హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Fact Check: TTDలో 3 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్.. కీలక ప్రకటన చేసిన దేవస్థానం

Fact Check: TTDలో 3 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్.. కీలక ప్రకటన చేసిన దేవస్థానం

సాధారణ రోజుల్లో ప్రస్తుతం ప్రతి రోజూ దాదాపు 30వేల మందికి పైగా భక్తులను అనుమతిస్తోంది. అయితే ఇకపై తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కీలక సూచనలిచ్చింది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపిస్తున్న నేపథ్యంలో నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఇకపై రూల్స్ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది.

సాధారణ రోజుల్లో ప్రస్తుతం ప్రతి రోజూ దాదాపు 30వేల మందికి పైగా భక్తులను అనుమతిస్తోంది. అయితే ఇకపై తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కీలక సూచనలిచ్చింది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపిస్తున్న నేపథ్యంలో నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఇకపై రూల్స్ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది.

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)లో 3 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ కాబోతోందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వార్తపై టీటీడీ స్పందించి కీలక ప్రకటన విడుదల చేసింది.

  సోషల్ మీడియాలో రోజు రోజుకూ ఫేక్ న్యూస్ ల ప్రవాహం పెరిగిపోతోంది. సోషల్ మీడియా వేదికగా అనేక మంది తప్పుడు వార్తలను సృష్టించి అమాయకులను గందరగోళానికి గురి చేస్తున్నారు. ముఖ్యంగా విద్యా, స్కాలర్ షిప్ లు ఉద్యోగాలపై ఇటీవల కొందరు ఫేక్ ప్రకటనలను రూపొందించి ఇంటర్ నెట్లో ఉంచుతున్నారు. అవి వైరల్ గా మారుతున్నాయి. వాటిని నిజమనుకుని నమ్మి ఆ ఫేక్ వెబ్ సైట్లలో అనేక మంది అప్లై చేయడం, ఫీజులు చెల్లించడం లాంటివి చేస్తూ మోసపోతున్నారు. నిత్యం ఎక్కడో ఓ చోట ఇలాంటి ఘటనలు బయట పడుతూనే ఉన్నాయి. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)లో 3 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ కాబోతోందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అనేక మంది నిరుద్యోగులు ఇది నిజమని నమ్మి ఇతరులకు ఫార్వర్డ్ చేస్తున్నారు.

  కొందరైతే టీటీడీలో తమకు తెలిసిన వారిని సంప్రదించి ఎలాగైనా తమకు ఓ ఉద్యోగం ఇప్పించాలని కోరుతున్నారట కూడా. అయితే ఈ అంశంపై టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ ప్రచారం వాస్తవం కాదని స్పష్టం చేసింది. ఉద్యోగాల భర్తీ కోసం టీటీడీ ఇప్పటివరకు ఎలాంటి కసరత్తు ప్రారంభించలేదని స్పష్టం చేసింది. నిరుద్యోగులు ఇలాంటి అవాస్తవ ప్రచారాలు నమ్మి మోసపోవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. టీటీడీ విడుదల చేసిన ఈ ప్రకటనతో ఉద్యోగాల భర్తీ వార్త అవాస్తవమని తేలింది.

  ఇదిలా ఉంటే.. జేఈఈ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) కీలక హెచ్చరిక చేసింది. కొంత మంది ఫేక్ వెబ్ సైట్ క్రియేట్ చేసి అభ్యర్థుల నుంచి ఆన్లైన్ అప్లికేషన్లు, ఫీజును తీసుకుకుంటూ మోసం చేస్తున్నారని తెలిపింది. జేఈఈ మెయిన్స్ పరీక్ష కోసం అప్లై చేయాల్సిన వారు కేవలం అధికారిక వెబ్ సైట్ నుంచి మాత్రమే అప్లై చేసుకోవాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టం చేసింది. కొంత మంది jeeguide.co.in పేరుతో ఓ ఫేక్ వెబ్ సైట్ ను రూపొందించారని దాన్ని అస్సలు నమ్మ వద్దని అధికారులు సూచించారు. ఈ మేరకు తమకు ఫిర్యాదులు అందాయని NTA తెలిపింది. ఆ వెబ్ సైట్ తో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. తల్లిదండ్రులు, విద్యార్థులు అలాంటి ఫేక్ వెబ్ సైట్లను నమ్మి మోసపోవద్దని సూచించింది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in  ద్వారా మాత్రామే పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Fact Check, Govt Jobs 2021, JOBS, Tirumala tirupati devasthanam, Ttd

  ఉత్తమ కథలు