TSSPDCL RECRUITMENT 2022 ARE JUNIOR LINE MEN APPLYING FOR JOBS LEARN THESE THINGS EVK
TSSPDCL Recruitment 2022: జూనియర్ లైన్ మెన్ జాబ్స్ అప్లై చేస్తున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)
TSSPDCL Recruitment 2022 | తెలంగాణలో విద్యుత్ శాఖ దక్షిణతెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ నుంచి 1000 జూనియర్ లైన్ మెన్ ఉద్యోగాల భర్తీకి దరాఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ అభ్యర్థులు ఈ విషయాలపై దృష్టి సారించండి.
తెలంగాణలో విద్యుత్ శాఖ దక్షిణతెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (TSSPDCL) నుంచి 1000 జూనియర్ లైన్ మెన్ ఉద్యోగాల భర్తీకి అధికారులు జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు (Jobs) దరఖాస్తు పక్రియ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. అప్లై చేసుకోవడానికి జూన్ 8ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కోసం అధికారిక వెబ్సైట్ https://www.tssouthernpower.com/ ను సందర్శించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పరీక్ష ప్యాటర్న్, సెలబస్ వివరాలు తెలుసుకోండి.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 19 నుంచి ప్రారంభం అవుతుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీ నుంచి అధికారిక వెబ్ సైట్ https://tssouthernpower.cgg.gov.in లో అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జూలై 11 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతర జూలై 17 వారికి రాత పరీక్ష నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
పరీక్ష విధానం..
- 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.
- 80 మార్కులు రాత పరీక్ష ద్వారా అభ్యర్థులు సాధించాలి.
- కెటగిరీల వారీగా కట్ ఆఫ్ ఉటుంది.
- జనరల్&ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40శాతం, బీసీ అభ్యర్థులకు 35శాతం, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 30శాతం మార్కులు కట్ ఆఫ్గా నిర్ణయించారు.
- 20 మార్కులు వరకు వెయిటేజీ మార్కులు ఔట్సోర్సింగ్, ఇతర విభాగాల వారికీ వెయిటేజీ ఉంటుంది.
టెన్త్ తో పాటు ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్, వైర్మెన్ లేదా ఎలక్ట్రికల్ ట్రేడ్ లో ఇంటర్ ఒకేషనల్ కోర్సు పాసైన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు అధికారులు.
సెలబస్ వివరాలు..
- 80 మార్కులలో 65 మార్కులు : I.T.I (Electrical Trade) విభాగం నుంచి వస్తాయి.
- ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, బ్యాటరీస్, మ్యాగనటీసిమ్, ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ, బేసిక్ ఎలక్ట్రానిక్స్, డీసీ మిషన్, ట్రాన్స్ఫార్మర్స్, ఏసీ మిషన్స్, ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్, ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్
- 15 మార్కులు జనరల్ నాలెడ్జ్ నుంచి వస్తాయి.
అవే అనలిటిక్ న్యూమెరికల్ ఎబిలిటీ, కరెంట్ ఎఫైర్స్, కంజ్యూమర్ రిలేషన్స్, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంట్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, హిస్టరీ, జాగ్రీ, అండ్ ఎకనామిక్స్ ఆఫ్ ఇండియా, అండ్ తెలంగాణ, హిస్టరీ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ ఉద్యమం, సొసైటీ, కల్చర్, వారసత్వం, తెలంగాణ ఆర్ట్స్ అండ్ లిటరేషర్ టాపిక్స్ ఉంటాయి.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.