Home /News /jobs /

TWO DAYS MORE TO APPLY FOR NEET 2020

NEET 2020: నీట్‌కు దరఖాస్తు చేసేందుకు మరో రెండు రోజులే..

NEET 2020: నీట్ 2020 ఎగ్జామ్‌కు అప్లై చేయడానికి స్టెప్స్ ఇవే...
(ప్రతీకాత్మక చిత్రం)

NEET 2020: నీట్ 2020 ఎగ్జామ్‌కు అప్లై చేయడానికి స్టెప్స్ ఇవే... (ప్రతీకాత్మక చిత్రం)

మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు మరో రెండు రోజులే గడువు మిగిలి ఉంది. ఇప్పటికే రెండు సార్లు గడువును పొడగించారు. దరఖాస్తు చేసుకోనివారికి ఇదే చివరి అవకాశం.

    మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ స్థాయి పరీక్ష నీట్-2020కి దరఖాస్తు చేసుకునేందుకు మరో రెండు రోజుల గడువు మాత్రమే మిగిలింది. మొదటగా నీట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబర్ 31, 2019 వరకు గడువు తేదీగా నిర్ణయించింది. కానీ వెబ్‌సైట్‌లో సాంకేతిక కారణాల వల్ల జనవరి 6వ తేదీ వరకు పొడగించారు. ఇటీవల మరోసారి ఫిబ్రవరి 3 నుంచి 9వ తేదీ వరకు నీట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. దీంతో గడువుకు మరో రెండు రోజులే గడువు తేదీ ఉండడంతో దరఖాస్తు చేసుకోలేని వారికి సదావకాశంగా మారింది. నీట్‌కు దరఖాస్తు చేసుకున్నవారు మార్చి 27వ తేదీ వరకు అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 3వ తేదీన నీట్ ప్రవేశపరీక్షను దేశవ్యాప్తంగా 155 నగరాల్లో నిర్వహించనున్నారు. మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏఐఐఎంఎస్, జిప్మర్ ప్రవేశ పరీక్షలను నీట్‌లో కలపడం వల్ల దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో 76,928 మెడికల్, 26,949 దంత, 52,720 అయుష్, 1205 ఏఐఐఎంఎస్, 200 జిప్మర్ సీట్లలో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశ పరీక్షకు సంబంధించిన జవాబు పత్రం, ఓఎంఆర్ షీట్‌ను మే చివరివారంలో ఆన్‌లైన్‌లో విద్యార్థులకు అందుబాటులో ఉంచుతారు. తుది ఫలితాలను జూన్ 4న ప్రకటిస్తారు.

    నీట్ ప్రవేశపరీక్ష  ప్రధాన తేదీలు..

    దరఖాస్తు తుది గడువు : ఫిబ్రవరి 9, 2020
    అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ : మార్చి 27, 2020
    ప్రవేశ పరీక్ష : మే 3, 2020
    తుది ఫలితాలు : జూన్ 4, 2020

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
    Published by:Vijay Bhaskar Harijana
    First published:

    Tags: Andhra Pradesh, NEET 2020, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు