Home /News /jobs /

TSSPDCL RELEASED NOTIFICATION FOR 1000 JUNIOR LINEMEN JOBS HERE IS THE WRITTEN EXAM SYLLABUS NS

Telangana JLM Jobs Syllabus: తెలంగాణలో 1000 జూనియర్ లైన్ మెన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. సిలబస్ ఇదే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో ఇటీవల 1000 జూనియర్ లైన్ మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ నియామక పరీక్షకు సంబంధించిన సిలబస్ వివరాలు ఇలా ఉన్నాయి.

    తెలంగాణలో విద్యుత్ శాఖలో కొలువు జాతర (Telangana Electricity Jobs) జోరుగా సాగుతోంది. ఇటీవల దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (TSSPDCL) మరో 1000 జూనియర్ లైన్ మెన్ ఉద్యోగాల భర్తీకి అధికారులు జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు (Jobs) దరఖాస్తు పక్రియ ఈ నెల 19 నుంచి ప్రారంభమైంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 8ని ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే.. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. రాత పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థులకు ఉద్యోగాల లభిస్తాయి. రాత పరీక్షను ఆగస్టు 17 వ తేదీ న నిర్వహించనున్నారు. పరీక్షకు కొన్ని రోజుల ముందు హాల్ టికెట్లను విడుదల చేస్తారు. ఈ పరీక్షకు సంబంధించిన ఎగ్జామ్ సెంటర్లను జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటు చేయనున్నారు.

    అయితే.. ఈ రాత పరీక్ష విషయానికి వస్తే 80 మార్కులకు ఉంటుంది. మరో 20 మార్కులు Artisans, ఔట్ సోర్సింగ్ గా విధులు నిర్వర్తిస్తున్న వారికి వెయిటేజీ ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. రాత పరీక్షలో పార్ట్-ఏలో 65 మార్కులు I.T.I (Electrical Trade) కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. పార్ట్-బీలో మరో 15 మార్కులు జనరల్ నాలెడ్జ్ కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.
    TS Govt Jobs: తెలంగాణలో ఆ ఉద్యోగాల భర్తీ నిలిపివేత.. మంత్రి షాకింగ్ ప్రకటన.. అక్రమాలపై విచారణకు ఆదేశం

    పార్ట్-ఏ కు సంబంధించి అభ్యర్థులు ఈ కింది టాపిక్స్ చదువుకోవాల్సి ఉంటుంది..
    1. Fundamentals of electricity:
    2.Batteries:
    3. Magnetism:
    4. Fundamentals of AC:
    5. Basic Electronics:
    6. DC Machines:
    7. Transformers:
    8. AC Machines:
    9. Electrical measurements
    10. Electric Power generation


    పార్ట్-బీ జనరల్ నాలెడ్జ్ కు సంబంధించి ఈ కింది టాపిక్స్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది..
    1. Analytical and Numerical Ability.
    2. Current affairs.
    3. Consumer Relations.
    4. General Science in everyday life.
    5. Environmental Issues and Disaster Management.
    6. History, Geography and Economy of India and Telangana.
    7. History of Telangana and Telangana Movement.
    8. Society, Culture, Heritage, Arts and Literature of Telangana.
    మిగతా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన జనరల్ సైన్స్ సిలబస్ చదువుకుంటే పార్టీ బీ దాదాపు కవర్ అవుతుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Job notification, JOBS, Telangana government jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు