కాంపిటీటీవ్ ఎగ్జామ్స్ (Competitive Exams). లక్షలాది మంది అభ్యర్థులు పోటీ పడి రాస్తారు. ఆ పరీక్ష రాయడానికి కొన్ని ఏళ్ల శ్రమ కూడా దాగి ఉంటుంది అభ్యర్థులో.. ఒక పరీక్షకు అని కాకుండా రెండు మూడు పరీక్షలకు ఒకసారి ప్రిపేర్ అవుతుంటారు అభ్యర్థులు. అయితే తెలంగాణలో పలువురు అభ్యర్థులకు వింత అనుభవం ఎదురైంది. ఒకేరోజు రెండు కాంపిటీటీవ్ పరీక్షలు రాయాల్సి వస్తోంది. ఏళ్లుగా కష్టపడి ప్రిపేర్ అయిన తమకు ఇలాంటి పరిస్థితి ఏంటని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణలో టెట్ పరీక్ష (TET Exams) నిర్వహణ తేదీపై కొందరు అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. TS TET 2022 ను జూన్ 12వ తేదీన నిర్వహించనున్నట్టుగా తెలంగాణ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే టెట్ పరీక్ష రోజే రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB Exams) పరీక్ష ఉన్నందున.. టెట్ పరీక్ష వాయిదా వేయాలని ఓ వ్యక్తి ట్విట్టర్ ద్వారా తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను కోరారు.
తెలంగాణలో ఇలా ఒకే రోజు రెండు ఎగ్జామ్స్ ఉండటం వలన అభ్యర్థులు (Candidates) అయోమయానికి గురవతున్నారని.. టెట్ పరీక్ష వాయిదా వేయగలరని మనవి చేస్తున్నట్టుగా ఆయనకు చెప్పారు నెటిజన్లు. ఈ ట్వీట్‌పై స్పందించిన మంత్రి కేటీఆర్.. దానిని పరిశీలించాల్సిందిగా మంత్రి సబిత ఇంద్రారెడ్డి ట్యాగ్ చేశారు. దీంతో స్పందించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. టెట్ పరీక్షను వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేశారు. తాను విషయం వెల్లడించడానికి ముందు సంబంధిత అధికారులతో మాట్లాడానని చెప్పారు.
Request Minister @SabithaindraTRS Garu to consider https://t.co/3os4hO8jId
— KTR (@KTRTRS) May 21, 2022
ఇపుడు కుదరదు..
టెట్ పరీక్షలో సుమారు 3.5 లక్ష మంది పాల్గొనున్నారని మంత్రి సబిత చెప్పారు. ఇతర పోటీ పరీక్షలతో క్లాష్ కాకుండా పరీక్షా తేదీలను నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇతర అన్ని అంశాలను పరిగణలు తీసుకున్న నేపథ్యంలో.. టెట్ వాయిదా కుదరదని మంత్రివర్యులు స్పష్టం చేశారు. అయితే పరీక్షకు మరికొద్దిరోజులు సమయం ఉన్నందున విద్యాశాఖ నుంచి సానుకూల ప్రకటన రావొచ్చనే అభిప్రాయం చాలా మంది అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారు.
any other competitive exams. Taking everything into consideration postponing TET exams is not possible as it has cascading effect on other preparations of the Dept
— SabithaReddy (@SabithaindraTRS) May 21, 2022
ఐదేళ్ల అనంతరం పరీక్ష..
దాదాపు 5 ఏళ్ల తర్వాత టెట్ ఎగ్జామ్‌ను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది. అయితే ఈసారి బీఈడీ అభ్యర్థులకు కూడా పేపర్ 1 రాసేందుకు అవకాశమిచ్చామని అధికారులు తెలిపారు. అందుకే దరఖాస్తులు భారీగా వచ్చాయని అధికారులు చెప్పారు. ఇక టెట్ పరీక్ష కోసం జూన్ 6 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఇప్పటికే అధికారులు అభ్యర్థులకు తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం 6,29,352 అప్లికేషన్లు అందాయని వారు చెప్పారు. పేపర్ 1కు 3.51,468, పేపర్ 2కు 2,77,884 మంది దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 6 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Entrance exams, KTR, RRB, Rrb ntpc, Sabita indra reddy, TS TET 2022