Home /News /jobs /

TSSPDCL RECRUITMENT 2022 ARE YOU APPLYING FOR JUNIOR LINE MEN JOBS DISTRICT WISE VACANCY DETAILS EVK

TSSPDCL Recruitment 2022: జూనియర్ లైన్ మెన్ ఉద్యోగాలకు ద‌ర‌ఖాస్తు చేస్తున్నారా.. జిల్లాల వారీగా ఖాళీల వివ‌రాలు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

TSSPDCL Recruitment 2022 | తెలంగాణలో విద్యుత్ శాఖ దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (TSSPDCL) నుంచి 1000 జూనియర్ లైన్ మెన్ ఉద్యోగాల భర్తీకి అధికారులు జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. ఈ నేప‌థ్యంలో జిల్లా వారీగా పోస్టుల వివ‌రాలు తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
    తెలంగాణలో విద్యుత్ శాఖ  దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (TSSPDCL) నుంచి 1000 జూనియర్ లైన్ మెన్ ఉద్యోగాల భర్తీకి అధికారులు జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు (Jobs) దరఖాస్తు పక్రియ ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుందని అధికారులు వెల్లడించారు. అప్లై చేసుకోవడానికి జూన్ 8ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.  ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కోసం అధికారిక వెబ్సైట్ https://www.tssouthernpower.com/  ను సందర్శించాల్సి ఉంటుంది.  ఈ ఉద్యోగాల  భర్తీకి సంబంధించిన

    TSPCDL Recruitment 2022: నిరుద్యోగుల‌కు అల‌ర్ట్‌.. విద్యుత్ శాఖ నుంచి 201 పోస్టుల‌కు మ‌రో నోటిఫికేష‌న్ వివ‌రాలు!

    జిల్లాల వారీగా పోస్టుల వివరాలు.. 































































































    జిల్లాఖాళీలు
    మహబూబ్ న‌గ‌ర్‌43
    నారాయ‌ణపేట్‌18
    వ‌న‌ప‌ర్తి19
    నాగ‌ర్ క‌ర్నూల్‌31
    గ‌ద్వాల్‌13
    న‌ల్ల‌గొండ‌61
    సూర్యాపేట్‌48
    యాదాద్రి44
    మెద‌క్‌27
    సిద్దిపేట‌39
    సంగారెడ్డి56
    వికారాబాద్‌26
    మేడ్చెల్‌75
    హ‌బ్సీగూడా87
    సైబ‌ర్‌సిటీ45
    రాజేంద్ర‌న‌గ‌ర్‌48
    స‌రూర్‌న‌గ‌ర్‌48
    బంజారాహిల్స్‌67
    సికింద్రాబాద్‌75
    హైద‌రాబాద్ సౌత్‌59
    హైద‌రాబాద్ సెంట్ర‌ల్‌66
    ఎస్‌సీఏడీఏ05

    దరఖాస్తుల వివరాలు:
    ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 19 నుంచి ప్రారంభం అవుతుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీ నుంచి అధికారిక వెబ్ సైట్ https://tssouthernpower.cgg.gov.in లో అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జూలై 11 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతర జూలై 17 వారికి రాత పరీక్ష నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

    Jobs in AP: విశాఖ‌ప‌ట్నంలో కాంట్రాక్టు ఉద్యోగాలు.. వేతనం రూ.28,000.. అర్హతల వివరాలు

    విద్యార్హతల వివరాలు:
    టెన్త్ తో పాటు ఐటీఐలో ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌, వైర్‌మెన్‌ లేదా ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌ లో ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సు పాసైన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు అధికారులు.

    Study Tips: ఎక్కువ సేపు చ‌దువ‌లేక‌పోతున్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

    వయో పరిమితి:
    ఈ ఉద్యోగాలకు దరఖాస్తుదారుల వయస్సు 18-35 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్ల పాటు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు.

    దరఖాస్తు ఫీజు: ప్రతీ అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఎగ్జామ్ పీజు కింద రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఎగ్జామ్ ఫీజు చెల్లింపులో మినహాయింపు ఇచ్చారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Govt Jobs 2022, Job notification, JOBS, Jobs in telangana, Ts jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు