తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL) భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. దీని నుంచి జూనియర్ లైన్‌మెన్, అసిస్టెంట్ ఇంజనీర్ నియామకాలకు సంబంధించి రెండు నోటిఫికేషన్లు విడుదల అయిన విషయం తెలిసిందే. మొత్తం 1,601 పోస్టులున్నాయి. అందులో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ పోస్టులు 48 కాగా, జూనియర్ లైన్‌మెన్ పోస్టులు 1553. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం జూనియర్ లైన్‌మెన్ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు మార్చి 8 నుంచి ప్రారంభం కాగా.. అభ్యర్థులు మార్చి 28 వరకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే రేపటితో ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. దీనికోసం ఆన్‌లైన్‌లో ఫారమ్ నింపాల్సి ఉంటుంది. అభ్యర్థులు TSSPDCL వెబ్‌సైట్ tssouthernpower.cgg.gov.inని సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత ప్రమాణాలు 10వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు లైన్‌మెన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వారు ఎలక్ట్రికల్ ట్రేడ్/వైర్‌మ్యాన్‌లో అర్హత కలిగి ఉండాలి. లేదంటే ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో రెండేళ్ల ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు ఉన్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు మాత్రమే జూనియర్ లైన్‌మెన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూనియర్ లైన్‌మెన్ పోస్టుకు నియమితులయ్యే అభ్యర్థులకు ప్రాథమిక వేతనంగా రూ.39,000 లభిస్తుంది. అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు ఎంపికైన వారికి రూ.64,295 బేసిక్ వేతనంతో మొత్తం రూ.99,345 వేతనం లభిస్తుంది. ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు రూ. 200 చెల్లించాలి. దీంతోపాటు పరీక్ష ఫీజుగా రూ.120 కూడా చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం రూ.320 చెల్లించాల్సి ఉంటుంది. SC/ST/BC కమ్యూనిటీకి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
పరీక్ష విధానం..
అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు..
పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష 100 మార్కులకు నిర్వహించబడుతుంది. ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు. ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు. జనరల్ నాలెడ్జ్ నుంచి 80 ప్రశ్నలు.. 80 మార్కులకు ఉంటుంది. మ్యాథ్స్, జనరల్ అవేర్ నెస్, ఇంగ్లీష్, తెలంగాణ సోషియో ఎకనామిక్ నుంచి మొత్తం 20 ప్రశ్నలు అడుగుతారు.
లైన్ మెన్ పరీక్ష విధానం..
TSSPDCL జూనియర్ లైన్ మాన్ రాత పరీక్షలో 80 మార్కులతో కూడిన 80 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. కోర్ I.T.I సబ్జెక్ట్‌పై 65 ప్రశ్నలతో కూడిన విభాగం A మరియు జనరల్ నాలెడ్జ్‌పై 15 ప్రశ్నలతో కూడిన విభాగం B ఉంటుంది. రాత పరీక్ష వ్యవధి 2 గంటలు. రాత పరీక్ష ఇంగ్లీష్ & తెలుగు భాషలో మాత్రమే నిర్వహించబడుతుంది. వీటికి ఇంటర్వ్యూ ఉండదు. కానీ.. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి పోల్ క్లైంబింగ్ పరీక్షకు రిజర్వేషన్ నియమాన్ని అనుసరించి పిలుస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Telangana government jobs, Telangana jobs, TSSPDCL