హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Jobs In Hyderabad: కింగ్ కోటి ఆసుపత్రిలో ఉద్యోగాలు.. 7వ తరగతి, ఇంటర్ పూర్తి చేసిన వారు అర్హులు..

Jobs In Hyderabad: కింగ్ కోటి ఆసుపత్రిలో ఉద్యోగాలు.. 7వ తరగతి, ఇంటర్ పూర్తి చేసిన వారు అర్హులు..

Jobs In Hyderabad: కింగ్ కోటి ఆసుపత్రిలో ఉద్యోగాలు.. 7వ తరగతి, ఇంటర్ పూర్తి చేసిన వారు అర్హులు..

Jobs In Hyderabad: కింగ్ కోటి ఆసుపత్రిలో ఉద్యోగాలు.. 7వ తరగతి, ఇంటర్ పూర్తి చేసిన వారు అర్హులు..

తెలంగాణ వైద్య విధాన పరిషత్, హైదరాబాద్ MCH కింగ్ కోటిలో పలు ఖాళీ పోస్టుల భర్తీకీ కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అందుబాటులో ఉన్న పోస్టులు.. థియేటర్ అసిస్టెంట్ మరియు ల్యాబ్ టెక్నీషియన్. అర్హతలు, జీతం, దరఖాస్తు ఫారమ్ మరియు ఇతర వివరాల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...

తెలంగాణ వైద్య విధాన పరిషత్, హైదరాబాద్ MCH కింగ్ కోటిలో పలు ఖాళీ పోస్టుల భర్తీకీ కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అందుబాటులో ఉన్న పోస్టులు.. థియేటర్ అసిస్టెంట్ మరియు ల్యాబ్ టెక్నీషియన్. మొత్తం 05 పోస్ట్‌లు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు hyderabad.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకొని.. ఆగస్టు 2వ తేదీలోగా ఆఫ్ లైన ద్వారా దరఖాస్తులను పంపించాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అర్హతలో మెరిట్ ఆధారంగా, అనుభవజ్ఞులైన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి డాక్యెమెంట్ వెరిఫికేషన్ కు పిలుస్తారని పేర్కొన్నారు. ఈ TVVP హైదరాబాద్ థియేటర్ అసిస్టెంట్ , ల్యాబ్ టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ వయస్సు పరిమితులు, అర్హతలు, జీతం, దరఖాస్తు ఫారమ్ మరియు ఇతర వివరాల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

IBPS Reasoning Tips: బ్యాంక్ పరీక్షలో స్కోరింగ్ టాపిక్ ‘రీజనింగ్’.. తక్కువ సమయంలో ఎలా చేయాలో తెలుసుకోండి..


అందుబాటులో ఉన్న ఖాళీలు:

మొత్తం ఖాళీలు 5 పోస్టులు

థియేటర్ అసిస్టెంట్-03 పోస్టులు

ల్యాబ్ టెక్నీషియన్-02 పోస్టులు

విద్యా అర్హతలు:

థియేటర్ అసిస్టెంట్- 7 వ తరగతి ఉత్తీర్ణత మరియు ఆసుపత్రిలో నర్సింగ్ ఆర్డర్‌లీగా 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.

ల్యాబ్ టెక్నీషియన్- ఇంటర్మీడియట్ మరియు DMLT లేదా BSc MLT చేసి ఉండాలి.

వయో పరిమితులు:

OC అభ్యర్థులకు వయోపరిమితి 18-44 సంవత్సరాలు. ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులకు 18-49 ఏళ్ల వయస్సు ఉండాలి.

పే స్కేల్:

థియేటర్ అసిస్టెంట్ పోస్టులకు నెలకు రూ.10,000

ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నెలకు రూ.17,000

ఎంపిక ప్రక్రియ:

ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు పరిశీలించి అర్హత ఉన్న వ్యక్తులను మెరిట్ ప్రకారం ఇంటర్వ్యూకి పిలస్తారు. తర్వాత, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


ఎలా దరఖాస్తు చేయాలి:

అర్హత గల అభ్యర్థులు ఈ TVVP హైదరాబాద్ ఉద్యోగాల కోసం దరఖాస్తును చివరి తేదీ 02-08-2022న లేదా అంతకు ముందు సాయంత్రం 4 గంటలలోపు దరఖాస్తులను పంపించాలి. దరఖాస్తుల ఫారామ్ లను డౌన్ లోడ్ చేసుకొని.. వాటిలో ఇచ్చిన విధంగా వివరాలను నింపాలి. ఈ దరఖాస్తు ఫారమ్ తో పాటు.. కింద తెలిపిన డాక్యూమెంట్లను కూడా జత పరచాలి.

1. బోనఫైడ్ సర్టిఫికెట్లు (I నుండి VII) (వయస్సు రుజువు)

2. మార్క్స్ మెమో VII క్లాస్

3. కుల ధృవీకరణ పత్రం

4. ఆధార్ కార్డు

5. అనుభవ ధృవీకరణ పత్రం-5 సంవత్సరాలు

పైన పేర్కొన్న వాటిని ప్రింట్ తీసి.. జిరాక్స్ కాపీలను .. O/o ప్రోగ్రామ్ ఆఫీసర్(హాస్పిటల్ సర్వీసెస్ అండ్ ఇన్‌స్పెక్షన్స్), హైదరాబాద్, 4వ అంతస్తు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఖైరతాబాద్, బడా గణేష్ మండపం ఎదురుగా, ఖైరతాబాద్, హైదరాబాద్, 500004 అడ్రస్ కు పంపించాలి.

థియేటర్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆ ఫారమ్ ను ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోండి.. ల్యాబ్ టెక్నీషియన్ కొరకు ఇక్కడ క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి. ఈ పోస్టులను పూర్తిగా కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకోకున్నారు.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, Jobs in Hyderabad

ఉత్తమ కథలు