Telangana Jobs: తెలంగాణ విద్యుత్ సంస్థలో 3025 ఉద్యోగాలు... టెన్త్, ఐటీఐ, డిగ్రీ అర్హత

TSSPDCL Recruitment 2019 | జూనియర్ లైన్‌మెన్, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ వేర్వేరు నోటిఫికేషన్లు వచ్చాయి. ఆసక్తిగల అభ్యర్థులు tssouthernpower.com లేదా tssouthernpower.cgg.gov.in వెబ్‌సైట్స్‌లో నోటిఫికేషన్ చూడొచ్చు.

news18-telugu
Updated: October 17, 2019, 11:34 AM IST
Telangana Jobs: తెలంగాణ విద్యుత్ సంస్థలో 3025 ఉద్యోగాలు... టెన్త్, ఐటీఐ, డిగ్రీ అర్హత
Telangana Jobs: తెలంగాణ విద్యుత్ సంస్థలో 3025 ఉద్యోగాలు... టెన్త్, ఐటీఐ, డిగ్రీ అర్హత (image: Wikimedia)
news18-telugu
Updated: October 17, 2019, 11:34 AM IST
తెలంగాణలో మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్-TSSPDCL భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. జూనియర్ లైన్‌మెన్-JLM, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్-JACO, జూనియర్ పర్సనల్ ఆఫీసర్-JPO పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది. మొత్తం 3025 ఖాళీలను ప్రకటించింది TSSPDCL. ఈ పోస్టుల భర్తీకి కొద్ది రోజుల క్రితమే ప్రకటన జారీ అయింది. అప్పట్నుంచి నిరుద్యోగులు నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వేర్వేరు నోటిఫికేషన్లు వచ్చాయి. ఆసక్తిగల అభ్యర్థులు tssouthernpower.com లేదా tssouthernpower.cgg.gov.in వెబ్‌సైట్స్‌లో నోటిఫికేషన్ చూడొచ్చు. జేపీఓ, జేఎల్ఎం పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 22న, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు అక్టోబర్ 31న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోండి.

TSSPDCL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు- 3025

జూనియర్ లైన్‌మెన్- 2500
జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్- 500
జూనియర్ పర్సనల్ ఆఫీసర్- 25



జేపీఓ, జేఎల్ఎం పోస్టులకు ఫీజు పేమెంట్ ప్రారంభం- 2019 అక్టోబర్ 21
Loading...
జేపీఓ, జేఎల్ఎం పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం- అక్టోబర్ 22
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ- 2019 నవంబర్ 10 సాయంత్రం 5 గంటలు
దరఖాస్తు సబ్మిట్ చేయడానికి చివరి తేదీ- 2019 నవంబర్ 10 రాత్రి 11.59 గంటలు
హాల్ టికెట్స్ డౌన్‌లోడ్- 2019 డిసెంబర్ 5
పరీక్ష తేదీ- 2019 డిసెంబర్ 15

జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు ఫీజు పేమెంట్ ప్రారంభం- అక్టోబర్ 30
జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం- అక్టోబర్ 31
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ- 2019 నవంబర్ 20 సాయంత్రం 5 గంటలు
దరఖాస్తు సబ్మిట్ చేయడానికి చివరి తేదీ- 2019 నవంబర్ 20 రాత్రి 11.59 గంటలు
హాల్ టికెట్స్ డౌన్‌లోడ్- 2019 డిసెంబర్ 11
పరీక్ష తేదీ- 2019 డిసెంబర్ 22

TSSPDCL Recruitment 2019: విద్యార్హతల వివరాలివే...


జూనియర్ లైన్‌మెన్: 10వ తరగతి, ఎలక్ట్రికల్ ట్రేడ్/ వైర్‌మెన్ ట్రేడ్‌లో ఐటీఐ లేదా ఇంటర్మీడియట్‌లో ఎలక్ట్రికల్ వొకేషనల్ కోర్స్.
జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్: గ్రాడ్యుయేషన్
జూనియర్ పర్సనల్ ఆఫీసర్: బీఏ, బీకామ్, బీఎస్సీలో ఫస్ట్ క్లాస్ డిగ్రీ
వయస్సు: జూనియర్ లైన్‌మెన్ పోస్టులకు 18 నుంచి 35 ఏళ్లు, జూనియర్ పర్సనల్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు 18 నుంచి 34 ఏళ్లు.
ఫీజు: అప్లికేషన్‌కు రూ.100, పరీక్షకు రూ.120.

జూనియర్ లైన్‌మెన్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జూనియర్ పర్సనల్ ఆఫీసర్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తక్కువ ధరతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... రెడ్‌మీ 8 ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Post Office Jobs: తెలంగాణలో 970, ఏపీలో 2707 జాబ్స్... 10వ తరగతి పాసైతే చాలు

CBSE Jobs: సీబీఎస్ఈలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

Railway Jobs: రైల్వేలో 2590 అప్రెంటీస్ పోస్టులు... అర్హతలివే
First published: October 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...