శ్‌రెడ్డి మొద‌టి ఇంజ‌నీర్‌.
  "నేను జూలై ప‌రీక్ష‌ను మంచి అవకాశంగా భావించాను. ఈ ప‌రీక్ష నాకు మ‌రో నేష‌న‌ల్ లెవ‌ల్ ప‌రీక్ష‌కు కూర్చొనే అవ‌కాశం ఇచ్చింది" అని వెంక‌ట్ ఆదిత్య చెప్పాడు. ఆదిత్య ఫిబ్ర‌వ‌రిలో 99.99 ప‌ర్సంటైల్ సాధించాడు. మార్చ్‌, జూలైలో 100 ప‌ర్సంటైల్ సాధించాడు. ఆదిత్య తండ్రి టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌గా ప‌ని చేస్తున్నాడు. ఆయ‌న‌ను ఆద‌ర్శంగానే తీసుకొని చ‌దివాన‌ని ఆదిత్య చెప్పాడు. ఇద్ద‌రు టాప‌ర్లు వారి స‌క్సెకు కార‌ణం NCERT పుస్త‌కాలేని చెప్పారు. వాటితో పాటు పాత ప్ర‌శ్నాప‌త్రాలు, మోడ‌ల్ పేప‌ర్ల అభ్యాసం ఎంతో ఉప‌క‌రించాయ‌ని చెప్పారు. ఇద్ద‌రు రోజు 8 నుంచి 10 గంట‌లు చ‌దివామ‌ని ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ నుంచే జేఈఈ ల‌క్ష్యంగా ప్రిప‌రేష‌న్ ప్రారంభించామ‌ని వెల్ల‌డించారు.
  జేఈఈ మెయిన్స్‌లో 17మంది విద్యార్థులు జూలై సెష‌న్‌లో 100 ప‌ర్సంటైల్ సాధించారు. అందులో న‌లుగురు ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి మ‌రో న‌లుగురు తెలంగాణ వారు ఉన్నారు. ఈ రెండు రాష్ట్రాల విద్యార్థులే ఎక్కువ‌మంది 100 ప‌ర్సంటైల్ సాధించారు.
  Published by:Sharath Chandra
  First published: