హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TTD Jobs: టీటీడీ, బీఐఆర్ఆర్‌డీ ఆస్పత్రిలో కాంట్రాక్టు ఉద్యోగాలు..

TTD Jobs: టీటీడీ, బీఐఆర్ఆర్‌డీ ఆస్పత్రిలో కాంట్రాక్టు ఉద్యోగాలు..

టీటీడీ జాబ్స్

టీటీడీ జాబ్స్

తిరుప‌తిలోని తిరుమ‌ల తిరుమ‌తి దేవ‌స్థానానికి (Tirumala Tirupathi Devastanam) చెందిన బీఐఆర్ఆర్‌డీ ఆస్ప‌త్రిలో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల అయ్యింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 5, 2021 వరకు అవకాశం ఉంది.

ఇంకా చదవండి ...

తిరుప‌తిలోని తిరుమ‌ల తిరుమ‌తి దేవ‌స్థానానికి (Tirumala Tirupathi Devastanam) చెందిన బీఐఆర్ఆర్‌డీ ఆస్ప‌త్రిలో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెస‌ర్లు (Asst. Professor), రెసిడెంట్ డాక్ట‌ర్లు, సీనియ‌ర్ రెసిడెంట్ డాక్టర్లు (Senior Resident Doctors) డాక్ట‌ర్ల పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. కేవ‌లం ఆఫ్‌లైన్ (Off line) విధానంలో మాత్ర‌మే ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకొనే అవ‌కాశం ఉంది. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు అక్టోబ‌ర్ 5, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. ఈ పోస్టుల‌ను కాంట్రాక్టు (Contract) ప్రాతిప‌దిక‌న తీసుకోనున్న‌ట్లు నోటిఫికేష‌న్‌లో పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్య‌ర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.tirumala.org/SABIRRD.aspx ను సంద‌ర్శించి పూర్తి వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు.

పోస్టుల వివరాలు.. ఖాళీలు

పోస్టు పేరుఅర్హతలుఖాళీల సంఖ్య
అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఆర్థో-2, అనెస్థిసియా -2, రేడియోలజీస్ట్-1)ఎంబీబీఎస్ చేసి ఉండాలి,    (ఆర్థోపెడిక్స్/ అనెస్థిసియా/ రేడియోలజీ) లో ఎంఎస్ చేసి ఉండాలి. అంతే కాకుండా రెండేళ్ల టీచింగ్ అనుభవం ఉండాలి.  రేడియాలజీ విభాగం వారికి  ఒక సంవత్సరం అనుభవం చాలు.05
రెసిడెంట్ డాక్టర్ఎంబీబీఎస్, పీజీ డిప్లమా (ఆర్థో, అనెస్థిషియా)03
సీనియర్ రెసిడెంట్ డాక్టర్ఎంబీబీఎస్, ఎంఎస్/ ఎండీ (ఆర్థో, అనెస్థిషియా)03


Telangana Jobs: లా అసోసియేట్ ఉద్యోగాలు.. అర్హ‌త‌లు ఇవే


ఎంపిక విధానం..

1. మొత్తం మార్కులు: 100

i) PG డిగ్రీ / సూపర్ స్పెషాలిటీ పరీక్షలో అర్హత సాధించిన మార్కులకు 75%.

ii) అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన సంవత్సరాల నుంచి వెయిటేజ్ పూర్తయిన సంవత్సరానికి 10 మార్కులకు

iii) ప్రభుత్వం విభాగంలో కాంట్రాక్ట్ సర్వీస్ వెయిటేజీ 15%

• గిరిజన ప్రాంతంలో ప‌ని చేస్తే ఆరు నెలలకు 2.5 మార్కులు.

• గ్రామీణ ప్రాంతంలో ప‌ని చేస్తే ఆరు నెలలకు 2 మార్కులు.

• అర్బన్ ఏరియాలో ప‌ని చేస్తే ఆరు నెలలకు 1 మార్కు.

• సెంట్రల్ ఇనిస్టిట్యూషన్స్ నుంచి PG / సూపర్ స్పెషాలిటీ పూర్తి చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంలో అభ్యర్థులకు 5 మార్కుల వెయిటేజీ  ఉంటుంది.

iv) ఇంటర్వ్యూ మార్కులు ఉండవు.

- తుది నిర్ణ‌యం ఎంపిక క‌మిటీదే..

ద‌ర‌ఖాస్తు చేసుకొనే విధానం.

- కేవ‌లం ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

- ముందుగా అభ్య‌ర్థి అధికారి వెబ్‌సైట్ https://www.tirumala.org/SABIRRD.aspx ను సంద‌ర్శించాలి.

- అక్క‌డ ద‌ర‌ఖాస్తు ఫాంను డౌన‌ల్‌లోడ్ చేసుకోవాలి.

- పూర్తిగా నింపిన ద‌ర‌ఖాస్తును

డైరెక్టర్ (FAC),

BIRRD ట్రస్ట్ హాస్పిటల్,

TTD, తిరుపతి - 517501 కి పంపాలి.

- ద‌ర‌ఖాస్తులు చేరాల్సిన ఆఖ‌రు తేదీ అక్టోర్ 5, 2021

- అప్లికేష‌న్ క‌వ‌ర్‌పై కుడివైపు పైన కాంట్రాక్ట్ బేసిస్ రిక్రూట్‌మెంట్ - అప్లికేష‌న్ ఫ‌ర్ అని మీరు ద‌ర‌ఖాస్తు చేస్తున్న పోస్టు పేరు రాయాలి.

First published:

Tags: Andhra Pradesh Government Jobs, CAREER, Govt Jobs 2021, Job notification, JOBS, Ttd

ఉత్తమ కథలు