Home /News /jobs /

TTD SV VOCATIONAL DEGREE COLLEGE STARTED ADMISSIONS INVITES APPLICATIONS FROM STUDENTS HERE DETAILS NS

విద్యార్థులకు గుడ్ న్యూస్.. TTD ఆధ్వర్యంలోని కళాశాలలో ఉచిత విద్యతో పాటు వసతి.. ఇలా దరఖాస్తు చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య డిగ్రీ కళాశాల కీలక ప్రకటన విడుదల చేసింది. 2020-21 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది.

ఇంకా చదవండి ...
    తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య డిగ్రీ కళాశాల కీలక ప్రకటన విడుదల చేసింది. 2020-21 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు గాను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. ప్రీ డిగ్రీ(ఇంటర్ స్థాయి)లో సంస్కృతం, తెలుగు, హిందీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. ఇవి రెండేళ్ల కోర్సులని ప్రకటించింది. సంస్కృతం కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్హతను ఓఎస్‌ఎస్‌సీ, తెలుగు, హిందీలో ప్రవేశాలకు ఎస్‌ఎస్‌సీగా నిర్ణయించారు. వయస్సు 18 ఏళ్లకు మించరాదు. ఎంపికైన విద్యార్థులకు ఉచితంగా భోజనంతో పాటు వసతి సదుపాయం కల్పించనున్నారు. బాలురు, బాలికలకు వేర్వేరుగా హాస్టళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ కోర్సులకు ఎలాంటి ట్యూషన్ ఫీజు ఉండదని అధికారులు స్పష్టం చేశారు.
    ఆ ఉద్యోగాలకు అప్లై చేస్తున్న వారికి గుడ్ న్యూస్.. ఉచితంగా ఆన్ లైన్ కోచింగ్.. ఇలా దరఖాస్తు చేసుకోండి
    ఆ విద్యార్థులకు అలర్ట్.. కేంద్ర విద్యాశాఖ మంత్రి కీలక ప్రకటన

    దరఖాస్తుల ప్రక్రియ 01-01-2021న ప్రారంభం కాగా, 01-02-2021న ముగియనుంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు తిరుపతిలోని ఎస్వీ ఓరియంటల్ కాలేజీ కార్యాలయంలో విద్యార్థులు రూ.25 చెల్లించి దరఖాస్తులు పొందవచ్చు. తదుపరి వివరాల కోసం ఎస్వీ ఓరియంటల్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, తిరుమల తిరుపతి దేవస్థానం, కపిలతీర్థం రోడ్, తిరుపతి, ఫోన్: 0877-2264604, 0877-2263974,సెల్: 944088315 చిరునామాలో సంప్రదించవచ్చని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Andhra Pradesh, School admissions, Tirumala tirupati devasthanam, Tirupati, Ttd

    తదుపరి వార్తలు