తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్ పలు ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న చిల్డ్రన్ హార్ట్ సెంటర్ ఇది. ఈ హార్ట్ సెంటర్లో 8 ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని టీటీడీ స్వీకరిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్థులు 2022 జనవరి 20 లోగా దరఖాస్తు చేయాలి. అభ్యర్థులు ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేయాలి. అంటే అప్లికేషన్స్ పోస్టులో పంపాల్సి ఉంటుంది. లేదా మెయిల్లో పంపొచ్చు. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.
మొత్తం ఖాళీలు | 8 | విద్యార్హతలు | అనుభవం | వేతనం |
పీడియాట్రిక్ అసోసియేట్ థొరాసిక్ సర్జన్ | 1 | గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంసీహెచ్ ఇన్ కార్డియో థొరాసిక్ సర్జరీ లేదా డీఎన్బీ సీటీవీఎస్ పీజీ డిగ్రీ పాస్ కావాలి. | పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీలో నాలుగేళ్ల అనుభవం ఉండాలి. | రూ.209200 + అలవెన్సులు లభిస్తాయి. |
పీడియాట్రిక్ అసోసియేట్ సీటీ సర్జన్ | 1 | గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంసీహెచ్ ఇన్ కార్డియో థొరాసిక్ సర్జరీ లేదా డీఎన్బీ సీటీవీఎస్ పీజీ డిగ్రీ పాస్ కావాలి. | పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీలో ఏడాది అనుభవం ఉండాలి. | రూ.167400 + అలవెన్సులు లభిస్తాయి. |
అసిస్టెంట్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ | 2 | గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డీఎం, డీఎన్బీ పీడియాట్రిక్ కార్డియాలజీ పాస్ కావాలి. | పీడియాట్రిక్ కార్డియాలజీలో ఏడాది అనుభవం ఉండాలి. | రూ.167400 + అలవెన్సులు లభిస్తాయి. |
రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ | 1 | గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎండీ అనస్థీషియా, డీఎన్బీ అనస్థీషియా పీజీ డిగ్రీ పాస్ కావాలి. | డీఎం కార్డియాక్ అనస్థీషియా లేదా ఫెలోషిప్ ఇన్ కార్డియాక్ అనస్థీషియా ఉండాలి. | రూ.105810 + అలవెన్సులు లభిస్తాయి. |
అసిస్టెంట్ అనస్థీటిస్ట్ | 2 | గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ డిగ్రీ పాస్ కావాలి. | హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో కనీసం ఐదేళ్ల అనుభవం తప్పనిసరి. | రూ.105810 + అలవెన్సులు లభిస్తాయి. |
అసిస్టెంట్ పీడియాట్రీషియన్ | 1 | గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎండీ పీడియాట్రిక్స్, డీఎన్బీ పీజీ డిగ్రీ పాస్ కావాలి. | మూడేళ్ల అనుభవం తప్పనిసరి. | రూ.93800 + అలవెన్సులు లభిస్తాయి. |
Prasar Bharti Jobs: ప్రసార భారతిలో ఉద్యోగాలు... రూ.55,000 వరకు వేతనం
దరఖాస్తుకు చివరి తేదీ- 2022 జనవరి 20
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ప్రతీ పోస్టుకు అనుభవం తప్పనిసరి.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్: Director, Sri Padmavathi Children’s Heart center, Near BIRRD Premises, Tirupati – 517507.
దరఖాస్తులు పంపాల్సిన మెయిల్ ఐడీ: spchcttd@gmail.com
ఈ జాబ్ నోటిఫికేషన్‌తో పాటు అప్లికేషన్ ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
DSSSB Recruitment 2022: డిగ్రీ అర్హతతో 878 ఉద్యోగాలు... నేటి నుంచి దరఖాస్తులు
Step 1- అభ్యర్థులు ముందుగా https://www.tirumala.org/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
Step 2- హోమ్ పేజీలో నోటిఫికేషన్స్ సెక్షన్లోకి వెళ్లాలి.
Step 3- శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్లో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయాలి.
Step 4- నోటిఫికేషన్లోనే చివర్లో దరఖాస్తు ఫామ్ ఉంటుంది.
Step 5- దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని పూర్తి చేయాలి.
Step 6- అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి చివరి తేదీలోగా నోటిఫికేషన్లో వెల్లడించిన అడ్రస్‌కు చేరేలా పంపాలి. లేదా మెయిల్లో పంపొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Government Jobs, Job notification, JOBS, State Government Jobs, Tirupati, Ttd