హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSPSC New Notifications: గుడ్ న్యూస్.. TSPSC నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల..

TSPSC New Notifications: గుడ్ న్యూస్.. TSPSC నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల..

TSPSC New Notifications: గుడ్ న్యూస్.. TSPSC నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల..

TSPSC New Notifications: గుడ్ న్యూస్.. TSPSC నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల..

టీఎస్పీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. ఈ రెండు నోటిఫికేషన్లు గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ నుంచి విడుదల అయ్యాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

టీఎస్పీఎస్సీ(TSPSC) నుంచి రెండు నోటిఫికేషన్లు(Notifications) విడుదల అయ్యాయి. ఈ రెండు నోటిఫికేషన్లు గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ కు సంబంధించినవి. వీటిలో నాన్ గెజిటెడ్ పోస్టులు(Non Gazetted) 25, గెజిటెడ్(Gazetted) పోస్టుల 32 ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు రెండు నోటిఫికేన్లను విడిగా విడుదల చేసింది టీఎస్పీఎస్సీ.

నాన్ గెజిటెడ్ పోస్టులకు దరఖాస్తుల ప్రారంభ తేదీ డిసెంబర్ 07, 2022

దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 28, 2022గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

నాన్ గెజిటెడ్ పోస్టుల వివరాలిలా..

1. టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రోజియాలజిస్ట్) - 07

2. టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రాలజిస్ట్ ) - 05

3.టెక్నికల్ అసిస్టెంట్ (జియో ఫిజిక్స్) - 08

4. ల్యాబ్ అసిస్టెంట్ - 01

5.జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ - 04

అర్హతలు..

టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రోజియాలజిస్ట్) ..  జియాలజీలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రాలజిస్ట్ )..  సివిల్ ఇంజనీరింగ్ లో జియాలజీ అనేది ఒక సబ్జెక్ట్ ఉండాలి. లేదా హైడ్రాలజీలో రెండేళ్ల ఎమ్సెస్సీ పూర్తి చేసి ఉండాలి.

టెక్నికల్ అసిస్టెంట్ (జియో ఫిజిక్స్)..  జియో ఫిజిక్స్ లో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. లేదా ఎంటెక్ లో జియో ఫిజిక్స్ పూర్తి చేసిన వారు అర్హులు.

ల్యాబ్ అసిస్టెంట్.. కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్ట్ తో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్..  జియాలజీలో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. లేదా మ్యాథమేటిక్స్ లేదా జియాలజీ ఒక సబ్జెక్ట్ తో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి..

అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

Teacher Jobs-Full Details: టీచర్ ఉద్యోగాలకు రెండు భారీ నోటిఫికేషన్లు.. 13,404  ఖాళీలకు దరఖాస్తుల ఆహ్వానం.. 

గెజిటెడ్ ఉద్యోగాలు..

గెజిటెట్ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ డిసెంబర్ 06, 2022 నుంచి ప్రారంభం కానుండగా.. డిసెంబర్ 27, 2022 వరకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ కొనసాగనుంది.

పోస్టుల వివరాలిలా..

అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ - 01

అసిస్టెంట్ కెమిస్ట్ - 04

అసిస్టెంట్ జియోఫిజిస్ట్ - 06

అసిస్టెంట్ హైడ్రో జియాలజిస్ట్ - 16

అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ - 05

అర్హతలు..

అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్..  మెటీరియాలజీ లేదా ఫిజిక్స్ లేదా మ్యాథమేటిక్స్ లేదా అప్లైడ్ మేథమేటిక్స్ లో మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలి.

అసిస్టెంట్ కెమిస్ట్..  కెమిస్ట్రీ లేదా అప్లైడ్ కెమిస్ట్రీలో డిగ్రీ కలిగి ఉండాలి. లేదా కెమికల్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేసిన వారు కూడా అర్హులు. వీటితో పాటు.. పీజీ కూడా ఉండాలి.

అసిస్టెంట్ జియోఫిజిస్ట్..  జియో ఫిజిక్స్ లో మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలి.

అసిస్టెంట్ హైడ్రో జియాలజిస్ట్..  జియాలజీలో మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలి.

అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్..  సివిల్ ఇంజనీరింగ్ లో జియోలజీ అనేది ఒక సబ్జెక్ట్ కలిగి ఉండాలి. లేదా హైడ్రాలజీలో మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలి.

వయోపరిమితి..

అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. దాని కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

First published:

Tags: JOBS, TSPSC, Tspsc jobs

ఉత్తమ కథలు